నచ్చినవాడు దొరకలేదు | I believe in the respectability that comes with being married to the person you love | Sakshi
Sakshi News home page

నచ్చినవాడు దొరకలేదు

Published Mon, Jun 1 2015 10:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నచ్చినవాడు దొరకలేదు - Sakshi

నచ్చినవాడు దొరకలేదు

‘‘నన్ను చాలా మంది అడుగుతుంటారు..మీరు ఎవరిని పోటీగా భావిస్తారని? కానీ మా తరం కథానాయికలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం తప్పితే, అనవసరంగా పోటీలు పడి విమర్శించుకోం’’ అని ప్రియాంకా చోప్రా చెప్పారు. తనకిష్టమైన కథానాయికల గురించి ప్రియాంక చెబుతూ -‘‘ఇప్పుడున్న వారితో నేను స్నేహంగానే మెలుగుతాను.  మరీ ముఖ్యంగా నాకు కంగనా రనౌత్, విద్యాబాలన్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ కలిసి బాలీవుడ్ సినిమా స్థాయిని పెంచారు.  ఇక కంగనా విషయానికొస్తే మా ఇద్దరి కెరీర్లు ఒకేలా ఉంటాయి. పైగా ఇద్దరం మాకు ఎదురైన సవాళ్లను  కష్టపడి అధిగమించాం.
 
 అందుకే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం’’ అని అన్నారు.  ప్రేమ, పెళ్లి గురించి ప్రియాంక  తన అభిప్రాయాలు చెబుతూ -‘‘పన్నెండేళ్ల  వయసు నుంచే నాకు పెళ్లి గురించి రకరకాల ఆలోచనలున్నాయి. పెళ్లిళ్లు  స్వర్గంలోనే నిర్ణయిస్తారని ఓ నానుడి ఉంది.  దాన్నే నమ్ముతాను కూడా. ఇప్పటికీ నాకు మనసుకు నచ్చిన వాడు దొరకలేదు. పెళ్లి అనే వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. నాకు నచ్చిన వాడు దొరికితే  అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని కష్టాలొచ్చినా వెనుకాడను’’ అని అన్నారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement