
ఆమెతో అతడి రిలేషన్...
బాలీవుడ్ బాత్
ఆ...ఆ...ఆ... తొందరపడకండి. నిజ జీవితంలో కాదు. సినిమాలో. ఆ సినిమా పేరు ‘అయ్... దిల్ హై ముష్కిల్’. గతంలో ‘కభి ఆల్విదా నా కెహెనా’లో ఇలాంటి సబ్జెక్ట్‌నే చర్చించిన కరణ్ జొహర్ మళ్లీ రిస్క్ చేయడానికి సాహసిస్తున్నాడు. ఈసారి రణ్‌బీర్ కపూర్ తన కంటే వయసులో పెద్దదైన ఒకామెతో అనుబంధంలోకి వెళతాడు. ఆ పాత్రను ఐశ్వర్యారాయ్ పోషిస్తోంది. ఇంకో ముఖ్యపాత్ర అనుష్క శర్మది.
‘ఇది అందరూ ఊహించే ప్రేమ కథ మాత్రం కాదు’ అన్నాడు కరణ్ జొహర్. ఇప్పటికే లండన్, పారిస్‌లలో కొంత షూటింగ్ జరుపుకొంది. మిగిలింది జరగాల్సింది ఉంది. వచ్చే సంవత్సరం దీపావళికి సినిమా రిలీజ్ అట. అయితే మరోవైపు రణ్‌బీర్ కెరీర్ ఒడిదుడుకులలో ఉంది. మునపటి సినిమాలు ‘రాయ్’, ‘బాంబే వెల్వెట్’ నిరాశ పరిచాయి. తాజా సినిమా ‘తమాషా’ కూడా అటు ఇటుగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా అతణ్ణి ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.