'నిజ జీవితంలో నాకు సిగ్గు ఎక్కువ' | I am shy in real life: Sunny Leone | Sakshi
Sakshi News home page

'నిజ జీవితంలో నాకు సిగ్గు ఎక్కువ'

Published Mon, Jan 25 2016 12:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'నిజ జీవితంలో నాకు సిగ్గు ఎక్కువ' - Sakshi

'నిజ జీవితంలో నాకు సిగ్గు ఎక్కువ'

ముంబై: సినీ కెరీర్‌లోనూ, తన అభిప్రాయాలను వెల్లడి చేయడంలోనూ ధైర్యవంతురాలిగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ హీరోయిన్‌ సన్నీ లియోన్‌. అయితే నిజజీవితంలో మాత్రం ఆమె ఎక్కువగా సిగ్గుపడతారట. ఈ విషయాన్ని ఆమెనే చెప్పింది. 'ఓ వేడుకలోనో, ఫక్షన్‌ లోనో, అవార్డు షోలోనో ఉన్నప్పుడు నేను సిగ్గుపడతాను. నిజజీవితంలో నేను బాగా సిగ్గు పడతానన్న విషయాన్ని నమ్మడం ప్రజలకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కానీ ఇది నిజం' అని ఆమె తెలిపింది. టీవీలో కనిపించినట్టు తాను నిజజీవితంలో అంతా ఓపెన్‌గా మాట్లాడలేనని తెలిపింది.

'హాయ్‌, హలో అని చెప్పాలని నాకూ ఉంటుంది. కానీ సిగ్గు అడ్డుపడుతుంది. నేను గర్విష్టినని, నాకు అహంభావం ఎక్కువని ప్రజలు అనుకోవచ్చు. కానీ నాకు సిగ్గు ఎక్కువ. నా జీవితమంతా ఇలాగే ఉండాలని అనుకుంటున్నా. విందులు, వినోదాల్లో జాలీగా ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు' అని సన్నీ తెలిపింది. ఒకప్పుడు పోర్న్‌స్టార్ అయిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలో తనను అంతగా రిసీవ్‌ చేసుకోలేదని చెప్పింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, బాలీవుడ్ ప్రముఖులు సైతం సోషల్‌ మీడియాలో తన సందేశాలకు స్పందిస్తున్నారని ఆమె తెలిపింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తనను అనుసరించడమో, తన ట్వీట్స్‌కు స్పందించడమో చేస్తున్నారని, ఆరు నెలల కిందట ఇలాంటి పరిస్థితి లేదని ఆమె పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement