వారసులతో నటిస్తున్న జాగ్వుర్‌తంగం
వారసులతో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రముఖ స్టంట్‌మాస్టర్ జాగ్వుర్‌తంగం. చిత్రాన్ని నిర్మించడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో తన ఒక కొడుకును హీరోగానూ మరో కొడుకును ముఖ్య పాత్రలోనూ నటింపజేస్తూ, తాను కీలక పాత్రలో నటిస్తూ, ఆ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించే సాహసం చేస్తున్నారు జాగ్వుర్‌తంగం మాస్టర్‌గా 1007 చిత్రాలకు పని చేసిన ఘనత జాగ్వుర్‌తంగంది.
అందులో కమలహాసన్, సత్యరాజ్, శరత్‌కుమార్, విజయ్, అజిత్, సూర్య పలువురు ప్రముఖ నటులు నటించిన చిత్రాలున్నాయి. అలాంటి ఫైట్‌మాస్టర్ ఇప్పుడు ఇండియా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయన కొడుకు విజయ్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు. మరో కొడుకు జయ్‌జాగ్వుర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
జాక్వుర్‌తంగం గ్రామ రక్షకుడిగా కీలక పాత్ర పోషిస్తూ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శాంతి జాగ్వుర్ సహనిర్మాతగా వ్యవహరి స్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విజయ్‌చిరంజీవి, జయ్‌జాక్వుర్‌ల మధ్య పోరాట సన్నివేశాన్ని ఇటీవల చెన్నైలోని ఒక కళాశాలలో చిత్రీకరించారు. మరో రెండు భారీ ఫైట్స్‌ను తలకోణంలోని అడవీ ప్రాంతంలో చిత్రీకరించారు. శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రంలో శివాని నాయకిగా నటిస్తున్నారు.