tic tic tic
-
అవకాశాలు లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను..
తమిళసినిమా: నటి నివేదా పేతురాజ్ బిజీ కథానాయకిగా మారిపోయింది. మదురైలో పుట్టి, దుబాయ్‌లో పెరిగిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో హీరోయిన్ అయ్యింది. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తుతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న నివేదాకు ఆ తరువాత అవకాశం రావడానికి కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. అవకాశాలు లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను గానీ, వాటి కోసం ఎవరినీ అడగనని తెగేసి చెప్పిన నివేదా పేతురాజ్‌కు ఆ అవసరం రాలేదు. అంతే ఆ తరువాత ఉదయనిధికి జంటగా నటించిన పొదువాగ ఎన్ మనసు తంగం ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయినా సక్సెస్ఫుల్ నటుడు జయంరవికి జంటగా నటించే భారీ అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. అంతే లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. మధ్యలో మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విజయ్‌ఆంటోని సరసన తిమిరు పుడిచ్చవన్, ప్రభుదేవాతో పొన్ మాణిక్యవేల్ చిత్రాలతో పాటు తెలుగులో బ్రోచేవారెవరురా చిత్రంలోనూ నటించేస్తోంది. తాజాగా మరో లక్కీచాన్స్‌ను కొట్టేసింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. మైనా, కుంకీ, తొడరి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రభుసాల్మన్ తాజాగా కుంకీ–2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కుంకీ చిత్రంలో విక్కమ్‌ప్రభుతో పాటు నటి లక్ష్మీమీనన్‌కు సినీ లైఫ్‌ను ఇచ్చిన ప్రభుసాల్మన్ ఇప్పుడు కుంకీ–2లో నవ నటుడు మదిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జంటగా నటి అతిథిమీనన్ నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా నటి నివేదాపేతురాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అమ్మడు రెండో నాయకిగా నటిస్తోందా లేక అతిథిమీనన్‌ను తొలగించి నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. కుంకీ–2 చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే థాయిల్యాండ్‌లోని ఏనుగులు నివసించే దట్టమైన అడవుల్లో జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం నివేదా పేతురాజ్ ఏకంగా 70 రోజులు కాల్షీట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బెన్ ఇండియా అనే బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. -
పుత్రోత్సాహంలో జయంరవి
తమిళసినిమా: మనిషి ఆనందాన్ని వెతుక్కుంటున్న రోజులివి. సినీరంగంలో కూడా సంతోషం గగనంగా మారింది. విజయం వరించడమే కష్టంగా మారింది. అలాంటిది ప్రముఖ యువ నటుడు జయంరవి డబుల్ హ్యాపీలో ఖుషీ అయిపోతున్నారు. ఒకటి ఆయన నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడడం, మరొకటి పుత్రోత్సాహం. శక్తిసౌందర్‌రాజన్ దర్శకత్వంలో నెమిచంద్ జపక్ నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. డీ.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆయనకు 100వ చిత్రం కావడం మరో విశేషం. ఈ చిత్రం ద్వారా జయంరవి కొడుకు ఆరవ్‌రవి బాలనటుడిగా పరిచయం అయ్యాడు. చిత్రంలోనూ జయంరవికి కొడుకుగానే నటించాడు. భారతీయ సినీ చరిత్రలోనే తొలి అంతరిక్ష ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రంగా నమోదైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను శుక్రవారం చిత్ర యూనిట్ చెన్నైలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జయంరవి మాట్లాడుతూ టిక్ టిక్ టిక్ చిత్ర విజయానికి ముఖ్య కారణం ప్రేక్షకులేనన్నారు. అందుకే వారికి హ్యాట్సాప్ చెబుతున్నానన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సాధారణ విషయం కాదని అలాంటిది సమర్థవంతంగా తెరకెక్కించిన దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ ఈ విజయానికి కారణంగా పేర్కొన్నారు. యూనిట్ సభ్యులందరూ పూర్తి ఎఫర్ట్ పెట్టి చేసిన చిత్రం టిక్ టిక్ టిక్ అని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. కారణం ఇందులో తన కొడుకు ఆరవ్ రవి తొలిసారిగా నటించాడని అన్నారు. చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య ప్రేమను ఆవిష్కరించే కురుంబా అనే పాటను తాను ఇప్పుటికి రెండు వేల సార్లు విన్నానని తెలిపారు. శుక్రవారం ఆరవ్‌రవి పుట్టిన రోజు అని, ఈ ఆనందంతో పాటు, టిక్ టిక్ టిక్ సక్సెస్ వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని జయంరవి పేర్కొన్నారు. కార్యక్రమంలో జయం రవి తండ్రి ఎడిటర్ మోహన్, సోదరుడు, దర్శకుడు మోహన్‌రాజా, చిత్ర దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, డీ.ఇమాన్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ముందుగా ఆరవ్‌రవి పుట్టిన రోజును పురష్కరించుకుని ఆ బాలనటుడితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. -
జూన్ 22... ఓ మంచి జ్ఞాపకం
‘‘నేను చిన్నప్పుడు హైదరాబాద్‌లోనే పెరిగాను. ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ హ్యాపీగా ఉన్నాను. కారణం చిత్రవిజయంతో ఇక్కడి రావటమే. మా నాన్నగారు ఎడిటర్ మోహన్ ఎంత బాగా పబ్లిసిటీ చేస్తారో చదలవాడ లక్ష్మణ్‌గారు అంతే పబ్లిసిటీ చేస్తారు. అందుకే భవిష్యత్‌లో ఈ బ్యానర్‌తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను. ‘టిక్ టిక్ టిక్’ చాలా మంచి ప్రయత్నం. రిజల్ట్ కొంచెం తేడాగా వచ్చినా భవిష్యత్‌లో ఇలాంటి సినిమాలకు తగిన ప్రోత్సాహం ఉండదని కొందరు అన్నారు. కానీ రిజల్ట్ బాగుండటం హ్యాపీ. 15 ఏళ్ల క్రితం తెలుగు ‘జయం’ తమిళ రీమేక్ ‘జయం’ చిత్రం ద్వారా హీరో అయ్యాను. అప్పుడు ‘జయం’ విడుదలైన జూన్ 22నే ఇప్పుడు ‘టిక్ టిక్ టిక్’ విడుదల కావడం, సక్సెస్ అవ్వడం ఓ మంచి జ్ఞాపకం. ఈ చిత్రంలో నాతో పాటు నా కొడుకు ‘ఆరవ్’ నటించాడు’’ అన్నారు. ‘జయం’ రవి హీరోగా శక్తి సౌందర్యరాజన్ దర్శకత్వంలో రూపొందిన ‘టిక్ టిక్ టిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్మణ్ చదలవాడ రిలీజ్ చేశారు. సోమవారం చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. సౌందర్య రాజన్ మాట్లాడుతూ – ‘‘ఆసియాలోనే తొలి స్పేస్ సినిమా ‘టిక్ టిక్ టిక్’. ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మౌత్ పబ్లిసిటీ ద్వారా మా సినిమా సక్సెస్ సాధించింది. హాలీవుడ్లో ఇలాంటి సినిమా చేస్తే ఎంత ఖర్చవుతుందో అందులో 10 శాతం ఖర్చుతో నిర్మించిన చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత లక్ష్మణ్. -
నాకు అందులో ఆసక్తి అధికం..
తమిళసినిమా: ప్రస్తుతం కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న నటీమణుల్లో నివేదాపేతురాజ్ ఒకరు. ఒరు నాళ్‌కూత్తు చిత్రంతో రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు తొలి చిత్రంతోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా నివేదాపేతురాజ్కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. తాజాగా జయంరవితో అంతరిక్షంలో సాహసోపేతంగా రొమాన్స్ చేసిన టిక్ టిక్ టిక్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపై నివేదాపేతురాజ్ చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సందర్భంగా నివేదాపేతురాజ్ చెబుతున్న సంగతులేంటో చూద్దాం. ప్ర: మీ సినీ పయనం గురించి? జ: నేను పుట్టింది మదురైలోనే. అయితే పెరిగింది దుబాయ్‌లో. అక్కడ నా అనుభవం 14 ఏళ్లు. అందాల పోటీల్లో పాల్గొన్నాను. అవే తనను కోలీవుడ్‌లో కథానాయకిని చేశాయి. వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అలా ఇప్పుడు 8వ చిత్రంలో నటిస్తున్నాను. ప్ర: తెలుగులోనూ కాలిడినట్లున్నారే? జ: పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం చూసి తెలుగులో నటించే అవకాశం కల్పించారు. అక్కడ కొన్ని చిత్రాలు చేస్తున్నాను. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. ప్ర: సరే నటిగా మీ ప్రణాళిక ఏమిటి? జ: నిజం చెప్పాలంటే నటిగా నాకు ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. వచ్చిన అవకాశాల్లో నచ్చిన చిత్రాలను చేసుకుంటూపోతున్నాను. యోగాపై ఆసక్తి ఉంది. దర్శకత్వం చేయాలన్న ఆశ ఉంది. అందుకోసమే చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ప్ర: టిక్ టిక్ టిక్ చిత్రం గురించి? జ: ఇందులో స్వాతి అనే పాత్రలో నటించాను. షూటింగ్‌కు సెట్లోకి వెళుతున్నప్పుడే హాలీవుడ్ సెట్లోకి వెళుతున్న భావన కలిగేది. చాలా వినూత్న అనుభవం. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.ఈ చిత్రంలో నేను పోరాటాలు కూడా చేశాను. ప్ర: సినిమా రంగంలో గట్టి పోటీ నెలకొంటుందిగా? జ: నేను అవకాశాల కోసం అంటూ నేనెవరి వద్దకూ వెళ్లి అడిగిందిలేదు. దీన్ని ఘనతగానే భావిస్తాను. ఇక్కడ పని లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను. నా పని నేను చేసుకుపోతున్నాను. అందుకే వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్ర: మీలో ఇతర ప్రత్యేకతలు? జ: పెయింటింగ్స్ బాగా వేస్తాను. అందులో ఆసక్తి అధికం. పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని స్నేహితులు అంటున్నారు. అయితే అందుకు ఇంకా చాలా శ్రమించాల్సి ఉంది. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కార్ రేస్‌లో పాల్గొని గెలుపోటములు పొందిన అనుభవం ఉంది. ఇలాంటి సాహసాలు చేయపోతే జీవితంలో మజా ఏం ఉంటుంది. ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం. అదే సమయంలో భయం ఉంది. -
కాలమే శత్రువు
గెలవాలని ఓ టీమ్ అంతరిక్షంలోకి బయలుదేరింది. ఓడిపోతే దాదాపు 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుంది. ఆ టీమ్ ప్రధాన శత్రువు టైమ్ అంట. మరి.. గెలవడానికీ ఈ టీమ్ లీడర్ ఏం చేశాడు? అంతరిక్షంలో వాళ్లు ఎలాంటి అవరోధాలను అధిగమించాల్సి వచ్చింది? ఇటువంటి ఆసక్తికర అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘టిక్. టిక్. టిక్’. శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా నటించారు. నివేథా పేతురాజ్, రమేశ్ తిలక్, అరోణ్ అజీజ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 22న విడుదల కానుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్ ఈ చిత్రాన్ని ‘టిక్. టిక్. టిక్’ పేరుతోనే తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ‘‘సినిమా సెన్సార్ పూర్తయింది. ఆల్రెడీ రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇది. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ‘బిచ్చగాడు, డీ 16’ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. వాటిని మించిన విలక్షణమైన చిత్రమిది’’ అన్నారు నిర్మాత చదలవాడ లక్ష్మణ్. -
అంతరిక్షంలో టిక్ టిక్
‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో అంతరిక్ష (స్పేస్) నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘టిక్ టిక్ టిక్’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని తెలుగులో త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘జనవరి 1న నేను ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌పై కూర్చున్నప్పుడు ఓ ఫారిన్ కపుల్ వచ్చి, ‘మీది ఇండియానా?’ అనడిగారు. అవునని చెప్పా. ‘బాహుబలి’ పదిసార్లు చూశామన్నారు. మన ఇండియన్ సినిమాకి అంత గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ మనవాళ్లు అమెరికన్ సినిమాలు చూస్తారు. అటువంటి స్థాయిలో తీసిన సినిమా ‘టిక్ టిక్ టిక్’’ అన్నారు. ‘‘మన దేశంలో వచ్చిన ఫస్ట్ స్పేస్ ఫిల్మ్ ఇది. ఇటువంటి సినిమాలను ఈజీగా చేయలేం. ఒక్కొక్క షాట్ వెనుక చాలా కష్టం ఉంటుంది. టీజర్, ట్రైలర్లలో ప్రేక్షకులు చూసినదాని కంటే సినిమాలో పది రెట్లు ఎక్కువ ఉంటుంది’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘స్టార్ వార్స్’ టైమ్ నుంచి స్పేస్ నేపథ్యంలో ఇండియాలో ఎవరు సినిమా చేస్తారా? అనుకునేవాణ్ణి. తమిళంలో ‘టిక్ టిక్ టిక్’ చేస్తున్నారని తెలిసి పోటీ ఎక్కువగా ఉన్నా తెలుగు హక్కులు తీసుకున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు చదలవాడ లక్ష్మణ్. దర్శకులు అజయ్, అల్లాణి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా: వెంకటేశ్. -
ఆయనతో చేసేందుకు భయపడ్డా: నటి
తమిళసినిమా: ఆయన గర్వంలేని నటుడు అని తెగ పొగిడేస్తోంది వర్ధమాన నటి నివేదా పేతురాజ్. నటీనటులు చాలా చిత్రాలు చేస్తుంటారు. అయితే అందులో కొన్ని చిత్రాలపైన నమ్మకం పెరుగుతుంది. పలాన చిత్రం తన కెరీర్లో మలుపురాయిగా నిలిచిపోతుందనే భావన కలుగుతుందని నటి నివేదా పేతురాజ్ అన్నారు. ఈ బ్యూటీ ఏమంటుందో చూద్దాం. నేను నటించిన తొలి చిత్రం ఒరునాళ్‌కూత్తు మంచి సక్సెస్‌ను అందించింది. మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నా చేతిలో మూడు చిత్రాలున్నాయి. వాటిలో జయం రవితో నటిస్తున్న టిక్ టిక్ టిక్ ఒకటి. ఇందులో తాను ఏంజిల్ గెటప్‌లో కనిపిస్తానని చెప్పింది. స్టార్ హీరో జయం రవికు జంటగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆయనతో కలిసి నటించడానికి ముందు చాలా భయపడ్డానని ఆమె అన్నారు. కాని ఆయన మాత్రం చాలా సౌమ్యంగా సన్నివేశంలో నటించేటప్పుడు ఎన్ని టేక్‌లు తీసుకున్నా సహనం పాటించారు. నిజంగా ఆయన గ్రేట్. ఎంత నిరాడంబరుడో అని రవిని పొగిడింది. టిక్ టిక్ టిక్ చిత్రంలో నాది చాలా బలమైన పాత్ర అని ఈ చిత్ర విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇక ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. అదేవిధంగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది చాలా జాలీగా సాగే కథా చిత్రంగా ఉంటుంది అని నివేదాపెతురాజ్ పేర్కొంది.