sucessmeet
-
అమ్మకు థ్యాంక్స్
‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందన్నారు. ఆ పాజిటివ్ టాక్ వల్లే మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. ఇలాంటి సినిమా నాతో తీసినందుకు అమ్మకు థ్యాంక్స్’’ అన్నారు నాగశౌర్య. రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా ఐరా క్రియేషన్స్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. జనవరి 31న విడుదలై మా చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది అన్నారు చిత్రబృందం. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘రమణ తేజకు ఫుడ్, సినిమా.. ఈ రెండే ప్రాణం. అతడిని నమ్మినందుకు సినిమాని బాగా తీశాడు. మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చెయ్యను’’ అన్నారు. నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘శౌర్య రాసిన కథ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు సినీ పరిశ్రమకు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ చేసిన సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నానని, ఈ సినిమాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని శౌర్య అన్నప్పుడు ఆశ్చర్యపోయా. తను కథ బాగా రాసుకున్నాడు’’ అన్నారు రచయిత, దర్శకుడు బి.వియస్ రవి. రమణ తేజ మాట్లాడుతూ– ‘‘శౌర్య నటించిన విధానానికి హ్యాట్సాఫ్. మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఉషా మూల్పూరి మాట్లాడుతూ– ‘‘శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా ‘అశ్వథ్థామ’ నిలిచినందుకు ఫుల్ హ్యాపీ. ఐరా క్రియేషన్స్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్. ఇకముందు కూడా మా బ్యానర్ మంచి సినిమాలు అందిస్తుంది’’ అన్నారు. ‘‘ఐరా క్రియేషన్స్ ఏ సినిమా చేసినా టెక్నీషియన్లు, యాక్టర్లు అందరూ ఫ్యామిలీలా పనిచేస్తారు. అది వాళ్ల బలం’’ అన్నారు దర్శకురాలు నందినీ రెడ్డి. చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, సినిమాటోగ్రాఫర్ మనోజ్‌రెడ్డి, ఎడిటర్ గ్యారీ, నటుడు ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 22... ఓ మంచి జ్ఞాపకం
‘‘నేను చిన్నప్పుడు హైదరాబాద్‌లోనే పెరిగాను. ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ హ్యాపీగా ఉన్నాను. కారణం చిత్రవిజయంతో ఇక్కడి రావటమే. మా నాన్నగారు ఎడిటర్ మోహన్ ఎంత బాగా పబ్లిసిటీ చేస్తారో చదలవాడ లక్ష్మణ్‌గారు అంతే పబ్లిసిటీ చేస్తారు. అందుకే భవిష్యత్‌లో ఈ బ్యానర్‌తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను. ‘టిక్ టిక్ టిక్’ చాలా మంచి ప్రయత్నం. రిజల్ట్ కొంచెం తేడాగా వచ్చినా భవిష్యత్‌లో ఇలాంటి సినిమాలకు తగిన ప్రోత్సాహం ఉండదని కొందరు అన్నారు. కానీ రిజల్ట్ బాగుండటం హ్యాపీ. 15 ఏళ్ల క్రితం తెలుగు ‘జయం’ తమిళ రీమేక్ ‘జయం’ చిత్రం ద్వారా హీరో అయ్యాను. అప్పుడు ‘జయం’ విడుదలైన జూన్ 22నే ఇప్పుడు ‘టిక్ టిక్ టిక్’ విడుదల కావడం, సక్సెస్ అవ్వడం ఓ మంచి జ్ఞాపకం. ఈ చిత్రంలో నాతో పాటు నా కొడుకు ‘ఆరవ్’ నటించాడు’’ అన్నారు. ‘జయం’ రవి హీరోగా శక్తి సౌందర్యరాజన్ దర్శకత్వంలో రూపొందిన ‘టిక్ టిక్ టిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్మణ్ చదలవాడ రిలీజ్ చేశారు. సోమవారం చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. సౌందర్య రాజన్ మాట్లాడుతూ – ‘‘ఆసియాలోనే తొలి స్పేస్ సినిమా ‘టిక్ టిక్ టిక్’. ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయం సాధించటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మౌత్ పబ్లిసిటీ ద్వారా మా సినిమా సక్సెస్ సాధించింది. హాలీవుడ్లో ఇలాంటి సినిమా చేస్తే ఎంత ఖర్చవుతుందో అందులో 10 శాతం ఖర్చుతో నిర్మించిన చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత లక్ష్మణ్. -
ఈ సినిమా మహేశ్‌కి నన్ను దగ్గర చేసింది
‘‘సమ్మోహనం’ కథని 2012లో రాసుకుని కొందరికి వినిపించాను. శివలెంక కృష్ణప్రసాద్‌గారు మాత్రం కథ వినగానే సినిమా చేస్తానన్నారు. అంతే కాకుండా నాపై, కథపై నమ్మకంతో ఈరోజు వరకూ ఆయన సినిమా చూడలేదు’’ అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఆయన దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈనెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘పెళ్ళిచూపులు’ సినిమాలో ఓ సన్నివేశం చూసి, ఆ ఇన్స్పిరేషన్తో ‘సమ్మోహనం’ కథను తయారు చేసుకున్నాను. సుధీర్‌బాబు చాలెంజింగ్‌గా నటించారు. నా కథ వినగానే సినిమా చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఒప్పుకున్నాడు. కెమెరామెన్ విందా నా మనసులో ఏముందో అది తెర మీద చూపిస్తారు. మా మధ్య మంచి అనుబంధం ఉంది’’ అన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా చేస్తున్నాడు కదా! వీడేంటో? అని సామాన్యులు దూరంగా ఉండిపోయారు. అలాంటి వాళ్లకు నన్ను దగ్గర చేసిన చిత్రం ‘సమ్మోహనం’. ఇప్పటివరకూ నన్ను ‘ప్రేమకథా చిత్రమ్’ సుధీర్‌బాబు అని పిలిచేవారు. ఇకపై ‘సమ్మోహనం’ సుధీర్‌బాబు అంటారు. మహేశ్ బావగా నాకు దగ్గరే కానీ.. యాక్టర్‌గా కాస్త గ్యాప్ ఉండేదనిపించేది. ఈ సినిమా ఓ యాక్టర్‌గా నన్ను తనకు దగ్గర చేసింది. షూటింగ్లో నరేశ్‌గారిని నిజమైన నాన్నగానే భావించా. ఇంద్రగంటిగారు భాషను ప్రేమించేంతలా భార్యను కూడా ప్రేమించరు’’ అన్నారు. ‘‘కథ విన్న రోజు నుంచి ‘సమ్మోహనం’ గొప్ప హిట్ అవుతుందని చెప్పా.. అన్నట్టుగానే అయ్యింది. జంధ్యాలగారికి రీప్లేస్మెంట్ ఉండదు. ఆయనలాగే ఇంద్రగంటిగారికి కూడా రీప్లేస్మెంట్ లేదు’’ అన్నారు నటుడు నరేశ్. ‘‘సమ్మోహనం’ లాంటి మంచి సినిమాను నేను చేయడానికి కారణమైన సుధీర్‌బాబు, మోహనకృష్ణకు థ్యాంక్స్’’ అన్నారు శివలెంక కృష్ణ ప్రసాద్. సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నటుడు తనికెళ్ల భరణి, నటి పవిత్రా లోకేశ్, దర్శకుడు తరుణ్ భాస్కర్, కెమెరామెన్ పి.జి.విందా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి పాల్గొన్నారు. -
నవ్వుకోవడానికి మా సినిమాకి రండి – నితిన్
‘‘నేను ఇండస్ట్రీకొచ్చిన 16 ఏళ్లలో 25సినిమాలు చేశా. ఇన్నేళ్లు నాపై ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు థ్యాంక్స్. ప్రతి సినిమాకీ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ‘ఛల్ మోహన్‌రంగ’ గొప్ప కథ అని చెప్పను. ప్రేక్షకులు హ్యపీగా ఎంజాయ్ చేయటానికి తీశాం. హాయిగా నవ్వుకోవటానికి మా సినిమాకు రండి’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. నిఖితారెడ్డి సమర్పణలో సుధాకర్ రెడ్డి, పవన్ కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో కృష్ణ చైతన్య మాట్లాడుతూ–‘‘ఏ ఉద్దేశంతో సినిమా తీశామో దాన్ని చేరుకున్నాం అనిపిస్తోంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. పెద్ద కథ ఉన్నప్పుడ్డు పని సులువు అవుతుంది. చిన్న కథను చెప్పేటప్పుడు ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా చేయాలంటే కష్టం. మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారంటే ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్’’ అన్నారు. ‘‘చిన్న పాయింట్‌ని తీసుకుని అందంగా చెప్పి హిట్ అందుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు నటుడు నరేశ్. ‘‘మా సినిమాపై ఇంత ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. నాకు ఈ అవకాశమిచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, నితిన్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు మేఘా ఆకాశ్. సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి, నటులు మధునందన్, శ్రీను పాల్గొన్నారు. -
ఆ కష్టం ‘ఛలో’తో తెలిసింది – నిర్మాత ఉష
‘‘మేం గతంలో మా ఫ్యామిలీతో సినిమాలు చూసేవాళ్లం. సినిమా తీయాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు ఉంటే చాలనుకునేవాళ్లం. కానీ మా ‘ఐరా క్రియేషన్స్ బ్యానర్’ ప్రారంభించాక ఓ విషయం అర్థమైంది. తెరమీద కనిపించే వారి వెనక వందలాది శ్రామికుల కష్టం ఉంటుందని’’ అన్నారు నిర్మాత ఉష మూల్పూరి. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఆమె నిర్మించిన చిత్రం ‘ఛలో’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయపథంలో దూసుకెళుతోందని ఉష తెలిపారు. ఈ సందర్భంగా ‘ఛలో’ చిత్రానికి పని చేసిన 24 క్రాఫ్ట్స్ వాళ్లని సత్కరించారు. అనంతరం ఉష మాట్లాడుతూ– ‘‘వెంకీ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే మేం ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. ఐరా క్రియేషన్స్ మొదలు పెట్టడానికీ, ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చిన వెంకీకి కృతజ్ఞతగా కారు గిఫ్ట్‌గా ఇచ్చాం. తను మరిన్ని విజయాలు సాధించాలి’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘సినిమాకి వెళతానంటే నా తల్లిదండ్రులు డబ్బులిచ్చారు. నాగశౌర్య తల్లిదండ్రులు డబ్బులిచ్చి సినిమా తీసారు. వారి రుణం మరచిపోను. ఈ చిత్రం చేసే అవకాశం ఒక గిఫ్ట్ అయితే.. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ హిట్ చేయటం డబుల్ గిఫ్ట్... ఇప్పుడు నాకు కారు గిఫ్ట్ ఇవ్వటం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌గా ఫీలవుతున్నా. నాగశౌర్య పరిచయం కాకపోతే నాకు ఈ జీవితం లేదు’’ అన్నారు. శంకర్ ప్రసాద్, నాగశౌర్యలతో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. -
ఆ శక్తి వాళ్లను నాశనం చేస్తుంది
‘‘గాయత్రి’ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్లో పెట్టారు. ఒక సైట్లో 2 లక్షల మంది, ఇంకో సైట్లో 75 వేల మంది చూశారని అమెరికా నుంచి మిత్రులు ఫోన్ చేసి చెప్పారు. సినిమా విడుదలైన రోజే పైరసీ సీడీలు వస్తుంటే ఏం చేయాలి? నిర్మాతగా హృదయంలో ఏడుస్తున్నాను. కళ్లలో నీళ్లు కూడా రావడంలేదు’’ అని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు లీడ్ రోల్లో నటించి, నిర్మించిన సినిమా ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వం వహించారు. విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘పైరసీ బారిన పడ్డ నాలాంటి నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు బయటకు రాలేక, చెబితే వినేవాడు లేక ఉన్నారు. 42 ఏళ్ల సినిమా కెరీర్ ఉన్న నేను చెబితే కొంచెం అయినా చెవిన పడుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ‘గాయత్రి’ కోసం తొమ్మిది నెలలు కష్టపడ్డాను. చేతికి, మోకాలికి సర్జరీ జరిగినా లెక్క చేయలేదు. దేవుడి దయవల్ల, ప్రేక్షకుల ప్రేమ వల్ల అన్నీ సంపాదించాను. నేను.. నా కుటుంబం.. నా బిడ్డలు... ఓ నలుగురికి సాయం చేయగలుగుతున్నాం. ‘అయ్యా.. పైరసీ చూసే మహానుభావుల్లారా. దయచేసి చూడొద్దు’. మనందరం దేవుణ్ణి.. ఏదో ఓ శక్తి ఉందని నమ్ముతాం. ఆ పైరసీ చూసేవాళ్లందర్నీ ఆ శక్తి నాశనం చేస్తుంది. ఎదుటివాడు చెడిపోవాలనుకుంటే మనమే చెడిపోతాం. పైరసీ చేసినవాళ్లు, దాన్ని చూసే వాళ్లు ఉంటే ఎక్కడికి పోతుందీ దేశం. రిలీజ్ రోజే పైరసీ చేసింది థియేటర్ ఆపరేటరా? ఓనరా? ఇంకా ఎవరైనానా? ఇవన్నీ ఆ శివుడు.. సాయినాథుడికే ఎరుక. ‘రౌడీ’ సినిమా అప్పుడు ‘విష్ణు ఎంత చక్కగా చేస్తున్నాడు’ అన్నాడు రామ్‌గోపాల్ వర్మ. డబ్బు ముఖ్యమా? పేరు ముఖ్యమా అంటే పేరే ముఖ్యం అంటాను నేను. ఏ తండ్రి అయినా బిడ్డల్ని చూసి పొందేదే సంతోషం. యంగ్ శివాజీ పాత్రలో విష్ణుకి మంచి పేరు వచ్చింది. శ్రియ కూడా బాగా చేసింది. వీడియో పైరసీ చేసినవాళ్లను కూడా ఆ దేవుడు చల్లగా చూడాలి’’ అన్నారు. మదన్ రామిగాని మాట్లాడుతూ– ‘‘సినిమాకు మేము చేసిన పబ్లిసిటీ కంటే మౌత్ టాక్ చాలా ఎక్కువగా ఉంది. విజయవాడకు చెందిన నాటక పరిషత్ వాళ్లు ‘గాయత్రి’ సినిమా నటులకు డిక్షనరీలా ఉంటుంది అన్నారు. ‘మోహన్‌బాబుకు వయసు అయిపోదా? ఆ ఎనర్జీ ఏంటి?’’ అని రాయలసీమలో ఓ ఫ్రెండ్ అన్నాడు. ఈ సినిమాకి ఇవి రెండూ బెస్ట్ కాంప్లిమెంట్స్. మోహన్‌బాబుగారు హిట్స్.. ఫ్లాప్స్ పట్టించుకోరు. కథ నచ్చితే చేస్తారు. హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ ఏదో స్టంట్ చేస్తూ గాయపడ్డాడని ప్రపంచం మొత్తం మాట్లాడుకున్నారు. మోహన్‌బాబుగారు భుజం నొప్పితో వారం రోజులపాటు ఫైట్ సీన్లో పాల్గొన్నారు. వయసులో టామ్ క్రూజ్ కంటే మోహన్ బాబుగారే పెద్ద. ఎందుకు మనం మనవాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకోమో తెలియదు. పరాయి వాళ్ల గొప్పలే కనిపిస్తుంటాయి మనకు. మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి కానీ అప్లై చేయం, విల్ పవర్ ఉంటుంది కానీ వాడం. మోహన్‌బాబుగారు ఆ రెండూ చేస్తారు. మా కెరీర్లో ‘గాయత్రి’ ఒక మంచి మైలు రాయి. ఈ సినిమా గొప్పతనం మెల్లిగా తెలుస్తుంది. సినిమాల్లో 24 క్రాఫ్ట్‌లే కానీ 25వ క్రాఫ్ట్ రావాలి.. అదే ఆత్మ పరిశీలన. ఈ సినిమాకు అది జరిగింది. ప్రతీ సీన్ ఒకటికి మూడు సార్లు ఆలోచించి తీశాము’’ అన్నారు. ‘‘భారతదేశంలో ఇద్దరి పరిస్థితే బాగోలేదు. ఒకరు రైతు, ఇంకొకరు నిర్మాత. సినిమా రాకముందే రివ్యూలు వచ్చేస్తున్నాయి. రోజు గడవకముందే పైరసీ ప్రింట్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు నిర్మాత’’ అన్నారు డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు. నేను ఏ పార్టీవాణ్ణి కాదు ‘గాయత్రి’ సినిమాలో కొన్ని డైలాగ్స్ వివాదంగా ఉన్నాయనీ.. ఓ పార్టీని ఉద్దేశించి ఆ డైలాగ్స్ మాట్లాడాననే మాటలు విన్నాను. నేను ఏ పార్టీకీ చెందినవాణ్ణి కాదు. రోజూ పేపర్లో చూసే కొన్ని ఛలోక్తులు సినిమాలో వాడాం. నేను రాజకీయాల గురించి త్వరలో మాట్లాడతాను. ఏ పార్టీకి ఓటు వేయాలో.. ఏ పార్టీకి వేస్తే నష్టపోతారో చెబుతాను. -
రాజా ది గ్రేట్' సక్సెస్‌మీట్