కొత్త ఏడాది కొత్త వరుడు కావాలి: హీరోయిన్ | Iam looking for a new man in new year, says Vivica A Fox | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది కొత్త వరుడు కావాలి: హీరోయిన్

Published Fri, Jan 13 2017 3:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

కొత్త ఏడాది కొత్త వరుడు కావాలి: హీరోయిన్

కొత్త ఏడాది కొత్త వరుడు కావాలి: హీరోయిన్

కొత్త సంవత్సరంలో తాను కొత్త వరుడి కోసం చూస్తున్నట్లు హాలీవుడ్ హీరోయిన్ వివికా ఎ ఫాక్స్ చెప్పింది. అయితే, అతడు బాగా సరదా మనిషి అయి ఉండాలని, 40 ఏళ్ల పైబడి ఉండాలని షరతులు పెట్టింది. కిల్ బిల్ సినిమాలో నటించిన ఫాక్స్ (52).. 2016 సంవత్సరం మొత్తం తాను చాలా బిజీగా ఉన్నానని, తన మీద తాను దృష్టి సారించడానికే సమయం సరిపోయిందని చెప్పింది. ఈ సంవత్సరం మాత్రం ఎలాగైనా సోల్‌మేట్‌ను వెతుక్కుంటానని స్పష్టం చేసింది. 
 
ఇప్పటికే చాలామంది యువకులను తాను చూశానని, అందువల్ల ఈసారి తనను తాను బాగా చూసుకోవడంతో పాటు భార్య బాగోగులు కూడా చూసే పెద్దమనిషి అయితే బాగుంటుందని అనుకుంటున్నానని చెప్పింది. ఒక మంచి భాగస్వామి కావాలన్నదే తన ఉద్దేశమని, సరదాగా ఉంటూ.. బయటకు తీసుకెళ్తూ, మంచి సెన్సాఫ్ హ్యూమర్ కలిగి ఉండి, ప్రయాణాలు అంటే ఇష్టం ఉండేవాళ్లు కావాలని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement