Kim Sharma Leander Paes Make It Instagram Official Is It - Sakshi
Sakshi News home page

Kim Sharma- Leander Paes: టెన్నిస్‌ స్టార్‌తో రిలేషన్‌.. కన్‌ఫర్మ్‌ చేసిన కిమ్‌ శర్మ!

Published Mon, Sep 6 2021 12:18 PM | Last Updated on Sun, Oct 17 2021 1:43 PM

Kim Sharma Leander Paes Make It Instagram Official Is It - Sakshi

భారత టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ (48)..  కృష్ణవంశీ పాపులర్‌ సినిమా ఖడ్గం ఫేమ్‌ కిమ్‌ శర్మ (40).. వీరిద్దరి డేటింగ్‌ విషయం రహస్యమేమి కాదు. జూలైలోనే ఈ జంట దగ్గరగా కలిసి ఉన్న ఫోటోలను గోవాలోని ఓ రెస్టారెంట్‌, తన అకౌంట్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అయిన విషయం విదితమే. ఆ తర్వాత సైతం చాలా సార్లు కెమెరా కంటికి జంటగా చిక్కారు. అయితే వారిద్దరూ ఆ విషయం గురించి పెద్దగా స్పందించలేదు.

కాగా ఆదివారం (సెప్టెంబర్‌ 5న) పేస్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో కిమ్‌ షేర్ చేసింది. దీంతో వారి రిలేషన్‌షిప్‌ని కన్‌ఫర్మ్‌ చేసినట్లు అయ్యింది.  బాలీవుడ్‌ బ్యూటీ కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ ఉండగా,  టెన్నిస్‌ స్టార్‌ ఆ భామ వైపు ప్రేమగా చూస్తున్నాడు.  దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది.

కిమ్‌ తన సినిమాలతో కంటే టీమిండియా మాజీ క్రికెటర్‌, యువరాజ్‌సింగ్‌తో నడిపిన ప్రేమాయణంతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. కానీ వివిధ కారణాలతో యువీతో విడిపోయిన ఆ భామ 2010లో కెన్యా వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కానీ వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2016లో అతనితో తెగదెంపులు చేసుకుంది. అనంతరం నటుడు హర్షవర్ధన్‌ రాణేతో ఎఫైర్‌ సాగించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం లియాండర్‌ పేస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది.

ప్రేమ వ్యవహారాల విషయంలో లియాండర్‌ పేస్‌ ఏం తక్కువ తినలేదు. ఎంతో మందితో ఎఫైర్స్‌ నడిపాడు. ఇంతకుముందు ప్రముఖ మోడల్‌ రియా పిళ్లైతో సహజీవనం చేయగా, ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతానికి కిమ్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు.  2020 చివరిలో రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ టెన్నిస్‌ స్టార్‌.. 1992 నుంచి 2016 వరకూ మొత్తం 7 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.  అతని సుదీర్ఘ కెరీర్‌లో 1996లో జరిగిన అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడమే కాకుండా 18 గ్రాండ్‌స్లామ్‌(డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌)ల్లో విజేతగా నిలిచాడు.

చదవండి: Sidharth Shukla: 'అప్పటి నుంచి సిద్ధార్థ్ ఇంటికి రావడం మానేశాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement