ఆ హీరోయిన్ వల్లే వాళ్లు విడిపోయారా..? | Is Kim Sharma the reason Arjun Khanna and his wife are living separately? | Sakshi

ఆ హీరోయిన్ వల్లే వాళ్లు విడిపోయారా..?

Jan 20 2017 10:58 AM | Updated on Sep 5 2017 1:42 AM

ఆ హీరోయిన్ వల్లే వాళ్లు విడిపోయారా..?

ఆ హీరోయిన్ వల్లే వాళ్లు విడిపోయారా..?

అర్జున్‌ ఖన్నా, ఆయన భార్య షెఫాలీ విడిపోవడగానికి కిమ్‌ శర్మే కారణమని విమర్శలు వస్తున్నాయి.

ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌ కిమ్‌ శర్మ గతంలో టీమిండియా క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌తో ప్రేమాయణం నడిపినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఆరేళ్ల క్రితం కెన్యా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కిమ్‌ శర్మ.. ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనర్‌ అర్జున్‌ ఖన్నాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేగాక అర్జున్‌ ఖన్నా, ఆయన భార్య షెఫాలీ విడిపోవడగానికి కిమ్‌ శర్మే కారణమని విమర్శలు వస్తున్నాయి.

అర్జున్‌ ఖన్నా, షెఫాలీ కొన్నిరోజులుగా కలిసి ఉండటం లేదు. తనపై అర్జున్ ఖన్నాకు ఆసక్తి తగ్గిపోయిందని భావించిన షెఫాలీ భర్తకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక కిమ్‌ విషయానికొస్తే భర్తతో తెగదెంపులు చేసుకుని భారత్‌కు తిరిగి వచ్చినట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ముంబైకి వచ్చాక అర్జున్‌ ఖన్నాతో సన్నిహితంగా ఉంటోందట. వీరిద్దరూ కలసి ఇటీవల పలుమార్లు బహిరంగంగా కనిపించారు. ఓ పార్టీలో ఇద్దరూ క‍్లోజ్గా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ నెల 21న కిమ్‌ బర్త్ డే పార్టీని గోవాలో గ్రాండ్‌గా చేసేందుకు అర్జున్‌ ఖన్నా ప్లాన్‌ చేశాడట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement