హీరో పోలీస్ డ్రెస్ వేసిన సినిమా హిట్టే! | Hero police dress : Hit Movie | Sakshi
Sakshi News home page

హీరో పోలీస్ డ్రెస్ వేసిన సినిమా హిట్టే!

Published Tue, Sep 16 2014 6:49 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మహేష్ బాబు - పవన్ కల్యాణ్ - Sakshi

మహేష్ బాబు - పవన్ కల్యాణ్

టాలీవుడ్ హీరోలు పోలీస్ యూనిఫాం వేశారంటే దాదాపుగా ఆ మూవీ హిట్టే. పోలీస్ కథలు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో నటించిన పోకిరి ఇండస్ట్రీ రికార్డ్స్ను తిరిగరాసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీస్ డ్రెస్ వేసుకున్న గబ్బర్ సింగ్ కూడా అంతకు ముందు రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే.  ప్రిన్స్ మహేష్ పోలీస్ డ్రెస్ ఫార్ములాని ఫాలోఅయిపోతున్నాడు. ఆయనను పోలీస్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఎక్కడా ఆగనంటూ ఫుల్ ఎనర్జీతో వస్తున్నాడు. అతడు పోలీస్ డ్రెస్ వేస్తే కలెక్షన్ల వర్షం కురిసినట్లేనని నిర్మాతల భావన.  పోకిరి  తర్వాత రిలీజైన దూకుడు కూడా బాక్సాఫీసు వద్ద విజయపథంలో దూసుకుపోయింది.

ఇప్పుడు మహేష్ మరోసారి ఆగడులో పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. శ్రీను వైట్ల, ప్రిన్స్ కాంబినేషన్లో రాబోతోన్న ఈ మూవీ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, పాటలు సినిమాపై  ఎక్స్పెక్టేషన్స్ను పెంచేస్తున్నాయి. దూకుడు కన్నా ఆగడు ఇంకా డిఫరెంట్గా ఉంటుందని మహేష్ బాబు చెబుతున్నారు. ట్రైలర్లో తన పంచ్ డైలాగ్స్తో మహేష్ మంటలు పుట్టిస్తున్నాడు. ఇక సినిమా రిలీజైతే ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్గా నటించింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్లలో విడుదల చేస్తోంది. ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement