‘అవును... రిలేషన్‌షిప్‌లో ఉన్నాం’ | Harshvardhan Rane Confirms Relationship With Kim Sharma | Sakshi
Sakshi News home page

‘అవును... రిలేషన్‌షిప్‌లో ఉన్నాం’

Dec 19 2018 7:11 PM | Updated on Dec 19 2018 7:42 PM

Harshvardhan Rane Confirms Relationship With Kim Sharma - Sakshi

నేను చాలా ఓపెన్‌గా ఉంటాను. ఇందులో దాయాల్సింది ఏమీలేదు.

బాలీవుడ్‌ నటి కిమ్‌ శర్మ, తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నామని స్పష్టం చేశాడు ‘అవును’ సినిమా ఫేం హర్షవర్ధన్‌ రాణే. గత కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంటపై బీ- టౌన్‌లో రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడూ కూడా తమ మధ్య ఉన్న బంధం గురించి వీరు నోరు విప్పలేదు.

ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హర్షవర్ధన్‌... ‘నేను చాలా ఓపెన్‌గా ఉంటాను. ఇందులో దాయాల్సింది ఏమీలేదు. అవును ప్రస్తుతం తన(కిమ్‌)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. తన గురించి నాకు శ్రద్ధ ఉంటుంది కదా. అందుకే వ్యక్తిగత విషయాల గురించి చర్చించదలచుకోలేదు. టీనేజ్‌లోనే ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చాను. సైబర్‌ కేఫ్‌లో కొన్నాళ్లు, ఎస్టీడీ బూత్‌లో మరికొంత కాలం పనిచేశాను. ఇప్పుడు నటుడిగా స్థిరపడ్డాను. నా జీవితం తెరచిన పుస్తకమే’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా, షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘మొహబ్బతే’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కిమ్‌ శర్మ.. ఫిదా, తుమ్‌సే అచ్చా కౌన్‌ హై, కహెతా హై దిల్‌ బార్‌ బార్‌ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ఖడ్గం సినిమాలో మెరిసిన ఈ భామ.. ‘మగధీర’లో ప్రత్యేక గీతంలో నర్తించింది. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడిన కిమ్‌... విభేదాల కారణంగా ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది. ఇక తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హర్షవర్ధన్‌... రవిబాబు ‘అవును’, ‘అవును2’ చిత్రాల ద్వారా ఫేమస్‌ అయ్యాడు. తాజాగా ‘ఫిదా’ సినిమాలో అతిథి పాత్రలో కన్పించాడు. 2016లో సనమ్‌ తేరీ కసమ్‌ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement