shy
-
కొత్త పెళ్లికూతురు శోభిత డ్యాన్స్.. ఒక రేంజ్లో ఉందిగా!
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ముచ్చట్లు ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ప్రభుతో విడిపోయిన తరువాత నాగచైతన్య నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఎంగేజ్మెంట్, పసుపు కొట్టుడు, హల్దీ, మూడు ముళ్ల వేడుక ఇలా ప్రతీ వేడుక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్‌మీడియాలో పెళ్లి కూతురు ముస్తాబులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సంచలనంగా మారింది.శోభిత పెళ్లికి మేకప్ చేసిన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో ఈ వీడియోను షేర్ చేసింది.దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒక వైపు ముస్తాబవుతానే.. మరోవైపు బ్లాక్ బస్టర్..బ్లాక్ బస్టరే అంటూ మాస్ మాస్‌గా స్టెప్పులేయడం ఈ వీడియోలు చూడొచ్చు. " శ్రద్ధా...మేరీ షాదీ హో రహీ హై (నా పెళ్లి అయిపోతోంది) అంటూ సిగ్గుల మొగ్గే అయింది శోభిత. View this post on Instagram A post shared by Shraddha Mishra (@shraddhamishra8) కాగా గత వారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో లవ్‌బర్డ్స్ నాగచైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. -
నగరంలో తీవ్రమవుతున్న ‘షైనెస్’ సమస్య
సాక్షి, సిటీబ్యూరో: ‘‘పద్దెనిమిదేళ్ల వయసు. బీటెక్ చదువుతోంది. కానీ నోరు తెరిచి తండ్రితో నాలుగు మాటలు మాట్లాడలేదు. ఇంటికి చుట్టాలొచ్చినా పలకరించదు. తన లోకం తనది, అలాగని చదువులో ఏ మాత్రం వెనుకబడకుండా బాగానే చదువుతోంది. తనకు కావలసినవన్నీ తండ్రికి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుంది. ఈ ధోరణి చూస్తోంటే ఆందోళనగా ఉంది..’ నగరానికి చెందిన ఒక ప్రముఖ మానసిక వైద్య నిపుణుడి వద్ద వారం రోజుల క్రితం హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక తల్లి తన కూతురు ప్రవర్తన పట్ల వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘ఇంటికి వచ్చిన అతిథులను బాగున్నారా అని కూడా పలకరించకపోతే ఎలా..’ అని ఆ తల్లి ఆవేదన. ఇది ఆ ఒక్క తల్లి ఆందోళనే కాదు. చాలామంది తమ పిల్లల తీరు పట్ల ఇదే తరహా ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రోజు రోజుకు ఇలాంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక వైద్యుల పరిభాషలో చెప్పే ‘షైనెస్’ (బిడియం) సమస్యల ఇటీవల కాలంలోపెరుగుతోంది. చాలా మంది పిల్లలు చదువుల్లో ర్యాంకులకు ర్యాంకులు సాధించినప్పటికీ భావప్రకటన నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. మర్యాదపూర్వకమైన సంభాషణలు, పలకరింపులు కూడా ఈ తరం పిల్లలకు తెలియకుండా పోతోందని మానసిక వైద్యనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై నాలుగ్గంటలు మొబైల్ ఫోన్‌కు అతుక్కుపోవడమేనని స్పష్టం చేస్తున్నారు. చాటింగ్ తారకమంత్రం... సాధారణంగా పిల్లలు గలగలా మాట్లాడుతూ ఇల్లంతా సందడి చేస్తుంటే ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా ఉన్నట్లు లెక్క. స్కూల్, కాలేజీల్లోనూ పిల్లల సందడి ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లల అల్లరి కూడా ముచ్చటగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్‌ఫోన్‌కు అడిక్ట్ కావడం వల్ల చాలా మంది పిల్లలు షైనస్కు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎదుటి వ్యక్తి ముఖంలోకి చూసి స్పష్టంగా మాట్లాడలేకపోవడమే ఈ షైనస్ లక్షణం. తమకు ఏం కావాలన్నా, తాము ఎదుటి వారిని ఏదైనా అడగాలనుకున్నా వాట్సప్‌లో మెసేజ్ పోస్టు చేయడం అలవాటుగా మారింది. ‘ ఫేస్బుక్, వాట్సప్, ఇతరత్రా సోషల్ మీడియాలో బంధువులకు, స్నేహితులకు ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలను పోస్టు చేస్తారు. కానీ సదరు వ్యక్తులు తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నారు’ అని విస్మయం వ్యక్తం చేశారు ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డాక్టర్ సంహిత. ఇలాంటి పిల్లలు ఆఖరికి తల్లిదండ్రులతోనూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నట్లు పేర్కొన్నారు. టీనేజ్ యూత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అన్నింటికీ ఇంటర్నెట్, మెబైల్ ఫోన్ తాకరమంత్రంగా భావించడమే ఇందుకు కారణం. భావప్రకటనా నైపుణ్యాన్ని అలవర్చుకోకపోవడం వల్ల, ఎదుటి వారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. దీంతో ఇలాంటి పిల్లలు బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారి మధ్య సరైన వ్యక్తిత్వం లేని వారుగా చులకనకు గురవుతున్నారు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకపోవడమే వారు ఎదుర్కొంటున్న అసలు సమస్య. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ‘సున్నితం’గా పెంచేస్తున్నారు.... పేరెంటింగ్‌లోని లోపాలు కూడా ఈ సమస్యకు కారణంగా మారుతున్నాయి. అమ్మాయిలు సున్నితంగా, ఒద్దికగా ఉండాలనే భావన, గలగలా మాట్లాడకుండా బిడియపడుతూ మాట్లాడాలని తల్లితండ్రులు పదే పదే చెప్పడం వల్ల కూడా చాలామంది భావప్రకటన నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. మర్యాదపూర్వకంగా మాట్లాడలేకపోవడమే కాదు, జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోలేక విలవిలలాడిపోతున్నట్లు సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి విషయానికి పిల్లలు తమపైనే ఆధారపడేలా పెంచడం కూడా మరో ప్రధాన లోపం. అమ్మాయిల్లోనే కాదు. అబ్బాయిల్లోనూ ఇది ప్రబలంగానే ఉంది. ఇలాంటి వారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోతున్నారు. లోపాన్ని గుర్తించడమే పరిష్కారం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బాగా అలవాటుపడడం వల్లనే అభిప్రాయాలను, ఆలోచనలను, తమ భావాలను ప్రకటించలేకపోతున్నారనే లోపాన్ని మొదటి గుర్తిస్తే పరిష్కారం తేలిగ్గా లభిస్తుంది. సమస్య తెలిసిన తరువాత ఆ అలవాటు నుంచి దూరంగా ఉండాలి. వాటి పైనుంచి దృష్టి మళ్లించేందుకు, భావప్రకటన నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు మంచి లిటరేచర్ చదవాలి. మంచి సినిమాలు, సాహిత్యం, స్నేహితులతో మాట్లాడం ఇందుకు దోహదం చేస్తాయి. – డాక్టర్ సంహిత, మానసిక వైద్య నిపుణులు -
‘ఇంత పిరికి ప్రధానిని ఎన్నడూ చూడలేదు’
ప్రతాపగఢ్/జౌన్పూర్: నరేంద్ర మోదీ కన్నా పిరికి, బలహీన ప్రధానిని తానెప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్, జౌన్పూర్ల్లో ప్రియాంక గురువారం ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఈయన (మోదీ) కన్నా ఎక్కువగా భయపడే, బలహీన ప్రధానిని నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక అన్నారు. మాజీ ప్రధాని, ప్రియాంక తండ్రి దివంగత రాజీవ్ గాంధీపై మోదీ ఇటీవల పలు ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. బుధవారం మోదీ మాట్లాడుతూ యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ తన వ్యక్తిగత ట్యాక్సీలా ఉపయోగించుకుని అందులో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారని మోదీ అన్నారు. ఆ మరుసటిరోజే ప్రియాంక మాట్లాడుతూ ‘నెరవేర్చని హామీలపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. విపరీత ప్రచారం, ప్రముఖ టీవీ కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లో బలం రాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతం. ఆ ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించే శక్తి ఉండాలి. ప్రతిపక్షం ఏం చెబుతుందో వినే శక్తి ఉండాలి. మరి ఈ ప్రధాని మన మాటలు చెవికెక్కించుకోవడం అటుంచితే, ఆయనకు సరిగ్గా సమాధానం చెప్పడం కూడా రాదు’ అని ప్రియాంక అన్నారు. తన ప్రచారాలతో మోదీ వాస్తవాలను కప్పిపుచ్చి, అంతా బ్రహ్మాండం, అద్భుతమని నమ్మిస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. -
'నిజ జీవితంలో నాకు సిగ్గు ఎక్కువ'
ముంబై: సినీ కెరీర్లోనూ, తన అభిప్రాయాలను వెల్లడి చేయడంలోనూ ధైర్యవంతురాలిగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. అయితే నిజజీవితంలో మాత్రం ఆమె ఎక్కువగా సిగ్గుపడతారట. ఈ విషయాన్ని ఆమెనే చెప్పింది. 'ఓ వేడుకలోనో, ఫక్షన్ లోనో, అవార్డు షోలోనో ఉన్నప్పుడు నేను సిగ్గుపడతాను. నిజజీవితంలో నేను బాగా సిగ్గు పడతానన్న విషయాన్ని నమ్మడం ప్రజలకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కానీ ఇది నిజం' అని ఆమె తెలిపింది. టీవీలో కనిపించినట్టు తాను నిజజీవితంలో అంతా ఓపెన్‌గా మాట్లాడలేనని తెలిపింది. 'హాయ్, హలో అని చెప్పాలని నాకూ ఉంటుంది. కానీ సిగ్గు అడ్డుపడుతుంది. నేను గర్విష్టినని, నాకు అహంభావం ఎక్కువని ప్రజలు అనుకోవచ్చు. కానీ నాకు సిగ్గు ఎక్కువ. నా జీవితమంతా ఇలాగే ఉండాలని అనుకుంటున్నా. విందులు, వినోదాల్లో జాలీగా ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు' అని సన్నీ తెలిపింది. ఒకప్పుడు పోర్న్‌స్టార్ అయిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలో తనను అంతగా రిసీవ్ చేసుకోలేదని చెప్పింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, బాలీవుడ్ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో తన సందేశాలకు స్పందిస్తున్నారని ఆమె తెలిపింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తనను అనుసరించడమో, తన ట్వీట్స్‌కు స్పందించడమో చేస్తున్నారని, ఆరు నెలల కిందట ఇలాంటి పరిస్థితి లేదని ఆమె పేర్కొంది. -
నాకు సిగ్గు ఎక్కువ: ప్రియాంక చోప్రా
ముంబై: తెరపై ఉదారంగా అందాలు ఆరబోసినప్పటికీ తానెంతో సిగ్గరిని అంటోంది బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా. తనను స్టార్ గా చూడడం నచ్చదని కూడా సెలవిచ్చింది ఈ చిన్నది. తాను అందరి లాంటిదాన్నేనని చెప్పింది. 'మేము విలాసవంతమైన జీవితం గడుపుతామని జనం అనుకుంటారు. నాకు చాలా సిగ్గు ఎక్కువ. ఏకాంత జీవితం నాకు ఇష్టం. కంఫర్ట్ జోన్ ఓ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి నన్ను నేను స్టార్ గా అనుకోవడం కష్టం' అని ప్రియాంక చోప్రా పేర్కొంది. అయితే తాను స్టార్ గా ఎదగదానికి ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.