నేను నాన్నలా కాదు : శృతి హాసన్
స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. సక్సెస్ కోసం చాలా రోజులు ఎదురుచూసిన భామ శృతిహాసన్. కెరీర్ స్టార్టింగ్లో ఐరన్ లెగ్గా ముద్రపడ్డ శృతి, తరువాత గబ్బర్ సింగ్ సక్సెస్తో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్లతో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి, కమల్ హాసన్ కూతురిగా కన్నా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతోంది.
కేవలం ఐడెంటీ విషయంలోనే కాదు చాలా విషయాల్లో నేను నాన్నలా కాదు అంటోంది. నటుడిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కమల్, నాస్తికుడు. దేవుణ్ని నమ్మడు. కానీ శృతి అలా కాదట. తాను దేవుణ్ని నమ్ముతానని, తీరిక సమయాల్లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేస్తానని చెపుతోంది. కానీ తన నమ్మకం మరీ మూర్ఖంగా మాత్రం ఉండదట. చిన్న చిన్న కోరికలు దేవుడికి చెప్పుకుంటానేగాని పూర్తిగా దేవుడే అన్ని చేస్తాడని ఆయన మీదే భారం వేయనంటోంది.