
కాజల్ అగర్వాల్
కథానాయికగా వచ్చి పన్నెండేళ్లు పూర్తయినా కాజల్ అగర్వాల్ సినిమాలు సైన్ చేయడంలో ఏ మార్పు లేదు. అదే స్పీడ్‌తో వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. ఈ ఏడాది గడిచిన ఆర్నెలల్లో ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్ అయింది (సీత). రెండు సినిమాలు పూర్తయ్యాయి (రణరంగం, తమిళ చిత్రం కోమలి) కూడా. ఇప్పుడు మరో కొత్త చిత్రాన్ని కాజల్ అంగీకరించారని తెలిసింది. అది తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందనుండటం మరో విశేషం. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించనున్న చిత్రం ‘భక్త కన్నప్ప’. ఇందులో విష్ణుకి జోడీగా కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఈ సినిమాను భారీ వ్యయంతో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించాలన్నది విష్ణు ఆలోచన. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తారని తెలిసింది. ప్రస్తుతం లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు విష్ణు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment