'ఆ హీరోయిన్ను తరిమేశాం' | Jacqueline Fernandez kicked off my movie, says salman khan | Sakshi
Sakshi News home page

'ఆ హీరోయిన్ను తరిమేశాం'

Published Thu, Jun 4 2015 5:22 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

'ఆ హీరోయిన్ను తరిమేశాం'

'ఆ హీరోయిన్ను తరిమేశాం'

తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమాను హిందీలో రీమేక్ చేసి, భారీహిట్ సంపాదించిన సల్మాన్ఖాన్.. దానికి సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, మొదటి భాగంలో హీరోయిన్గా చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను మాత్రం ఈ సీక్వెల్ నుంచి 'తరిమేశాం' అని సల్లూభాయ్ చెబుతున్నాడట. నిజానికి కిక్ సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరూ బాగా రాసుకు పూసుకు తిరిగారని టాక్ వచ్చింది. మరి మధ్యలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఇటీవల దుబాయ్లో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సల్మాన్ తన స్నేహితుడు, ప్రముఖ దర్శక నిర్మాత సాజిద్ నడియాడ్వాలాతో మాట్లాడారు.

తామిద్దరం కలిసి కిక్2 గురించి చర్చించుకున్నామని, అయితే ఇందులో మాత్రం జాక్వెలిన్ ఉండదని, ఆమెను 'కికౌట్' చేశామని చెప్పాడట. సల్మాన్ సరదాగా అన్నాడు అనుకోడానికి లేదని, తన మనసులో ఉన్న విషయాన్ని ఆయన ఇలాంటి కామెంట్ల ద్వారానే బయటకు చెబుతాడని సల్లూభాయ్కి సన్నిహితంగా ఉండే వాళ్లు అంటున్నారు. దీనంతటికీ కారణం ఏంటా అని చూస్తే.. సల్మాన్కు జైలుశిక్ష పడినప్పుడు సినీ ప్రపంచం మొత్తం ఆయనకు అండగా నిలబడింది గానీ, అప్పుడు జాక్వెలిన్ అసలు అటువైపు వెళ్లలేదట. అప్పుడు తాను ప్రయాణంలో ఉన్నట్లు ఆమె చెబుతున్నా, దాని గురించి సోషల్ మీడియాలో కూడా ఏమీ వ్యాఖ్యానించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement