ఆ మైనస్సులే నాకు ప్లస్సులు | Jayapradha talking about her biopic | Sakshi
Sakshi News home page

ఆ మైనస్సులే నాకు ప్లస్సులు

Published Fri, Jul 10 2020 12:35 AM | Last Updated on Fri, Jul 10 2020 12:35 AM

Jayapradha talking about her biopic - Sakshi

జయప్రద

ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద బయోపిక్‌ కూడా తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి జయప్రద మాట్లాడుతూ –‘‘నా జీవితంలో నేను చాలా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఈ విషయాలన్నింటినీ చెబుతూ నా బయోగ్రఫీ రాయాలనుకుంటున్నాను. ఆ తర్వాత నా బయోపిక్‌ను తెరకెక్కించే ఆలోచన కూడా ఉంది. ఇందులో నేనే నటించవచ్చు కూడా.

అంకితభావం, పట్టుదల, మొండితనం.. ఈ మూడు లక్షణాలు స్త్రీకి ఉండకూడదంటారు. మైనస్‌ అంటారు. నాలో ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి. అవి నాకు ప్లస్సే కానీ మైనస్‌గా భావించడంలేదు. ఎందుకంటే ఈ మూడు లక్షణాలూ నన్ను స్ట్రాంగ్‌ ఉమెన్‌ని చేశాయి. వీటిని  నాకు ప్రసాదించిన ఆ దేవుడికి ధన్యవాదాలు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ –‘‘ఇటీవలే ఓ మారాఠీ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అలాగే ఓ వెబ్‌ సిరీస్‌కు సైన్‌ చేశాను. మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాను’’ అన్నారు జయప్రద.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement