చైతూ@14
హీరోగా పరిచయమైన ఎనిమిదేళ్ల తర్వాత మేనమామ, ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు నిర్మాణ సంస్థలో అక్కినేని నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నారు. చైతూకి ఇది 14వ సినిమా. కృష్ణ ఆర్.వి. మరిముతు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో లావణ్యా త్రిపాఠి కథానాయిక. సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలసి వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కెమేరా స్విచ్చాన్ చేయగా, దర్శక–నిర్మాత గుణ్ణం గంగరాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు డి. సురేశ్‌బాబు, దేవినేని ప్రసాద్‌లు చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.
సాయి కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘నాగచైతన్య హీరోగా సురేశ్‌బాబు గారితో కలసి మా సంస్థలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. హీరో శ్రీకాంత్, రావు రమేశ్‌లు కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమా చిత్రీక రణ త్వరలోనే ప్రారంభిస్తాం’’ అన్నారు. కథానాయికగా నా ప్రయాణం ప్రారంభించిన నిర్మాణ సంస్థలో మళ్లీ నటించే అవకాశం రావడం సంతో షంగా ఉందని లావణ్యా త్రిపాఠి తెలిపారు. హీరోలు శ్రీకాంత్, అవసరాల శ్రీనివాస్, రచయిత విజయేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, కెమేరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, నిర్మాత: రజనీ కొర్రపాటి, సమర్పణ: సాయి శివాణి.