చదలవాడ లక్ష్మణ్, ‘జయం’ రవి, సౌందర్య రాజన్
‘‘నేను చిన్నప్పుడు హైదరాబాద్‌లోనే పెరిగాను. ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ హ్యాపీగా ఉన్నాను. కారణం చిత్రవిజయంతో ఇక్కడి రావటమే. మా నాన్నగారు ఎడిటర్ మోహన్ ఎంత బాగా పబ్లిసిటీ చేస్తారో చదలవాడ లక్ష్మణ్‌గారు అంతే పబ్లిసిటీ చేస్తారు. అందుకే భవిష్యత్‌లో ఈ బ్యానర్‌తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను. ‘టిక్ టిక్ టిక్’ చాలా మంచి ప్రయత్నం. రిజల్ట్ కొంచెం తేడాగా వచ్చినా భవిష్యత్‌లో ఇలాంటి సినిమాలకు తగిన ప్రోత్సాహం ఉండదని కొందరు అన్నారు. కానీ రిజల్ట్ బాగుండటం హ్యాపీ. 15 ఏళ్ల క్రితం తెలుగు ‘జయం’ తమిళ రీమేక్ ‘జయం’ చిత్రం ద్వారా హీరో అయ్యాను.
అప్పుడు ‘జయం’ విడుదలైన జూన్ 22నే ఇప్పుడు ‘టిక్ టిక్ టిక్’ విడుదల కావడం, సక్సెస్ అవ్వడం ఓ మంచి జ్ఞాపకం. ఈ చిత్రంలో నాతో పాటు నా కొడుకు ‘ఆరవ్’ నటించాడు’’ అన్నారు. ‘జయం’ రవి హీరోగా శక్తి సౌందర్యరాజన్ దర్శకత్వంలో రూపొందిన ‘టిక్ టిక్ టిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్మణ్ చదలవాడ రిలీజ్ చేశారు. సోమవారం చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. సౌందర్య రాజన్ మాట్లాడుతూ – ‘‘ఆసియాలోనే తొలి స్పేస్ సినిమా ‘టిక్ టిక్ టిక్’. ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మౌత్ పబ్లిసిటీ ద్వారా మా సినిమా సక్సెస్ సాధించింది. హాలీవుడ్‌లో ఇలాంటి సినిమా చేస్తే ఎంత ఖర్చవుతుందో అందులో 10 శాతం ఖర్చుతో నిర్మించిన చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత లక్ష్మణ్.
Comments
Please login to add a commentAdd a comment