ఊహలకు అతీతంగా ‘1’ | Imagery beyond the '1 ' | Sakshi
Sakshi News home page

ఊహలకు అతీతంగా ‘1’

Published Mon, Sep 30 2013 2:09 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఊహలకు అతీతంగా ‘1’ - Sakshi

ఊహలకు అతీతంగా ‘1’

‘1’... అటు సినిమా పరంగా, ఇటు సినీ కెరీర్ పరంగా మహేష్‌బాబు లక్ష్యం ఇదే. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రపథానికి అతి చేరువలో ఉన్న మహేష్... ప్రస్తుతం చేస్తున్న ‘1’ చిత్రంతో నంబర్‌వన్ అనిపించుకోవాలనే కసితో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా అన్ని రకాలుగా శ్రమ పడుతున్నారాయన. అందులో భాగంగానే ఈ సినిమా కోసం ప్రిన్స్ దృఢకాయునిగా మారారు. 
 
 గ్లామర్ చెదరకుండా, జాగ్రత్తగా శారీరకభాషను మార్చుకున్నారు. ‘1’ ప్రోమోస్‌లో హాలీవుడ్ హీరోలను తలపించే మహేష్ లుక్‌ని చూస్తే ఆయన పడ్డ కష్టం అర్థమవుతోంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లోని క్రాబీలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఇందులో మహేష్ పాత్ర ఊహలకు అతీతంగా, భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. 
 
 16 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ బాలనటునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement