Real Life
-
Real Ghost Ships Photos: భూమ్మీది టాప్ 15 దెయ్యం నౌకలు.. ఉత్త ప్రచారం మాత్రం కాదు!
-
కొక్కొరొకోడింగ్
ఆరేళ్ల ప్రాయంలోనే కోడింగ్ నేర్చుకుని వండర్ కిడ్ అనిపించుకున్న సమైరా మెహతా.. ఎనిమిదేళ్లు వచ్చేసరికే ఓ ప్రత్యేకమైన బోర్డ్ గేమ్ రూపొందించి ఔరా అనిపించింది. తనకున్న నైపుణ్యాన్ని ఇతర పిల్లలకు కూడా అందించేందుకు గూగుల్ ‘కీనోట్ స్పీకర్’గా మారి సిలికాన్ వ్యాలీలో చిన్నారుల చురుకుదనాన్ని మేలుకొలుపుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ఇండో– అమెరికన్. ‘కోడర్‌బన్నీజ్’ సీఈఓ ఐఐటీ– ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాకేశ్ మెహతా (ప్రస్తుతం ఇంటెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ హెడ్– కాలిఫోర్నియా) తన ఇద్దరు పిల్లలు సమైరా, ఆదిత్లకు బాల్యం నుంచే టెక్ పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోడింగ్‌పై పట్టు సాధించిన సమైరా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే.. తోటి పిల్లలకు కోడింగ్ పాఠాలు నేర్పించేందుకు వీలుగా ‘కోడర్‌బన్నీజ్’ బోర్డ్ గేమ్‌ను రూపొందించింది. తద్వారా 2016లో థింక్ ట్యాంక్ నిర్వహించిన ‘పిచ్ఫెస్ట్’లో రెండో బహుమతి గెలుపొంది 2500 డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘కోడర్‌బన్నీజ్’ పేరు మీదుగానే ఓ సంస్థను స్థాపించి తన బోర్డ్ గేమ్‌ను అమెజాన్‌లో అమ్మడం మొదలుపెట్టింది. దీనికి అనూహ్య స్పందన లభించడంతో యంగ్ సీఈఓ సమైరా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్– ఏఐ) కోడింగ్‌పై దృష్టి సారించిన సమైరా ప్రస్తుతం ‘కోడర్మైండ్స్’ అనే కొత్త బోర్డ్ గేమ్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ గేమ్ ద్వారా రోబోట్స్ తయారుచేసేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలను (ఏఐ మోడల్ అభ్యాసం) సులభంగా నేర్చుకోవచ్చు. అయితే ఈ గేమ్ రూపకల్పనలో సమైరా తమ్ముడు ఆదిత్ (6) కూడా తన వంతు సహాయం చేస్తుండటం విశేషం. రియల్ లైఫ్ పవర్పఫ్ గర్ల్ సమైరా ప్రతిభకు ఫిదా అయిన దిగ్గజ సంస్థ గూగుల్ ఆమెను సిలికాన్ వ్యాలీలో తమ కీనోట్ స్పీకర్‌గా నియమించుకుంది. పిల్లలకు కోడింగ్ పాఠాలు నేర్పేందుకు ఆమె చేత వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ హెడ్‌క్వార్టర్స్ మౌంటేన్ వ్యూ (కాలిఫోర్నియా)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ చీఫ్ కల్చరల్ ఆఫీసర్ స్టాసీ సలీవన్ సమైరాను కలిశారు. ఆమె వాక్చాతుర్యం, నైపుణ్యానికి ముచ్చటపడిన స్టాసీ.. ‘సమైరా ప్రతిభావంతురాలు. తొందర్లోనే గూగుల్‌లో పూర్తి స్థాయిలో ఆమె పనిచేసే అవకాశం ఉంది’ అంటూ కొనియాడారు. ఇక కార్టూన్ నెట్వర్క్ మార్కెటింగ్ విభాగం తమ చానల్ రూపొందించిన ‘యంగ్ ఇన్స్పైరింగ్ గరల్స్’ అనే కార్యక్రమంలో సమైరాకు చోటు కల్పించి.. ‘ద రియల్ పవర్పఫ్ గర్ల్’గా సమైరాను అభివర్ణించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా సమైరా ప్రతిభను గుర్తించింది. ఆసక్తే తనను నిలిపింది ‘‘సమైరా ఇండియాస్ వండర్ కిడ్ అని నా స్నేహితులు అంటూ ఉంటారు. కానీ తను కూడా అందరిలాంటిదే. కాకపోతే కోడింగ్ పట్ల ఉన్న ఆసక్తి ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. అయితే చిన్నతనంలోనే తను ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించడం నాకు ఆనందంగా ఉన్నప్పటికీ.. కీర్తి తాలూకూ ప్రభావం తన మీద పడకూడదు అనుకుంటాను. ఒత్తిడి లేకుండా పనిచేస్తేనే సమైరా మరిన్ని విజయాలు సాధిస్తుంది’’ అని రాకేశ్ మెహతా కూతురి గురించి చెప్పారు. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ వంద కోట్ల మందికి నేర్పుతా ‘‘ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉంటూనే తమ పిల్లలు కోడింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని భావిస్తున్నారు. అటువంటి వారికి కోడర్‌బన్నీజ్ వంటి నాన్– డిజిటల్ బోర్డ్ గేమ్స్ ఎంతో ఉపయోగకరం. ఈ ప్రపంచంలో ఉన్న సుమారు వంద కోట్ల మంది పిల్లలకు నా సంస్థ ద్వారా కోడింగ్ నైపుణ్యాలు నేర్పించడం నా ఉద్దేశం. నాకు తెలిసీ వాళ్లంతా కోడింగ్ చేయగలిగే సామర్థ్యం కలిగిన వారే. కాకపోతే వారి కోసం కొంచెం సమయం కేటాయించడంతో పాటుగా కోడర్‌బన్నీజ్ వంటి ఈజీ గేమ్‌ల అవసరం ఉంది. అమెజాన్ ద్వారా ఏడాదిలో వెయ్యి బాక్సుల బోర్డ్ గేమ్స్ అమ్మాను. దాని ద్వారా 35 వేల డాలర్ల ఆదాయం పొందాను. నేను ఆరేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకున్నాను. ప్రస్తుతం కీనోట్ స్పీకర్‌గా కోడింగ్ మెళకువలు నేర్పుతున్నాను. ఈ క్రమంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, ఫేక్‌బుక్ సీఈఓలను కలవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. కోడర్‌బన్నీజ్ ఐడియాను వారిరువురూ మెచ్చుకున్నపుడు ఎంతో గర్వంగా అన్పించింది. ప్రస్తుతం మా వెబ్సైట్లో రోబోటిక్స్, గేమ్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటన్నింటిలో మా నాన్న పాత్ర ఎంతగానో ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే నా ఆశయం’’ అంటూ పదేళ్ల సమైరా తన అనుభవాలను పంచుకుంది. అంతేకాదు తన కంపెనీ పేరిట విరాళాలు సేకరించి అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది కూడా. – సమైరా (10) , ‘కోడర్‌బన్నీజ్’ సీఈఓ -
ఉన్నారండి ప్రేమలో మరి..
పన్నెండు నెలలకొకసారే క్యాలెండర్లో కొత్త సంవత్సరం.ప్రేమికులకు నిత్యమూ న్యూ ఇయరే!స్క్రీన్‌పై అలవోకగా ప్రేమించేహీరోయిన్లు సైతం రియల్ లైఫ్లోప్రేమను ప్రైవసీగానే ఫీలవుతారు.అలా ప్రేమలో ఉన్న హీరోయిన్లుఈ న్యూ ఇయర్ అయినా ఓ గుడ్‌న్యూస్ చెబుతారా? రద్దీగా ఉన్న బస్‌స్టాప్. హీరోయిన్ బస్ కోసం ఎదురుచూస్తుంటుంది. హీరో అక్కడే ఉన్న బామ్మగారిని రోడ్డు దాటించి హీరోయిన్ దృష్టిలో మంచి మార్కులేయించుకుంటాడు. అది ఎర్లీ నైన్టీస్లో. తర్వాత రౌడీ మూక హీరోయిన్ను అల్లరి పెడుతుంటే వాళ్లని డిష్యూం డిష్యూం అని రఫ్ఫాడిస్తాడు. ఇది ఎర్లీ టూ థౌజండ్స్. ఆ తర్వాతి కాలంలో కాలేజీలో, ఒకే అపార్ట్మెంట్.. ఇలా దశలవారిగా హీరోయిన్స్‌తో ప్రేమలో పడుతూ వస్తున్నారు హీరోలు. అలాగే హీరోలతో ప్రేమలో పడుతున్నారు హీరోయిన్లు. ఇదంతా సినిమా వరకే. అంతా స్క్రిప్ట్. ఎవరో రాసిన ఆ స్క్రిప్ట్‌లో వీళ్లు ప్రేమలో పడుతున్నారు. మరి రియల్ లైఫ్‌లో వీళ్లు ఎలా ప్రేమలో పడతారంటే చెప్పలేం. అది వాళ్లంతట వాళ్లు చెబితే తెలుస్తుంది. కానీ ఎవరితో ప్రేమలో ఉన్నారంటే మాత్రం మనం చెప్పగలం. కొందరు హీరోయిన్లు ప్రస్తుతానికైతే మాత్రం ప్రేమలో నిండా మునిగి తేలుతున్నారు. లవ్ జర్నీ చేస్తున్న హీరోలూ ఉన్నారండోయ్. కొందరు ‘అవుటాఫ్ ఇండస్ట్రీ’ వాళ్లతో లవ్‌లో పడితే కొందరు ‘ఇన్సైడ్ ఇండస్ట్రీ’వాళ్లతోనే ప్రేమ ప్రయాణం చేస్తున్నారు. మరి అలా ప్రేమలో ఉన్న స్టార్స్ 2019లోనైనా ఏడడుగులేస్తారా? రింగులు మార్చుకుంటారా? అని అడిగితే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు. లవ్ గేమ్ గతేడాది స్పోర్ట్స్ డ్రామా ‘సూర్మా’ సినిమాలో యాక్ట్ చేయడానికి తాప్సీ అంగీకరించినప్పుడు చాలామంది ముసిముసిగా నవ్వుకున్నారు. దానికి కారణం స్పోర్ట్స్ పట్ల ఆ సమయంలో ఈ ఢిల్లీ బ్యూటీకి బోలెడంత ఆసక్తి ఉండటమే. అసలు క్రీడల మీద ఆమెకు ఎందుకు ఆసక్తీ అంటే.. ఓ క్రీడాకారుడితో ప్రేమలో పడ్డారు కాబట్టి. అప్పటికే డెన్మార్క్‌కు చెందిన మథియాస్ బో అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో రిలేషన్షిప్లో ఉన్నారు తాప్సీ. రిలేషన్షిప్లో ఉన్నాను అని అంగీకరిస్తారు కానీ ఆ వ్యక్తి గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడను అంటారామె. మరి ఈ లవ్గేమ్కు వెడ్డింగ్ లాకెట్ ఎప్పుడేస్తారో? ఫిట్నెస్ ప్రేమ బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఫిజిక్ గురించి ప్రస్తావించాలంటే టైగర్ ష్రాప్ గురించి మాట్లాడాల్సిందే. అలాగే హీరోయిన్స్‌లో దిశా పాట్నీ. వీళ్లకు ఏ జిమ్‌లో పరిచయం అయిందో తెలియదు కానీ ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు. మేం రిలేషన్లో ఉన్నాం అని చెప్పరు. కానీ లంచ్ డేట్స్, ఫ్యామిలీ పార్టీలలో చేతిలోన చెయ్యేసి చెప్పకనే చెబుతారు. మరి ఫిట్నెస్ గోల్స్ పెంచే ఈ జోడీ కఫుల్ గోల్స్ ఎప్పుడు సెట్ చేస్తారని బాలీవుడ్ వెయిటింగ్. అన్నట్లు... ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డాక కలిసి నటించిన చిత్రం ‘భాగీ 2’. ప్రేమ రాగాలు ‘పడమటి సంధ్యా రాగం’ సినిమాలో దేశీ హీరోయిన్, విదేశీ హీరోని ఇష్టపడినట్టు శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలేది కూడా దేశీ, విదేశీ లవ్‌స్టోరీయే. లండన్‌కు, మదరాస్కు లంకె ఎలా కుదిరిందో తెలియదు. కానీ నువ్వుంటేనే నవ్వుంటుంది అని విరహాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ చేస్తారు ఒక్కోసారి. కూతురు అడక్కముందే కమల్‌హాసన్ అంగీకారం తెలిపేశారని చెన్నై టాక్. వీలున్నప్పుడల్లా హాలిడేయింగు, లేదంటే లాస్ ఏంజెల్స్‌లో ప్రేమ షికారింగు చేస్తున్నారీ జంట. మరి పెళ్లి ట్యూన్ ఎప్పుడు వినిపిస్తారంటే? ప్రస్తుతానికి నిశ్శబ్దమే సమాధానం. వ్యత్యాసాలేల ప్రేమకు కుల, మత, వర్ణ, వర్గ భేదాలే లేనప్పుడు వయసు వ్యత్యాసాలేల? అంటున్నారు మలైకా అరోరా, అర్జున్ కపూర్. వయసు వ్యత్యాసం అనేది ప్రాబ్లమే కాదంటారు. అర్బాజ్ ఖాన్‌తో విడిపోయాక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటి పేరుని తొలగించారు మలైకా. కపూర్‌గా మారడానికే ఇదంతా అన్నారు బాలీవుడ్ నెటిజన్లు. మలైకా ‘ఏకే’ లాకెట్ ధరిస్తే ఏ ఫర్ అర్జున్ అన్నారు. కాదని ఖండించలేదు మలైకా. ఈ ఏడాది పెళ్లే అన్నారు అర్జున్ కపూర్. నిజమౌతుందా? వేచి చుద్దాం. ఇంతకీ వయసు వ్యత్యాసం చెప్పలేదు కదూ.. అర్జున్ కన్నా మలైకా దాదాపు 12 ఏళ్లు పెద్ద. ఆ.. ఇంతా? అని కొందరికి అనిపించొచ్చు. ‘ఓస్.. ఇంతేనా’ అన్నది ప్రేమికుల ఫీలింగ్. ఇంటర్నేషనల్ లవ్‌స్టోరీ అమీ జాక్సన్ లండన్‌లో పుట్టి, పెరిగారు. ‘మదారాసు పట్టణం’ సినిమా కోసం మదరాసులో వచ్చి పడ్డారు. ‘ఏ మాయ చేశావె’ హిందీ వెర్షన్లో నటించిన ప్రతీక్ బబ్బర్‌తో ప్రేమలో పడ్డారు. చేతిమీద పచ్చబొట్లు కూడా పొడిపించేసుకున్నారు ఈ ఇద్దరూ. కానీ అనుకున్నట్లుగా జరగలేదు. ఆ తర్వాత లండన్‌లోనే తన ట్రూ లవ్ ఉందని తెలుసుకున్నారు అమీ. జార్జ్ పనయిటో అనే మల్టీ మిలీనియర్కి మనసిచ్చేశారు. ప్రస్తుతం వీలు దొరికినప్పుడల్లా విదేశాలను చుట్టేసొస్తుంటారు వీళ్లు. తాజాగా ‘2.0’ సక్సెస్ అయినప్పుడు జార్జ్ పెదాలకు పెదాలతో తాళం వేసి మరీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఈ ఏడాదైనా వీళ్లు రింగులు మార్చుకుంటారా? చర్చి గంటలు మోగిస్తారా? రిక్కించిన చెవులతో వేచి చూద్దాం. ప్రియమైన ఫియాన్సీ విఫల ప్రేమకు మందేమైనా ఉందా? అంటే మళ్లీ ప్రేమే అంటాడో ప్రేమదాసు. నిజమే. బాధకు మందు ప్రేమే. నయనతార ప్రేమ విఫలమైనప్పుడల్లా కూడా ప్రేమనే కోరుకున్నారు. శింబు నుంచి విడిపోయి ప్రభుదేవాని ప్రేమించారు. అతన్నుంచి విడిపోయాక దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డారు, విఘ్నేష్ హిట్టు కొడితే నయనతార చప్పట్లు కొట్టి, నయన్ అవార్డులు కొడితే విఘ్నేష్ అభినందనల వర్షం కురిపించి మురిసిపోతుంటారు. వేడుకల్లో విఘ్నేష్‌ను ‘ఫియాన్సీ’ అని సంబోధిస్తారామె. మరి ఫియాన్సీని హబ్బీ ఎప్పుడు చేస్తావ్ నయన్ అని అడుగుదామంటే సినిమా ప్రమోషన్స్‌లో కనిపిస్తేనే కదా! హబ్బీ ఫొటో తీస్తే... ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా ఫొటోలు చితక్కొడుతుంటారు. ఎంత ప్రేమతో తీస్తే ఇంత అద్భుతంగా రావాలి. అవును ప్రేమగా తీస్తే అంతే వస్తాయి అని ఆవిడ కూడా ఒప్పుకుంటారు. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్నారీ భామ. ‘హబ్బీ’ ఫొటో తీశాడంటూ ఓ పోస్ట్ పెట్టారు ఆ మధ్య. పెళ్ళైపోయిందనుకున్నారంతా, ప్రెగ్నెంట్ అని కూడా వార్తలు వినిపించాయి. అవేం లేదని క్లారిఫై చేశారు వెంటనే. మరి పెళ్లయిందన్న గాసిప్‌ని ఈ ఏడాదైనా నిజం చేస్తూ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తుందని ఆశిద్దాం. ఇష్టమైన హీరోయిన్‌కు పెళ్లి అవుతుందంటే ఇష్టం లేకపోయినా ఆ విశేషాల కోసం చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి.. కొత్త సంవత్సరంలో ఎంతమంది హీరోయిన్స్ పెళ్లిడ్రెస్ (స్క్రీన్ మీద కాదు) వేసుకుంటారో వేచి చూద్దాం. ప్లేబాయ్ ప్రేమకథ అదేంటో రణ్‌బీర్ కపూర్ ఇట్టే ప్రేమలో పడిపోతుంటాడు. విశేషమేంటంటే అట్టే బయటకొస్తుంటాడు అందులోంచి. దీపికా పదుకోన్‌తో ప్రేమలో మునిగి తేలాడు రణ్‌బీర్. ఇద్దరూ పెళ్లి దాకా వెళ్లారు. ఎందుకో జరగలేదు. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో కూడా సేమ్ ఇలానే జరిగింది. ప్రస్తుతం రణ్‌బీర్, ఆలియా భట్ రిలేషన్షిప్లో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. పెళ్లి అభ్యంతరాలు కూడా ఏం లేవన్నారు ఇరు కుటుంబ సభ్యులు. ఈ ప్రేమ పరీక్ష అయినా పాస్ అయ్యి పెళ్లి వరకూ వెళ్తాడా రణ్‌బీర్ కపూర్? ఎదురు చూడాలి. -
నిజజీవితంలో నేను హీరోను కాదు
న్యూఢిల్లీ: 'నేను సినిమాల్లోనే హీరోను నిజ జీవితంలోకాదు' అని బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (50) అన్నారు. నేను విలన్ గా మారాలని అనుకోవడంలేదని, ప్రేక్షకులు తనను ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమా హీరోగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నానని అన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే, వారు యోధునిల్లాగా మారే సినిమాలు చేస్తానని అన్నారు. గతంలో తాను నటించిన 'సుల్తాన్' సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు ముందు తన పరిస్థితి రేప్ కు గురైన మహిళగా ఉందని అనడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. -
'నిజ జీవితంలో నాకు సిగ్గు ఎక్కువ'
ముంబై: సినీ కెరీర్లోనూ, తన అభిప్రాయాలను వెల్లడి చేయడంలోనూ ధైర్యవంతురాలిగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. అయితే నిజజీవితంలో మాత్రం ఆమె ఎక్కువగా సిగ్గుపడతారట. ఈ విషయాన్ని ఆమెనే చెప్పింది. 'ఓ వేడుకలోనో, ఫక్షన్ లోనో, అవార్డు షోలోనో ఉన్నప్పుడు నేను సిగ్గుపడతాను. నిజజీవితంలో నేను బాగా సిగ్గు పడతానన్న విషయాన్ని నమ్మడం ప్రజలకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కానీ ఇది నిజం' అని ఆమె తెలిపింది. టీవీలో కనిపించినట్టు తాను నిజజీవితంలో అంతా ఓపెన్‌గా మాట్లాడలేనని తెలిపింది. 'హాయ్, హలో అని చెప్పాలని నాకూ ఉంటుంది. కానీ సిగ్గు అడ్డుపడుతుంది. నేను గర్విష్టినని, నాకు అహంభావం ఎక్కువని ప్రజలు అనుకోవచ్చు. కానీ నాకు సిగ్గు ఎక్కువ. నా జీవితమంతా ఇలాగే ఉండాలని అనుకుంటున్నా. విందులు, వినోదాల్లో జాలీగా ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు' అని సన్నీ తెలిపింది. ఒకప్పుడు పోర్న్‌స్టార్ అయిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలో తనను అంతగా రిసీవ్ చేసుకోలేదని చెప్పింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, బాలీవుడ్ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో తన సందేశాలకు స్పందిస్తున్నారని ఆమె తెలిపింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తనను అనుసరించడమో, తన ట్వీట్స్‌కు స్పందించడమో చేస్తున్నారని, ఆరు నెలల కిందట ఇలాంటి పరిస్థితి లేదని ఆమె పేర్కొంది. -
ఆమెతో అతడి రిలేషన్...
బాలీవుడ్ బాత్ ఆ...ఆ...ఆ... తొందరపడకండి. నిజ జీవితంలో కాదు. సినిమాలో. ఆ సినిమా పేరు ‘అయ్... దిల్ హై ముష్కిల్’. గతంలో ‘కభి ఆల్విదా నా కెహెనా’లో ఇలాంటి సబ్జెక్ట్‌నే చర్చించిన కరణ్ జొహర్ మళ్లీ రిస్క్ చేయడానికి సాహసిస్తున్నాడు. ఈసారి రణ్‌బీర్ కపూర్ తన కంటే వయసులో పెద్దదైన ఒకామెతో అనుబంధంలోకి వెళతాడు. ఆ పాత్రను ఐశ్వర్యారాయ్ పోషిస్తోంది. ఇంకో ముఖ్యపాత్ర అనుష్క శర్మది. ‘ఇది అందరూ ఊహించే ప్రేమ కథ మాత్రం కాదు’ అన్నాడు కరణ్ జొహర్. ఇప్పటికే లండన్, పారిస్‌లలో కొంత షూటింగ్ జరుపుకొంది. మిగిలింది జరగాల్సింది ఉంది. వచ్చే సంవత్సరం దీపావళికి సినిమా రిలీజ్ అట. అయితే మరోవైపు రణ్‌బీర్ కెరీర్ ఒడిదుడుకులలో ఉంది. మునపటి సినిమాలు ‘రాయ్’, ‘బాంబే వెల్వెట్’ నిరాశ పరిచాయి. తాజా సినిమా ‘తమాషా’ కూడా అటు ఇటుగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా అతణ్ణి ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. -
బుల్లితెరపై జగపతిబాబు లైఫ్ స్టోరి
-
కలిసిన హృదయాలు
రీల్ లైఫ్‌లో రొమాన్స్‌లతో కెపైక్కించే తారలు రియల్ లైఫ్‌లోనూ వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు కలసి చేస్తే... హిట్ పెయిర్ అవుతుందో లేదో గానీ.. వారి మధ్య పండిన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం ఆపై పర్సనల్‌గానూ వర్కవుటయిపోతోంది. ఒకటా రెండా... వందేళ్లు పైబడిన బాలీవుడ్లో ఇలాంటి కథలు లెక్కకు మించి! ఆనాటి నుంచి ఈనాటి వరకు లవ్... లైఫ్‌లో రొటీనైపోయింది. షూటింగ్‌ల్లో చిగురించిన ప్రేమ కొందరిని భార్యాభర్తలను చేసింది. ఇంకొందరిని ప్రేమికులుగానే వదిలేసింది. మరికొందరిని విరహంలో ముంచెత్తింది. మరి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ ‘హాట్’ సీట్లో ఉన్న బాలీవుడ్ జంటలపై ఓ లుక్కేద్దాం! హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే స్టార్ జంట కత్రినా కైఫ్, రణబీర్‌కపూర్. దాదాపు ఏడాదికి పైగా ఇద్దరూ కలసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. షూటింగ్‌ల్లో ఎవరికి వారు బిజీగా ఉన్నా... వెసులుబాటు చేసుకుని మరీ కలుస్తున్నారు. న్యూ ఇయర్ రోజు లండన్‌లోని కత్రినా ఫ్యామిలీని రణబీర్ కలిశాడన్నది పెద్ద వార్త. అక్కడ పెళ్లి ముచ్చట్లు కూడా జరిగిపోయాయని ఇండస్ట్రీ అప్పట్లో టాకేసింది. మరికొందరు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందన్నారు. కానీ.. రణబీర్ వీటన్నింటినీ ఖండించాడు. ఇక రణబీర్ మాజీ ప్రియురాలు, సూపర్ హీరోయిన్ దీపిక పడుకొనే తాజాగా మరొకరితో లవ్‌లో పడింది. ధోనీ, యువరాజ్‌లతో కొంతకాలం డేటింగ్ చేసిన ఈ అమ్మడు తాజాగా కుర్ర హీరో రణవీర్‌సింగ్‌తో కలసి తెగ తిరిగేస్తోంది. ఆ మధ్య దీపిక బర్త్‌డే బెంగళూరులో జరుపుకుంటే... మనోడు అటెండయ్యాడు. అంతటితో ఆగలేదు.. తన ప్రేమను చాటుకోవడానికి పొడుగు కాళ్ల సుందరిని వెంట పెట్టుకుని షాపింగ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కాస్ట్లీ ఐటెమేదో కొనిపెట్టాడట కూడా. రీసెంట్గా ఈ చిన్నదాని బుగ్గపై పబ్లిక్‌గా ముద్దు పెట్టి వివాదాల్లో ఇరుక్కున్నాడు. అతికి అసలు అర్థం ఎవరంటే బాలీవుడ్ జనాలు రణవీర్ పేరు చెబుతారు. బహుశా అదే ఆమెకు అతిగా నచ్చేసిందేమో! నాకెవరూ లేరు.. నేను ఒంటరినే అంటూ నిన్నమొన్నటి వరకూ చెప్పుకొచ్చిన సెక్సీ తార బిపాసాబసు తాజాగా తానూ జతగాడిని వెతుక్కుందట. రొమాంటిక్ హీరో జాన్ అబ్రహంతో చాన్నాళ్లు రొమాన్స్ చేసిన బిప్.. ఆ తరువాత కోస్టార్ హర్మాన్ బవేజాతో తిరిగింది. ఇప్పుడు మరో కుర్ర హీరో కరణ్‌సింగ్ గ్రోవర్తో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తోంది. మొత్తానికి లేదు లేదంటూనే డేటింగ్ల్లో గడిపేస్తూ ఎంజాయ్ చేస్తోంది బిప్! బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్‌ఖాన్ సీజన్‌కో గాళ్‌ఫ్రెండ్‌ను మారుస్తుంటాడు. అతగాడి లిస్ట్ చెప్పాలంటే బారెడు! ఐశ్వర్యా, కత్రినా, జాక్వెలిన్... ఇలా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల తన చెల్లి అర్పితాఖాన్ మ్యారేజ్‌లో రొమేనియన్ టీవీ హోస్ట్ లులియా వంతూర్ను ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసి షాకిచ్చాడు. ఇరువురూ డేటింగ్లో ఉన్నారనేది అసలు విషయం. ఇటు సినిమా ఫీల్డ్... అటు క్రికెట్ గ్రౌండ్లో ఫేమస్ ఫిగర్లు అనుష్కాశర్మా, విరాట్ కొహ్లీల ప్రేమాయణం ఓ రేంజ్లో సాగుతోంది. జతగాడు ఆస్ట్రేలియా టూర్లో ఉంటే... న్యూఇయర్ పార్టీ కోసం అక్కడికి వెళ్లిపోయింది. అనుష్కా కొన్ని రోజులు విరాట్‌తో ఆసీస్ బీచ్‌లు, క్లబ్‌ల్లో షికార్లు కొట్టి వచ్చింది. నిజమెంతో తెలియదు గానీ... ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్. సోగకళ్ల చిన్నది సోనాక్షి సిన్హా పెద్దగా వార్తల్లో ఉండదు గానీ... బోనీకపూర్ కొడుకు అర్జున్‌కపూర్‌తో సీక్రెట్‌గా డేటింగ్ సాగిస్తోందని బీటౌన్ టాక్. ఇద్దరూ సినిమాలకు, షికార్లకు వెళ్లినట్టు సమాచారం. అయితే కలసి సినిమా చూసినంత మాత్రాన ఏదో జరిగిపోతున్నట్టేనా అంటూ ప్రశ్నించి కాస్త కన్ఫ్యూజన్లో పెట్టింది సోనాక్షి. వర్ధమాన తారల్లో శ్రద్ధాకపూర్ సహనటుడు ఆదిత్యారాయ్కపూర్తో అఫైర్ నడిపిస్తోందట. ఈ ప్రేమల్లో ఎన్ని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతాయో తెలుసుకోవాలంటే వచ్చే వాలెంటైన్ డే వరకు ఆగాల్సిందే! -
లేటెస్ట్ బ్రేకప్ జంట సిద్ధార్థ్, సమంత
రీల్ లైఫ్‌ను రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేసిన లేటెస్ట్ బ్రేకప్ జంట సిద్ధార్థ్, సమంత... రియల్ లైఫ్‌ను రీల్ లైఫ్‌లోనూ కొనసాగిస్తున్నారు! కన్ఫ్యూజన్గా ఉందా..! అయితే డీటైల్‌గా చెప్పాల్సిందే! చాన్నాళ్లు సీక్రెట్‌గా సహజీవనం చేసిన తమిళ తారలు సమంత, సిద్ధార్థ్‌లు... ఇటీవల అంతే గుట్టుగా విడిపోయారు. ఈ బ్రేకప్‌పై నర్మగర్భంగా ఆ మధ్య సమంత ‘నేను విక్టమ్ను కాదు’ అంటూ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందనుకోండి! తాజాగా... వీరిద్దరూ కలసి ‘బెంగళూరు డేస్’ మూవీలో నటించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి తారలిద్దరూ దాని నుంచి తప్పుకున్నారు. ‘బెంగళూరు డేస్‌లో నేను చేయడం లేదు’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేస్తే... ‘ఆ సినిమాలో నటించడం లేదు’ అంటూ శామ్ కూడా పోస్ట్ చేసింది..! పాపం నిర్మాత! -
హవా హవాయ్!
హాలీవుడ్ అందాలు వెండి తెరపైనే కాదు... పబ్లిక్ ప్లేసుల్లోనూ కనువిందు చేస్తున్నాయి. ఎప్పుడూ నటించి మెప్పించడమేనా అనుకుందో ఏమో... రియల్ లైఫ్‌లో కూడా ‘బోల్డ్’గా కనిపించి మురిపించింది సెక్సీ సుందరి మిలె సిరస్! తన బాయ్‌ఫ్రెండ్ ప్యాట్రిక్ స్క్వాజ్నెగర్తో హవాయ్ బీచ్‌లో టాప్‌లెస్‌లో మెరిసి షేక్ చేసింది. వెండితెర వేల్పు ఇలా ప్రత్యక్షమైపోయి ‘కెరటాల’ హోరులో ‘అందం’గా విందు చేస్తుంటే... అక్కడున్న పురుష పుంగవులు తిలకించి పులకించిపోయారు. కలయా... మాయా... అంటూ తమను తాము గిల్లుకుని... తేరుకుని... ఆపై ఏమి ఈ భాగ్యమంటూ ‘పిల్ల’ గాలులను ఆస్వాదించేశారు. -
అర్థం చేసుకోండి..
రీల్ లైఫ్‌లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన ప్రియాంక చోప్రా.. రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా సిగ్గరిని అని బడాయి పోతోంది. ‘సినిమా వాళ్ల దగ్గర బోలెడు డబ్బులుంటాయి.. ఏది కోరుకుంటే అది వాళ్ల కాళ్ల దగ్గరకు వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ సెలబ్రిటీ హోదాలో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాం’ అని వాపోతోంది ఈ ముద్దుగుమ్మ. తనకంటూ ప్రైవసీ కావాలంటోంది. తన విన్నపాలు జనం వినవలెనని కోరుతోంది. తాజాగా నిర్మాతగా మారిన ప్రియాంక ఇలాంటి కామెంట్లు చేయడంపై అప్పుడే సైటర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. -
నిజ జీవితంలో.. నటించడం చేతకాదు
* ప్రజలతోనే నా పయనం * ఆ ఇద్దర్నీ బహిష్కరిద్దాం * విద్యుత్ చార్జీల పెంపుపై డీఎండీకే ఆందోళన * మదురైలో గళమిప్పిన విజయకాంత్ సాక్షి, చెన్నై: ‘నిజ జీవితంలో నటించడం చేత కాదు’ అని డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. ప్రజలతోనే తన పయనం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మదురైలో శుక్రవారం జరిగిన విద్యుత్ చార్జీల పెంపు నిరసనలో డీఎంకే, అన్నాడీఎంకేలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనకు డీఎండీకే పిలుపు నిచ్చింది. పార్టీ వర్గాలు ఆయా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారుు. మదురై వేదికగా జరిగిన సభలో విజయకాంత్ పాల్గొన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నిరసనకు తరలి వచ్చారు. విజయకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. జైలు శిక్షపడ్డ జయలలిత ఏమో ప్రజా సీఎం....ప్రజా సీఎం అని పిలుస్తున్నారని, అలాంటప్పుడు పన్నీరు సెల్వం ఎవరికి సీఎం అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలకు మార్చిమార్చి అధికార పగ్గాలు అప్పగించడం వలన ప్రజలకు ఒరిగింది శూన్యమేనన్నారు. ప్రజల్లో మార్పు రావాలని పిలుపు నిచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలో అవినీతిలో దొందుదొందేనని, ఆ రెండు పార్టీలను బహిష్కరించే తీర్పును రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నటన చేత కాదు తాను సినిమాల్లో నటించగలనే గానీ, వాస్తవిక జీవితంలో నటన చేత కాదన్నారు. పార్టీ పరంగా తాను అందిస్తున్న సేవల్ని గుర్తు చేశారు. ప్రజల్లోకి వెళ్తానని, వారి మద్దతును కూడ గట్టుకుంటానని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తన సుడిగాలి పర్యటన ఉంటుందని, అందుకు తగ్గ పర్యటన వివరాల్ని త్వరలో ప్రకటిస్తానన్నారు. -
లవ్ అండ్ బ్రేకప్
రియాల్టీ షోలో చిగురించిన ప్రేమ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి వాడిపోయింది. బుల్లితెర బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ 7’ చెట్టాపట్టాలేసుకున్న గువ హర్ ఖాన్, కుశాల్ టాండన్ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ‘మేమిద్దం కలసి ప్రశాంతంగా ఉండలేం’ అంటూ కుశాల్టాండన్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వీళ్లిద్దరి పర్సనల్ మ్యాటర్ కాస్త పబ్లిక్ అయింది. మొత్తానికి రియాల్టీ షోలో ఇన్స్పైర్ చేసిన ఈ ప్రేమజంట.. ఇలా ఉస్సూరుమనిపించింది. -
ఆ ఒక్క పాత్ర కోసం...ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నా!
ఇక చాలు.. జీవితంలో ఇంకేం మిగిలిందని... ఆత్మహత్య ఒక్కటే మార్గం.. ఆ రోజు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ... చంద్రమౌళి మనసు మనసులో లేదు. కొడుకు పడుతున్న సంఘర్షణ తల్లి మనసు గ్రహించేసింది... ‘పిచ్చోడా.. 40, 50 ఎకరాల మాగాణి ఉండేది మనకు... అంతా పోయింది... మిమ్మల్ని బతికించుకోలేదా? వద్దు నాన్నా.. పిరికితనం మంచిది కాదు..’ తల్లి నోటి నుంచి ఈ మాటలు వినగానే.. చంద్రమౌళికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఆ రాత్రి బాగా నిద్రపట్టేసింది... ఎప్పుడూ ఉదయం ఐదు గంటలకల్లా నిద్రలేవడం ఆయన అలవాటు.. కానీ, ఆరోజు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ హాయిగా నిద్రపోయారు. మనసు, శరీరం రెండూ తేలికయ్యాయి. ఇంతకీ చంద్రమౌళి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకనుకున్నారు? ‘రీల్’పై పేద పాత్రలకు చిరునామా అయిన ఆయన ‘రియల్ లైఫ్’ని తెలుసుకుందాం... చిత్తూరు జిల్లాకు చెందిన కుమ్మరి కండ్రిగలో పుట్టారు చంద్రమౌళి. తల్లిదండ్రులు, ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు అక్కలతో చంద్రమౌళి జీవితం బాగుండేది. పెద్ద వ్యవసాయ కుటుంబం. అందరూ చదువుకున్నారు కానీ.. ఐదారు తగరతుల వరకే. ‘‘మోహన్‌బాబుగారు తండ్రి నారాయణస్వామిగారి దగ్గర నేను, మా అన్నయ్య ఐదో క్లాస్ వరకు చదువుకున్నాం. అయితే మా ఊరి నుంచి స్కూల్ ఐదు కిలోమీటర్లు దూరంలో ఉండటంతో చదువు ఆపేశాం’’ అని చెప్పారు చంద్రమౌళి.మేనమామ ప్రేరణతో నాటకాల మీద మక్కువ మొద లైంది. ఈలోగా కథ ఊహించని మలుపు తిరిగింది. మాగాణి అంతా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి. అప్పుడు చంద్రమౌళిది 20 ఏళ్ల వయసు. మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేస్తే, కాస్త భరోసా వస్తుందనుకున్నారు. కట్ చేస్తే.. ‘అంతా మన మంచికే’లో చిన్న వేషం దొరికింది. ఆ చిత్రానికి దర్శకురాలు, కథానాయిక భానుమతి. ఆఫీసుకెళ్లగానే ఒక డైలాగ్ ఇచ్చి, నటించమన్నారామె. భయం, బిడియం పక్కనపెట్టి, నటించేశారు చంద్రమౌళి. ‘భేష్ సెలక్ట్ అయ్యావు’ అనడంతో సంబరపడిపోయారు. మోసగాళ్లకు మోసగాళ్లు, పండంటి కాపురం, చెల్లెలి కాపురం వంటి సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాలు వేశారు. కానీ, వరుసగా ఒకే రకం పాత్రలు రావడంతో మూడేళ్ల తర్వాత తిరిగి తన ఊరెళ్లిపోయారు. అప్పటికి ఆర్థిక పరిస్థితి ఇంకా హీనంగా తయారు కావడంతో అక్కడా ఉండలేకపోయారు. అయినా ఓ ఆరేడేళ్లు ఏదో చిన్నా చితకా పనులు చూస్తూ నెట్టుకొచ్చేశారు. అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల కాపురం తర్వాత మళ్లీ మనసు సినిమాలపైకి మళ్లింది. దాంతో 1981లో తిరిగి చెన్నయ్ వెళ్లిపోయారు. నాటకాలు... చిన్న చిన్న వేషాలు.. గుర్తింపు రాలేదు. రాబడి అంతంత మాత్రమే. ఏం చేయాలి? ఏదైనా సినిమాలో కొంత పెట్టుబడి పెడితే...? చంద్రమౌళి బాగా ఆలోచించారు. అప్పుడు మొదలైనదే ‘కలియుగ దైవం’ సినిమా. కథ ఆయనదే. తనకోసం ఓ మంత్రగాడి వేషం కూడా రాసుకున్నారు. ఆ పాత్రతో తన జీవితం మంచి మలుపు తిరుగుతుందని ఆశించారు. సరే.. సినిమా మొదలైంది. 8 లక్షలు అనుకున్న సినిమా 13 లక్షలయ్యింది. మంచి పాత్ర కాబట్టి, తన వాటాగా ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టారు. చివరికి మంత్రగాడి వేషం చిత్రీకరణ మొదలుపెట్టేసరికి, ‘ఈ పాత్ర నువ్వు వేస్తే బాగుండదు. ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్‌తో చేయిస్తే బాగుంటుంది’ అని దర్శక, నిర్మాతలు అన్నప్పుడు షాక్ అయ్యారు. ఓ ప్రముఖ నటుణ్ణి పిలిపించి, భారీ పారితోషికం ఇచ్చి, ఆయనతో చేయించేశారు. ‘‘ఆ రోజు పడ్డ బాధని నేనెప్పుడూ పడలేదు. ఆ ఒక్క పాత్ర కోసం ఉన్నదంతా పోగొట్టుకున్నా. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’’ అన్నారు. అప్పటికి ఇద్దరబ్బాయిలు పుట్టారు. ఉన్న కాస్తా కూస్తా కూడా పోయింది. ఊరెళ్లిపోదామంటే మొహం చెల్లలేదు. దాంతో ఏ వేషమొస్తే ఆ వేషం.. ఎంతిస్తే అంత... అలా తన 44 ఏళ్ల కెరీర్లో వందల పాత్రలు చేసినా.. బ్రేక్ అంటూ చెప్పుకోదగ్గ పాత్ర ఏదీ లేదు. కాకపోతే ఒకే ఒక్క సంతృప్తి మాత్రం మిగిలింది. ‘ఎన్టీఆర్‌గారు, ఏయన్నార్‌గారు.. వంటి వారు కనబర్చిన ఆదరణ మర్చిపోలేనిది. మోహన్‌బాబుగారు ఎన్నిసార్లు సహాయం చేశారో చెప్పలేను. ఓ సందర్భంలో దాసరి నారాయణరావుగారు 24 శాఖలకు సంబంధించినవాళ్లల్లో సీనియర్స్‌ని సన్మానించేటప్పుడు నన్నూ సన్మానించారు. అదెప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. చంద్రమౌళి ఇప్పటికీ సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్నారు. కానీ, ఎప్పటిలానే పేద తండ్రి, బాబాయ్, పెదనాన్న, పేద రైతు, కూలి... ఇవే పాత్రలు. ఒక్కసారి కూడా తెరపై తనను తాను కోటీశ్వరుడిగా చూసుకునే అవకాశం మాత్రం దక్కలేదు. అయినా కూడా ధీమాగానే ఉన్నారు. ఎందుకంటే కొడుకులిద్దరూ బాగా చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేశారు. ఇప్పటివరకూ తాను ఏం సంపాదించినా అదంతా భార్య చేతికే ఇచ్చారాయన. ఆమె జాగ్రత్త చేయడంతో, పిల్లలకు కొంత ఆర్థిక భరోసా ఇవ్వగలిగానని చెప్పారు చంద్రమౌళి. ఆ భరోసాకి వాళ్ల సంపాదన కూడా తోడు కావడంతో పిల్లలిద్దరూ సొంత ఇళ్లు కట్టుకోగలిగారు. ‘‘ఊహ తెలిసినప్పట్నుంచి ఇప్పటివరకూ వైభవాలు అనుభవించకపోయినా.. కనీసం పిల్లలైనా చక్కగా స్థిరపడినందుకు ఆనందంగా ఉంది. ఇక నన్ను మించిన కోటీశ్వరుడు ఎవరుంటారో చెప్పండి’’ అని ఉద్వేగానికి లోనవుతూ ముగించారు చంద్రమౌళి. - డి.జి. భవాని -
వీళ్ల గుండెజారి గల్లంతయ్యిందా?