సూపర్ హీరో సినిమాలంటే ఎలా ఉండాలి? భారీ విజువల్ ఎఫెక్ట్స్.. అదిరిపోయే యాక్షన్ సీన్లు.. గాల్లోకి ఎగిరి విలన్ల భరతం పట్టే హీరో.. ఎలాంటి పనైనా ఇట్టే చేయగల పవర్స్.. విధ్వంసం సృష్టించే విలన్.. అబ్బా! ఒకటా రెండా సినిమా అంతా హంగామా. 2016లో ఇలాంటి అన్ని హంగులూ ఉంటూనే ఒక కొత్తదనం చూపించిన సూపర్ హీరో సినిమా వచ్చింది. దాని పేరు ‘డెడ్‌పూల్’.
డెడ్‌పూల్ చూపిన కొత్తదనం ఏంటంటే.. కామెడీ, యాక్షన్ సినిమా అన్న బ్రాండ్‌నే ఏళ్లుగా సంపాదించి పెట్టుకున్న సూపర్ హీరో జానర్.. ‘డెడ్‌పూల్’తో కామెడీగా కూడా మెప్పించగలదని నిరూపించింది. ఈ ప్రయోగం సూపర్ హీరో జానర్ ఫ్యాన్స్‌కు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ‘డెడ్‌పూల్’ బ్లాక్‌బస్టర్ అయింది. దీంతో ఆ వెంటనే ‘డెడ్‌పూల్’కు సీక్వెల్‌ను పట్టుకొచ్చేసింది మార్వెల్ స్టూడియోస్.
ఈ మధ్యే విడుదలైన ‘డెడ్‌పూల్ 2’ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కేబుల్ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన ట్రైలర్ అయితే ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. డెడ్‌పూల్, కేబుల్ మధ్యన వచ్చే సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ రెండు క్యారెక్టర్స్‌తో ఇటు యాక్షన్, అటు కామెడీ రెండింటికీ తిరుగుండదని తెలుస్తోంది. 2018 మే 18న విడుదల కానున్న ఈ సినిమాకు డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించాడు. డెడ్‌పూల్ క్యారెక్టర్‌లో ర్యాన్ రేనాల్డ్స్ నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment