అభయ తారకం | Jr NTR shares first pictures of son Abhay Ram ahead of his birthday! | Sakshi
Sakshi News home page

అభయ తారకం

Published Tue, May 19 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

అభయ తారకం

అభయ తారకం

 పుట్టినరోజు ఉత్సాహం... పుత్రోత్సాహం ... రెండూ అందంగా పెనవేసుకు  పోవడమంటే ఇదేనేమో. హీరోగా స్టార్ స్టేటస్ సాధించిన తారక్  (చిన్న ఎన్టీఆర్) అంతకన్నా... తాను పొందిన తండ్రి హోదాతో మరింత ఆనందం పొందుతున్నారు. బుధవారం  జరుపుకోనున్న పుట్టినరోజు  సందర్భంగా ఒకరోజు ముందే  అభిమానులకు ఆయన  కన్నుల పండుగ చేశారు.

కుమారుడు అభయ్ రామ్ నందమూరి ఫోటోలు ట్విట్టర్‌లో పెట్టారు.  ‘‘నాపై ప్రేమ,ఆప్యాయత కురిపిస్తూ, నేనింతదూరం ప్రయాణించడానికి కారణమైన  ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొన్న తారక్, ‘‘అందుకు బదులుగా నా ప్రత్యేక కానుక’’ అంటూ తన బర్‌‌తడే పార్టీకి రిటర్‌‌న గిఫ్ట్‌లా ఈ ఫోటోలు ట్వీట్ చేశారు.  సుకుమార్‌తో సినిమాకు సిద్ధమైన తారక్ ముందేఈ స్పెషల్ ఫోటో షూట్‌తో  ఫ్యాన్‌‌సకు భలే గిఫ్టిచ్చారు. ఆల్ ది బెస్ట్ తారక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement