
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఆధారంగా కొన్ని చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరో చిత్రం సిద్ధమవుతోంది. శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమల దేవస్థాన నిర్మాణం, వెంకటేశ్వర స్వామి మహిమలను కళ్లకు కట్టినట్లుగా చూపించనున్నారు దర్శక–నిర్మాత సాయివెంకట్. స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జయహో రామానుజ’. ఈ చిత్రం లోగోను హైదారాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా గాయకుడు జే.యల్. శ్రీనివాస్‌ను హాలీవుడ్‌లో బతుకమ్మ పాట పాడినందుకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలచారి, నటి కవిత, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment