![Jessi movie updates - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/20/Untitled-14.jpg.webp?itok=FcbSGeha)
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. వి. అశ్వినికుమార్ దర్శకత్వంలో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్వేతాసింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌మీట్‌లో పీవీఆర్ సినిమా ఉదయ్ మాట్లాడుతూ– ‘‘జెస్సీ’ సినిమాకు ఇంత పెద్ద రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని ఊహించలేదు. మల్టీఫ్లెక్స్‌లో ఒక్క షోతో స్టార్ట్ అయి, 7 షోలతో రన్ అవుతుంటే... వన్ షోతో స్టార్ట్ అయిన సింగిల్ స్క్రీన్స్ 4 షోలతో రన్ అవుతున్నాయి.
మొదటి మూడు రోజుల్లో ప్రతి రోజూ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి’’ అన్నారు. ‘‘ఆడియన్స్ టాక్ విన్న తర్వాత మేం పడ్డ కష్టమంతా మరచిపోయాం. మాపై నమ్మకంతో పీవీఆర్ సినిమాస్ వారు సినిమాను విడుదల చేశారు. వారి నమ్మకం నిజమైంది’’ అన్నారు శ్వేతా సింగ్. ‘‘చిన్నగా విడుదలైన మా సినిమా హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది’’ అని వి. అశ్వినికుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment