ఎలా రక్షించాడు? | jayam kondaan movie remake in telugu | Sakshi
Sakshi News home page

ఎలా రక్షించాడు?

Published Sun, Mar 15 2015 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

jayam kondaan movie remake in telugu

వినయ్, భావన జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘జయం కొండాన్’ని ఆర్. సత్యనారాయణ తెలుగులోకి ‘మార్గం’ పేరుతో అనువదించారు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఆర్. కన్నన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. లండన్‌లో ఉదోగ్యం వదిలేసి, ఇండియా వచ్చిన కుర్రాడు అనుకోని సంఘటనలో ఇరుక్కుంటాడు. అందులోంచి తనను, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అనేది కథ. విద్యాసాగర్ స్వరపరచిన పాటలను త్వరలో విడుదల చేయాలనుకుంటున్నాం. తమిళంలో వంద రోజులాడిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement