
నన్ను పెళ్లికి పిలిస్తే.. వెళతా!
ముంబై: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో ప్రేమలో పడినట్లు వచ్చిన వార్తలకు సోనాక్షి సిన్హా ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టింది. తమ మధ్య డేటింగ్ జరిగిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన రాజ్ కుమార్ సినిమాలో నటించిన వీరిద్దరూ చాలా దగ్గరయ్యారని ఆ మధ్య బాలీవుడ్ లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. తమ మధ్య కలహాలు సృష్టించాలనే కొందరు ఆ రకమైన రూమర్లను పుట్టించారని సోనాక్షి పేర్కొంది. కాగా, షాహిద్ కపూర్-మీరా రాజ్ పుత్ ల వివాహానికి మీరు వెళతారా?అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానిమిచ్చింది ఈ అమ్మడు. తనను షాహిద్ పెళ్లికి పిలిస్తే మాత్రం తప్పకుండా వెళతానని తెలిపింది. ఓ ఇంటివాడు కోబోతున్న షాహిద్ ను ఇప్పటికే అభినందించానని పేర్కొంది. ఇటీవల ఓ కార్యక్రమంలో తామిద్దరం కలిశామని.. అప్పుడే షాహిద్ ను విష్ చేశానని సోనాక్షి స్పష్టం చేసింది. షాహిద్ కు పెళ్లి అవుతున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నట్లు ఒక ప్రశ్నకు బదులిచ్చింది దబాంగ్ చిన్నది.
గత మే నెల 16వ తేదీన ఢిల్లీ, చత్తర్‌పూర్‌లో ఉన్న మీరా ఇంట్లో వారి వివాహాం నిశ్చయానికి సంబంధించి రోకా వేడుక జరిగింది. ఆ వేడుకలో మీరా వేలికి షాహిద్ ఉంగరం తొడిగాడు. అయితే ఆ ఉంగరం అక్షరాలా 23 లక్షల రూపాయలు. మరీ వీరి పెళ్లి ఈనెలలో జరుగుతుందని తొలుత భావించినా.. ఇంకా కచ్చితమైన తేదీ అయితే మాత్రం తెలియలేదు.