ముగ్గురు అమ్మాయిలు.. ఓ దెయ్యం | Idhem Deyyam horror comedy film will be released soon. | Sakshi
Sakshi News home page

ముగ్గురు అమ్మాయిలు.. ఓ దెయ్యం

Jun 28 2017 12:20 AM | Updated on Sep 5 2017 2:36 PM

ముగ్గురు అమ్మాయిలు.. ఓ దెయ్యం

ముగ్గురు అమ్మాయిలు.. ఓ దెయ్యం

ముగ్గురు యువకులకు ఓ దెయ్యం రూపంలో ఆపద ఎదురవు తుంది.

ముగ్గురు యువకులకు ఓ దెయ్యం రూపంలో ఆపద ఎదురవు తుంది. దాన్నుంచి వాళ్లెలా తప్పించుకున్నారు? వారికి ఎదురైన వింత అనుభవాలేంటి? అనే అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ఇదేం దెయ్యం’. ముగ్గురు అమ్మాయిలతో అనేది ఉపశీర్షిక. శ్రీనాథ్‌ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్‌ ఆర్పి ముఖ్యతారలుగా వి. రవి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

ఏవీ రమణమూర్తి సమర్పణలో ఎస్‌.సరిత నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్‌  కానుంది. ఎస్‌.సరిత మాట్లాడుతూ– ‘‘ప్రజెంట్‌ హారర్‌ కామెడీ సినిమాలను ఆడియన్స్‌ ఆదరిస్తున్నారు. మా చిత్రం కూడా హారర్‌ కామెడీయే. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఉంటుంది. బాలస్వామి  అందించిన పాటలు సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌’’ అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్స్‌: రత్న శేఖర్, రామ్‌ కిశోర్, మధు సూదన్, సౌజన్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement