
పన్నెండు నెలలకొకసారే క్యాలెండర్‌లో కొత్త సంవత్సరం.ప్రేమికులకు నిత్యమూ న్యూ ఇయరే!స్క్రీన్‌పై అలవోకగా ప్రేమించేహీరోయిన్‌లు సైతం రియల్ లైఫ్‌లోప్రేమను ప్రైవసీగానే ఫీలవుతారు.అలా ప్రేమలో ఉన్న హీరోయిన్‌లుఈ న్యూ ఇయర్ అయినా ఓ గుడ్‌న్యూస్ చెబుతారా?
రద్దీగా ఉన్న బస్‌స్టాప్. హీరోయిన్ బస్ కోసం ఎదురుచూస్తుంటుంది. హీరో అక్కడే ఉన్న బామ్మగారిని రోడ్డు దాటించి హీరోయిన్ దృష్టిలో మంచి మార్కులేయించుకుంటాడు. అది ఎర్లీ నైన్టీస్‌లో. తర్వాత రౌడీ మూక హీరోయిన్‌ను అల్లరి పెడుతుంటే వాళ్లని డిష్యూం డిష్యూం అని రఫ్ఫాడిస్తాడు. ఇది ఎర్లీ టూ థౌజండ్స్. ఆ తర్వాతి కాలంలో కాలేజీలో, ఒకే అపార్ట్‌మెంట్.. ఇలా దశలవారిగా హీరోయిన్స్‌తో ప్రేమలో పడుతూ వస్తున్నారు హీరోలు. అలాగే హీరోలతో ప్రేమలో పడుతున్నారు హీరోయిన్లు. ఇదంతా సినిమా వరకే. అంతా స్క్రిప్ట్. ఎవరో రాసిన ఆ స్క్రిప్ట్‌లో వీళ్లు ప్రేమలో పడుతున్నారు.
మరి రియల్ లైఫ్‌లో వీళ్లు ఎలా ప్రేమలో పడతారంటే చెప్పలేం. అది వాళ్లంతట వాళ్లు చెబితే తెలుస్తుంది. కానీ ఎవరితో ప్రేమలో ఉన్నారంటే మాత్రం మనం చెప్పగలం. కొందరు హీరోయిన్లు ప్రస్తుతానికైతే మాత్రం ప్రేమలో నిండా మునిగి తేలుతున్నారు. లవ్ జర్నీ చేస్తున్న హీరోలూ ఉన్నారండోయ్. కొందరు ‘అవుటాఫ్ ఇండస్ట్రీ’ వాళ్లతో లవ్‌లో పడితే కొందరు ‘ఇన్‌సైడ్ ఇండస్ట్రీ’వాళ్లతోనే ప్రేమ ప్రయాణం చేస్తున్నారు. మరి అలా ప్రేమలో ఉన్న స్టార్స్ 2019లోనైనా ఏడడుగులేస్తారా? రింగులు మార్చుకుంటారా? అని అడిగితే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు.
లవ్ గేమ్
గతేడాది స్పోర్ట్స్ డ్రామా ‘సూర్మా’ సినిమాలో యాక్ట్ చేయడానికి తాప్సీ అంగీకరించినప్పుడు చాలామంది ముసిముసిగా నవ్వుకున్నారు. దానికి కారణం స్పోర్ట్స్ పట్ల ఆ సమయంలో ఈ ఢిల్లీ బ్యూటీకి బోలెడంత ఆసక్తి ఉండటమే. అసలు క్రీడల మీద ఆమెకు ఎందుకు ఆసక్తీ అంటే.. ఓ క్రీడాకారుడితో ప్రేమలో పడ్డారు కాబట్టి. అప్పటికే డెన్మార్క్‌కు చెందిన మథియాస్ బో అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు తాప్సీ. రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని అంగీకరిస్తారు కానీ ఆ వ్యక్తి గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడను అంటారామె. మరి ఈ లవ్‌గేమ్‌కు వెడ్డింగ్ లాకెట్ ఎప్పుడేస్తారో?
ఫిట్‌నెస్ ప్రేమ
బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఫిజిక్ గురించి ప్రస్తావించాలంటే టైగర్ ష్రాప్ గురించి మాట్లాడాల్సిందే. అలాగే హీరోయిన్స్‌లో దిశా పాట్నీ. వీళ్లకు ఏ జిమ్‌లో పరిచయం అయిందో తెలియదు కానీ ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు. మేం రిలేషన్‌లో ఉన్నాం అని చెప్పరు. కానీ లంచ్ డేట్స్, ఫ్యామిలీ పార్టీలలో చేతిలోన చెయ్యేసి చెప్పకనే చెబుతారు. మరి ఫిట్‌నెస్ గోల్స్ పెంచే ఈ జోడీ కఫుల్ గోల్స్ ఎప్పుడు సెట్ చేస్తారని బాలీవుడ్ వెయిటింగ్. అన్నట్లు... ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డాక కలిసి నటించిన చిత్రం ‘భాగీ 2’.
ప్రేమ రాగాలు
‘పడమటి సంధ్యా రాగం’ సినిమాలో దేశీ హీరోయిన్, విదేశీ హీరోని ఇష్టపడినట్టు శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలేది కూడా దేశీ, విదేశీ లవ్‌స్టోరీయే. లండన్‌కు, మదరాస్‌కు లంకె ఎలా కుదిరిందో తెలియదు. కానీ నువ్వుంటేనే నవ్వుంటుంది అని విరహాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ చేస్తారు ఒక్కోసారి. కూతురు అడక్కముందే కమల్‌హాసన్ అంగీకారం తెలిపేశారని చెన్నై టాక్. వీలున్నప్పుడల్లా హాలిడేయింగు, లేదంటే లాస్ ఏంజెల్స్‌లో ప్రేమ షికారింగు చేస్తున్నారీ జంట. మరి పెళ్లి ట్యూన్ ఎప్పుడు వినిపిస్తారంటే? ప్రస్తుతానికి నిశ్శబ్దమే సమాధానం.
వ్యత్యాసాలేల
ప్రేమకు కుల, మత, వర్ణ, వర్గ భేదాలే లేనప్పుడు వయసు వ్యత్యాసాలేల? అంటున్నారు మలైకా అరోరా, అర్జున్ కపూర్. వయసు వ్యత్యాసం అనేది ప్రాబ్లమే కాదంటారు. అర్బాజ్ ఖాన్‌తో విడిపోయాక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటి పేరుని తొలగించారు మలైకా. కపూర్‌గా మారడానికే ఇదంతా అన్నారు బాలీవుడ్ నెటిజన్‌లు. మలైకా ‘ఏకే’ లాకెట్ ధరిస్తే ఏ ఫర్ అర్జున్ అన్నారు. కాదని ఖండించలేదు మలైకా. ఈ ఏడాది పెళ్లే అన్నారు అర్జున్ కపూర్. నిజమౌతుందా? వేచి చుద్దాం. ఇంతకీ వయసు వ్యత్యాసం చెప్పలేదు కదూ.. అర్జున్ కన్నా మలైకా దాదాపు 12 ఏళ్లు పెద్ద. ఆ.. ఇంతా? అని కొందరికి అనిపించొచ్చు. ‘ఓస్.. ఇంతేనా’ అన్నది ప్రేమికుల ఫీలింగ్.
ఇంటర్నేషనల్ లవ్‌స్టోరీ
అమీ జాక్సన్ లండన్‌లో పుట్టి, పెరిగారు. ‘మదారాసు పట్టణం’ సినిమా కోసం మదరాసులో వచ్చి పడ్డారు. ‘ఏ మాయ చేశావె’ హిందీ వెర్షన్‌లో నటించిన ప్రతీక్ బబ్బర్‌తో ప్రేమలో పడ్డారు. చేతిమీద పచ్చబొట్లు కూడా పొడిపించేసుకున్నారు ఈ ఇద్దరూ. కానీ అనుకున్నట్లుగా జరగలేదు. ఆ తర్వాత లండన్‌లోనే తన ట్రూ లవ్ ఉందని తెలుసుకున్నారు అమీ. జార్జ్ పనయిటో అనే మల్టీ మిలీనియర్‌కి మనసిచ్చేశారు. ప్రస్తుతం వీలు దొరికినప్పుడల్లా విదేశాలను చుట్టేసొస్తుంటారు వీళ్లు. తాజాగా ‘2.0’ సక్సెస్ అయినప్పుడు జార్జ్ పెదాలకు పెదాలతో తాళం వేసి మరీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఈ ఏడాదైనా వీళ్లు రింగులు మార్చుకుంటారా? చర్చి గంటలు మోగిస్తారా? రిక్కించిన చెవులతో వేచి చూద్దాం.
ప్రియమైన ఫియాన్సీ
విఫల ప్రేమకు మందేమైనా ఉందా? అంటే మళ్లీ ప్రేమే అంటాడో ప్రేమదాసు. నిజమే. బాధకు మందు ప్రేమే. నయనతార ప్రేమ విఫలమైనప్పుడల్లా కూడా ప్రేమనే కోరుకున్నారు. శింబు నుంచి విడిపోయి ప్రభుదేవాని ప్రేమించారు. అతన్నుంచి విడిపోయాక దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డారు, విఘ్నేష్ హిట్టు కొడితే నయనతార చప్పట్లు కొట్టి, నయన్ అవార్డులు కొడితే విఘ్నేష్ అభినందనల వర్షం కురిపించి మురిసిపోతుంటారు. వేడుకల్లో విఘ్నేష్‌ను ‘ఫియాన్సీ’ అని సంబోధిస్తారామె. మరి ఫియాన్సీని హబ్బీ ఎప్పుడు చేస్తావ్ నయన్ అని అడుగుదామంటే సినిమా ప్రమోషన్స్‌లో కనిపిస్తేనే కదా!
హబ్బీ ఫొటో తీస్తే...
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా ఫొటోలు చితక్కొడుతుంటారు. ఎంత ప్రేమతో తీస్తే ఇంత అద్భుతంగా రావాలి. అవును ప్రేమగా తీస్తే అంతే వస్తాయి అని ఆవిడ కూడా ఒప్పుకుంటారు. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్నారీ భామ. ‘హబ్బీ’ ఫొటో తీశాడంటూ ఓ పోస్ట్ పెట్టారు ఆ మధ్య. పెళ్ళైపోయిందనుకున్నారంతా, ప్రెగ్నెంట్ అని కూడా వార్తలు వినిపించాయి. అవేం లేదని క్లారిఫై చేశారు వెంటనే. మరి పెళ్లయిందన్న గాసిప్‌ని ఈ ఏడాదైనా నిజం చేస్తూ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుందని ఆశిద్దాం. ఇష్టమైన హీరోయిన్‌కు పెళ్లి అవుతుందంటే ఇష్టం లేకపోయినా ఆ విశేషాల కోసం చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి.. కొత్త సంవత్సరంలో ఎంతమంది హీరోయిన్స్ పెళ్లిడ్రెస్ (స్క్రీన్ మీద కాదు) వేసుకుంటారో వేచి చూద్దాం.
ప్లేబాయ్ ప్రేమకథ
అదేంటో రణ్‌బీర్ కపూర్ ఇట్టే ప్రేమలో పడిపోతుంటాడు. విశేషమేంటంటే అట్టే బయటకొస్తుంటాడు అందులోంచి. దీపికా పదుకోన్‌తో ప్రేమలో మునిగి తేలాడు రణ్‌బీర్. ఇద్దరూ పెళ్లి దాకా వెళ్లారు. ఎందుకో జరగలేదు. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో కూడా సేమ్ ఇలానే జరిగింది. ప్రస్తుతం రణ్‌బీర్, ఆలియా భట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. పెళ్లి అభ్యంతరాలు కూడా ఏం లేవన్నారు ఇరు కుటుంబ సభ్యులు. ఈ ప్రేమ పరీక్ష అయినా పాస్ అయ్యి పెళ్లి వరకూ వెళ్తాడా రణ్‌బీర్ కపూర్? ఎదురు చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment