జీవితంలో మర్చిపోలేని సెల్ఫీ ఇది! | most memorable selfie ever in my lifetime, tweets Sai Dharam Tej | Sakshi
Sakshi News home page

జీవితంలో మర్చిపోలేని సెల్ఫీ ఇది!

Published Tue, May 10 2016 7:13 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

జీవితంలో మర్చిపోలేని సెల్ఫీ ఇది! - Sakshi

జీవితంలో మర్చిపోలేని సెల్ఫీ ఇది!

సినిమా హీరోలతో అభిమానులు సెల్ఫీ తీసుకోవడం మామూలే. కానీ.. అభిమానులతో, అందులోనూ ప్రత్యేకమైన అభిమానులతో హీరోలే సెల్ఫీ తీసుకోవడం మామూలు విషయం కాదు కదా. సరిగ్గా ఇలాగే జరిగింది. 'సుప్రీమ్' సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ తన ప్రత్యేక అభిమానులతో సెల్ఫీ తీసుకున్నాడు. తాను జీవితంలో మర్చిపోలేని సెల్ఫీ ఇదేనంటూ ఆ ఫొటోతో సహా ట్వీట్ చేశాడు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. దివ్యాంగుల కోసం సుప్రీమ్ సినిమా స్పెషల్ షో ఒకదాన్ని ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు స్వయంగా సినిమా హీరోను కూడా ఆహ్వానించారు. దాంతో అక్కడకు వెళ్లిన సాయిని చూసి ఆ అభిమానులంతా ఎంతో సంతోషంగా దగ్గరకు వచ్చారు. వారందరితో కలిసి సెల్ఫీ తీసుకున్న హీరో.. దాన్ని ట్వీట్ చేశాడు. తన జీవిత కాలంలో ఎప్పుడూ మర్చిపోలేని సెల్ఫీలలో ఇది తప్పకుండా ఒకటి అవుతుందని చెప్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement