తెరపై మణి జీవితం! | Kalabhavan Mani life story on screen | Sakshi
Sakshi News home page

తెరపై మణి జీవితం!

Published Wed, Apr 6 2016 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

తెరపై మణి జీవితం!

తెరపై మణి జీవితం!

తెలుగు, తమిళ భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ  నటుడు ‘కళాభవన్’ మణి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనుమానాస్పదమైన ఆయన మరణం వెనుక ఉన్న పూర్తి కారణాలు పోలీసులు పరిశోధించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే  ఇప్పుడాయన  జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ‘వసంతియుమ్ లక్ష్మియుమ్ పిన్నె న్యానుమ్’  అనే చిత్రంతో మణిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరోగా మార్చిన దర్శకుడు వినయన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.
 
 మరో విశేషమేమిటంటే, ఈ చిత్రంతోనే మణి సోదరుడు రామకృష్ణన్ తెరంగేట్రం చేయనున్నారు. ఆటోడ్రైవర్ నుంచి మిమిక్రీ ఆర్టిస్టుగా మారి, అటుపై సినీ రంగంలో స్థిరపడిన మణి జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశించనున్నారట. మిస్టరీగా మారిన మణి జీవితం తెరపై రావడానికి సిద్ధం కావడం మలయాళ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement