సూర్యను భర్తగా పొందడం నా అదృష్టం : జ్యోతిక | Jyothika's '36 Vayathinile' (36 Vayadhinile) Audio Released | Sakshi
Sakshi News home page

సూర్యను భర్తగా పొందడం నా అదృష్టం : జ్యోతిక

Published Tue, Apr 7 2015 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

సూర్యను భర్తగా పొందడం నా అదృష్టం : జ్యోతిక

సూర్యను భర్తగా పొందడం నా అదృష్టం : జ్యోతిక

 ‘‘నా కలలను, ఆశయాలను ప్రోత్సహించడానికి సూర్య ఏమాత్రం వెనకాడరు. ఆయన్ను భర్తగా పొందడం నా అదృష్టం. ఈ చిత్రం విషయానికొస్తే.. నా కెరీర్‌లో ‘ది బెస్ట్’గా నిలిచిన చిత్రాల జాబితాలో చేరుతుంది’’ అని జ్యోతిక అన్నారు. కొంత విరామం తర్వాత ఆమె నటించిన చిత్రం ‘36 వయదినిలే’. మలయాళ చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యు’కి ఇది రీమేక్. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని హీరో, జ్యోతిక భర్త సూర్య నిర్మించడం విశేషం. సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల వేడుక చెన్నయ్‌లో జరిగింది.
 
 సూర్య మాట్లాడుతూ -‘‘నేను అభిమానులను ఎప్పుడు కలిసినా, ‘జ్యోతిక మళ్లీ ఎప్పుడు నటిస్తారు’ అని అడిగేవాళ్లు. మంచి సినిమా అయితేనే జ్యోతిక చేయాలనుకుంది. ‘36 వయదినిలే’ రైట్ మూవీ అనిపించింది’’ అన్నారు. మా వదిన జ్యోతికకు నేను పెద్ద అభిమానిని అని కార్తీ పేర్కొన్నారు. ఈ వేడుకలో సూర్య, జ్యోతికల కుమార్తె దియా, కుమారుడు దేవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సూర్య తండ్రి శివకుమార్, బాల, వసంత్, వెంకటప్రభు, పాండిరాజ్, రాధామోహన్, కె.ఇ. జ్ఞానవేల్‌రాజా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement