యువన్‌లా ఇసైజ్ఞాని బాణీలు కట్టాలి
యువన్‌శంకర్‌రాజా లాగా ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీత బాణీలను కట్టాలని దర్శకుడు కరు.పళనివేల్ విజ్ఞప్తి చేశారు. ఎంకే ఫిలింస్ పతాకంపై సి.ముత్తుకృష్ణన్ నిర్మిస్తున్న చిత్రం రాణి. ఎస్.పాణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి, కబాలి చిత్రం ఫేమ్ ధన్సిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడిమో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు కరు.పళనియప్పన్ మాట్లాడుతూ తానింత వరకూ ఎవరినీ ఏ కోరిక కోరలేదన్నారు. అలా కోరితే సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అరుునా తానీరోజున ఇసైజ్ఞాని ఇళయరాజాను ఒక కోరిక కోరుతున్నానన్నారు.
ఆయన యువ సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా లాగా ఈ తరానికి తగ్గట్టుగా సంగీతాన్ని అందించాలన్నారు. ఎందుకంటే ఆయన చాలా ఏళ్ల క్రితం బాణీలు కట్టిన పాటలను మనం ఇప్పటికీ విని ఆనందిస్తున్నామన్నారు. అలానే యువన్‌శంకర్‌రాజా తరహాలో పాటలను అందిస్తే ఈ తరం వారికి మరి కొన్నేళ్ల ఇళయరాజా పాటలను వినే భాగ్యం కలుగుతుందన్నారు. మరో కోరిక ఏమిటంటే కార్తీక్‌రాజా, యువన్‌శంకర్‌రాజాలు ఆయన తండ్రి ఇళయరాజా ఇప్పటి వరకూ సంగీతాన్ని అందించిన చిత్రాల వివరాలను సేకరించి ఆయనకు బ్రహ్మాండమైన అభినందన సభను ఏర్పాటు చేయాలని అన్నారు.
ఇళయరాజాకు అభినందన సభ అంటే సంగీత ప్రియులందరూ చూసి సంతోషిస్తారని అన్నాను. నాలుగు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఇళయరాజా ఇందుకు అంగీకరించరని, అయితే ఈ విషయమై తాను యువన్‌శంకర్‌రాజాతో మాట్లాడతానని దర్శకుడు కరు.పళనీయప్పన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి ధన్సిక, చిత్ర దర్శకుడు పాణి, నిర్మా త ముత్తుకృష్ణన్, దర్శకుడు పేరరసు, సముద్రఖని, నమో నారాయణ, మనోజ్‌కుమార్, తమిళ నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు పీఎల్.తేనప్పన్ తదితరులు పాల్గొన్నారు.