గాయపడిన సోనాక్షి సిన్హా!
త్వరలో విడుదల కానున్న 'ఆర్.. రాజ్ కుమార్' చిత్ర ప్రమోషన్ కు బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా దూరమైంది. ఇటీవల ర్యాంప్ లో సోనాక్షి కాలికి గాయమైన సంగతి తెలిసిందే.
దాంతో దక్షిణాదిలో షాహిద్ తో కలిసి ప్రభుదేవా నిర్వహిస్తున్న ప్రమోషన్ కార్యక్రమానికి దూరంగా ఉంది. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో ప్రభు, షాహీద్, చార్మీలు పాల్గొన్నారు.
సారీ బెంగళూరు, హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొనలేకపోయాను. శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతోంది అని సోనాక్షి ట్విటర్ లో పొస్ట్ చేసింది.