అడ్వాన్స్ తిరిగివ్వనన్న హీరోయిన్ | Heroine Haripriya Refuses to return money back | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్ తిరిగివ్వనన్న హీరోయిన్

Published Mon, Sep 22 2014 6:45 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

అడ్వాన్స్ తిరిగివ్వనన్న హీరోయిన్

అడ్వాన్స్ తిరిగివ్వనన్న హీరోయిన్

కాజల్ అగర్వాల్ పై తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ ఫిర్యాదు చేసిన ఉదంతం మరకముందే మరో హీరోయిన్ వివాదాల్లో చిక్కుకుంది. అడ్వాన్స్ గా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇచ్చేందుకు సదరు సమ్మతించకపోవడంతో నిర్మాతల మండలిని ఆశ్రయించారు. ఈ వివాదంలో ఇరుకున్న ఆ హీరోయిన్ పేరు హరిప్రియ.

తకిటతకిట, పిల్లజమీందార్, అబ్బాయ్ క్లాస్- అమ్మాయి మాస్ సినిమాల్లో నటించిన ఈ భామ కన్నడంలో 'ఫ్లై' అనే సినిమా ఒప్పుకుంది. తర్వాత అగ్రనటుడు సుదీప్ సరసన నటించే ఛాన్స్ రావడంతో 'ఫ్లై' నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను పెట్టుకున్నారు. అయితే అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని నిర్మాతలు అడిగితే ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పేసిందట హరిప్రియ. చేసేది లేక ఆమెపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement