మరోసారి ప్రయోగానికే ఓటేశాడు | interesting genre for sharwanands next | Sakshi
Sakshi News home page

మరోసారి ప్రయోగానికే ఓటేశాడు

Published Sun, Jan 10 2016 4:22 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

మరోసారి ప్రయోగానికే ఓటేశాడు

మరోసారి ప్రయోగానికే ఓటేశాడు

యంగ్ జనరేషన్ హీరోలలో ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే ముందుగా వినిపించే పేరు శర్వానంద్. కెరీర్ స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా సినిమాలు చేస్తున్న శర్వా అదే జానర్లో మంచి విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఎక్స్ప్రెస్ రాజా సినిమాతో స్టార్ హీరోలతో ఢీ కొడుతున్నాడు. ఈ సినిమా సక్సెస్పై కాన్ఫిడెంట్గా ఉన్న శర్వానంద్ తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా మరోసారి ప్రయోగానికే ఓటేశాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 14న ఎక్స్ప్రెస్ రాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్. త్వరలోనే ఓ ఫ్లాప్ డైరెక్టర్తో సినిమాకు రెడీ అవుతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా రారా కృష్ణయ్య సినిమాను తెరకెక్కించిన మహేష్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ లవ్ స్టోరి చేయడానికి రెడీ అవుతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement