
జాన్వీ కపూర్
సవాళ్లంటే ఇష్టం.. సాదాసీదాగా మిగిలిపోవడం అంటే అయిష్టం అన్నట్లుగా ఉంది జాన్వీ కపూర్ తీరు. ఆమె ఒప్పుకుంటున్న సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘ధడక్’లాంటి లవ్‌స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ వెంటనే భారత పైలెట్ గుంజన్ సక్సెనా జీవితకథలో నటించడానికి అంగీకరించారు. పైలెట్ పాత్ర కోసం శిక్షణ తీసుకుని మరీ సెట్లోకి అడుగుపెట్టారు. తాజాగా మరో సినిమాకి సై అన్నారు. ఈసారి ఏకంగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
అందులో ఒకటి దెయ్యం పాత్ర అట. గత ఏడాది రాజ్‌కుమార్ రావ్‌తో సూపర్ హిట్ సినిమా ‘స్త్రీ’ తీసిన దినేజ్ విజయ్ ఈ హారర్ చిత్రానికి నిర్మాత. రాజ్‌కుమార్ రావ్ హీరో. మృగ్‌దీప్ మరో నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ జూలైలో ప్రారంభం కానుంది. ‘రుహి ఆప్జా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ‘ట్రాప్డ్, క్వీన్’ చిత్రాలకు స్క్రిప్ట్ విభాగంలో పనిచేసిన హార్ధిక్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment