నాకు తెలియకుండానే నా పెళ్లి వార్తలు రాసేస్తున్నారు! | Interview with Sai Dharam Tej about Supreme | Sakshi
Sakshi News home page

నాకు తెలియకుండానే నా పెళ్లి వార్తలు రాసేస్తున్నారు!

Published Sat, Apr 30 2016 11:03 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

నాకు తెలియకుండానే నా పెళ్లి వార్తలు రాసేస్తున్నారు! - Sakshi

నాకు తెలియకుండానే నా పెళ్లి వార్తలు రాసేస్తున్నారు!

 ‘సుప్రీమ్’ హీరోగా సాయిధరమ్‌తేజ్ వేసవి పోరుకు సిద్ధమవుతున్నారు. ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన  ‘సుప్రీమ్’ ఈ నెల 5న విడుదల కావడానికి  సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్‌తేజ్ చెప్పిన ముచ్చట్లు...
 
ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్‌గా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు బాలు. చాలా రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూ అందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలున్నాయి.
 
చిరంజీవిగారి సూపర్‌హిట్ సాంగ్ ‘అందం హిందోళం.. అధరం తాంబూలం’ను రీమిక్స్ చేయాలనేది దర్శక-నిర్మాతల ప్లాన్. కచ్చితంగా సినిమాకు ఇది ప్లస్ పాయింట్ అనుకుంటున్నా. ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రానికి ‘సుప్రీమ్’ టైటిల్ పెడదామని ‘దిల్’ రాజుగారు చెప్పగానే భయపడ్డాను. చిరంజీవిగారి దగ్గరకెళ్లి  చెబితే ఆయనే నా భుజం తట్టి ‘‘మేం కష్టపడింది మీ కోసమే కదా, గో ఎహెడ్.. నువ్వూ కష్టపడు మా కన్నా మంచి పేరు సాధించు’’ అని వెన్ను తట్టారు. కథకు బాగా సెట్ కావడంతో ఈ టైటిల్‌కు ఫిక్స్ అయ్యాం. అసలు ‘సుప్రీమ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది.
 
‘సుప్రీమ్ హీరో’ అనే ట్యాగ్‌లైన్ వల్ల నా బాధ్యత పెరిగింది. ఒత్తిడేమీ లేదు. కానీ, దర్శకనిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేకపోతున్నా. చిరంజీవిగారు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తే ఆయనకా ట్యాగ్‌లైన్ వచ్చింది. నాకు నేనుగా సుప్రీమ్ హీరో అనిపించుకోవడం నాకిష్టం ఉండదు. దానికో అర్హత ఉండాలి. నాకు తెలిసిన సుప్రీమ్ చిరంజీవిగారే. అందుకే ఆ టైటిల్ జస్టిఫికేషన్ కోసం వెయ్యిశాతం ఎఫర్ట్ పెట్టా.
 
నేను  సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఆరేళ్లు పూర్తయింది. ఎంతో మందిని కలిశాను. వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నా. చిన్నతనం నుంచి కాస్త సహనం తక్కువ. పరీక్షలు రాశాక, రిజల్ట్స్ గురించి వెయిట్ చేయడమంటే చాలా చిరాగ్గా ఉండేది. కానీ, సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాక, ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకు న్నా. సహనం కూడా పెరిగింది. మొత్తం మీద సినిమా పరిశ్రమ నాలో చాలా మార్పు తీసుకొచ్చింది.
 
హీరోగానే కాకుండా  ఇంకాస్త వెరైటీ  రోల్స్ చేయాలని నాకూ ఉంది. కానీ, ముందుగా నేను హీరోగా నిలబడాలి. ఆ తర్వాత విలన్ పాత్రలూ చేస్తాను.
 
‘సుప్రీమ్’లో రాశీ ఖన్నాకు, నాకూ మధ్య మంచి  రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఆమె పాత్ర పేరు బెల్లం శ్రీదేవి. రాశీ ఖన్నాలో మంచి కమెడియన్ ఉందని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆమె కామెడీ టైమింగ్ సూపర్బ్.
 
నా మీద ఇప్పటికే చాలా రూమర్లు వస్తున్నాయి. నాకు తెలియకుండానే నా పెళ్లి వార్తలు రాసేస్తున్నారు. ఇలాంటివన్నీ మొదట్లో పట్టించుకునేవాణ్ణి. కానీ తర్వాతర్వాత అలవాటైపోయింది. నేను ఇదివరకు ఇష్టపడిన అమ్మాయిలందరూ ఇప్పుడిప్పుడే కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. ఈ రూమర్ల దయ వల్ల ఆ కాంటాక్ట్‌లు కూడా పోయేలా ఉన్నాయి(నవ్వుతూ).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement