Kalabhavan Mani
-
ఎవరూ రాలేదని నన్ను పట్టుకుని ఏడ్చేశాడు: నటుడు
కళాభవన్ మణి.. ఈ మలయాళ నటుడు తెలుగువారికీ సుపరిచితుడే! జెమిని, ఆయుధం, అర్జున్, నరసింహుడు, నగరం.. ఇలా పలు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, మలయాళంలోనే కాదు తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు. ప్లేబ్యాక్ సింగర్‌గానూ తన టాలెంట్ చూపించాడు. మలయాళ చిత్రపరిశ్రమలోనే తొలిసారి జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా సత్తా చాటాడు. రక్తం కక్కుకుని.. విభిన్న పాత్రలు పోషించిన మణి 2016లో రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. డిప్రెషన్‌తో బాధపడుతున్న అతడు మద్యం అతిగా తాగడం వల్లే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఫోరెన్సిక్ టెస్ట్‌లో పురుగుమందు ఆనవాళ్లు కూడా లభించడంతో అప్పట్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. చూడగానే నచ్చేశాడు ఈ విషయాన్ని పక్కన పెడితే కళాభవన్ మణితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నటుడు సురేశ్ గోపి. 'ఫస్ట్ టైం మణిని చూడగానే నచ్చేశాడు. ఇప్పటికీ తనపై నాకు ఆ ప్రేమ, అభిమానం అలాగే ఉంది. అతడి పేరు ఎత్తగానే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటేమో.. అరేబియన్ డ్రీమ్స్ అని ఓ షో కోసం మేమంతా దుబాయ్ వెళ్లాము. నా గది పెద్దదిగా ఉంటుంది. మర్చిపోలేని జ్ఞాపకం.. మేమంతా కలిసి ఒకే గదిలో కింద కార్పెట్ వేసుకుని నిద్రించాము. అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం.. ఇంకోటి.. అతడి పెళ్లి రోజు. నన్ను చూడగానే సంతోషంతో ఏడ్చేశాడు. తన పెళ్లికి ఎవరూ రాలేదని, నేనొక్కడినైనా వచ్చినందుకు ఆనందంగా ఉందంటూ నన్ను హత్తుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే మనసు భావోద్వేగానికి లోనవుతుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చాయ్ తాగేందుకు కూడా డబ్బుల్లేని దుస్థితి.. ఆ హీరో ఆదుకోవడం వల్లే.. -
నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ
తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి కేసును సీబీఐ ఛేదించనుంది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐబీకి బదిలీ చేశారు. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను గత నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు అంతకుముందు సీబీఐ నిరాకరించడంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్టుపట్టారు. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. -
నటుడి మృతిపై సీబీఐ దర్యాప్తు
తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై ఏడాదిగా మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐని కేరళ హైకోర్టు ఆదేశించింది. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థకు సూచించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు వారం రోజుల క్రితం సీబీఐ నిరాకరించింది. దీంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్ట్టారు. సీఎం పినరయి విజయన్ కూడా సీబీఐ విచారణకు మొగ్గు చూపారు. అయితే దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ నిరాకరిచింది. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. -
కళాభవన్ మణి మృతి కేసులో ట్విస్ట్
కొచ్చి: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై మిస్టరీ కొనసాగుతోంది. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన అంశాలతో ఆయన మృతిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెలుగు చూసింది. అయితే కళాభవన్ మణి శరీరంలో ఎంత శాతం మిథనాల్ ఉంది, అది ఎంతవరకు ఆయన మరణానికి కారణం అయిందనేది వెల్లడి కాలేదు. పురుగు మందుల అవశేషాలు లేవని తేల్చింది. ఫోరెన్సిక్ నివేదికపై స్పష్టత కోసం సీఎఫ్ఎస్ఎల్ ను కేరళ పోలీసులు సంప్రదించనున్నారు. మణి శరీరంలో ప్రమాదకరమైన క్రిమిసంహారిణి 'క్లోర్ పిరిఫొస్' అవశేషాలు ఉన్నట్టు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రం అంతకుముందు వెల్లడించింది. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి ఈ ఏడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తెరపై మణి జీవితం!
తెలుగు, తమిళ భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ నటుడు ‘కళాభవన్’ మణి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనుమానాస్పదమైన ఆయన మరణం వెనుక ఉన్న పూర్తి కారణాలు పోలీసులు పరిశోధించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడాయన జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ‘వసంతియుమ్ లక్ష్మియుమ్ పిన్నె న్యానుమ్’ అనే చిత్రంతో మణిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరోగా మార్చిన దర్శకుడు వినయన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రంతోనే మణి సోదరుడు రామకృష్ణన్ తెరంగేట్రం చేయనున్నారు. ఆటోడ్రైవర్ నుంచి మిమిక్రీ ఆర్టిస్టుగా మారి, అటుపై సినీ రంగంలో స్థిరపడిన మణి జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశించనున్నారట. మిస్టరీగా మారిన మణి జీవితం తెరపై రావడానికి సిద్ధం కావడం మలయాళ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. -
మణి కేసులో ముమ్మర దర్యాప్తు
తిరువనంతపురం: మళయాల నటుడు కళాభవన్ మణి శరీర అవయవ నమూనాల్లో క్రిమిసంహారక మందు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టు తేల్చిన నేపథ్యంలో.. ఆయన మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మణి కుటుంబసభ్యులు కోరితే అత్యున్నతస్థాయిలో సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కేరళ సీఎం ఊమెన్ చాందీ తెలిపారు. రక్తం కక్కుకుని ఆస్పత్రిలో చేరిన ఈ నటుడు ఈ నెల 6న మృతి చెందిన సంగతి తెలిసిందే. తొలుత కాలేయ, కిడ్నీ అనారోగ్యాన్నే కారణంగా భావించిన వైద్యవర్గాలు.. మరింత స్పష్టత కోసం మణి నమూనాలను కోచిలోని కక్కనాడ్లో రీజనల్ కెమికల్ ఎగ్జామినర్ ల్యాబొరేటరీకి పంపగా.. ఆయన అవయవాల నమూనాలలో అత్యంత ప్రమాదకరమైన ‘క్లోరిపైరిఫోస్’, మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ తదితర క్రిమిసంహారక మందులు ఉన్నాయని శుక్రవారం తేలింది. ఈ నేపథ్యంలో.. ‘మరణానికి ముందు మణి స్నేహితులతో కలసి మద్యం సేవించారు. నా సోదరునికి మద్యం ఇచ్చిన స్నేహితులపై అనుమానంగా ఉంది.. వారిని అరెస్టు చేసి విచారించాల’ని మణి సోదరుడు రామకృష్ణన్ కోరారు. మణి అవుట్‌హౌస్‌లో పోలీసుల సోదా మణి అవుట్ హౌస్‌లో సోదా చేసిన పోలీసులకు అక్కడ కొన్ని పురుగుమందులు లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వీటిని ల్యాబ్ పరీక్షకు పంపి.. మణి శరీర అవయవాల్లో లభించిన మందులా కాదా అన్నది తేల్చుకోనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
'ఆయన మరణం చాలా బాధ కలిగించింది'
చెన్నై : నటుడు కళాభవన్ మణి మృతి కోలీవుడ్‌లోనూ విషాద ఛాయలను నింపింది. మలయాళం నుంచి వచ్చిన కళాభవన్ మణి బహుభాషా నటుడు. మాతృభాషలో కథానాయకుడిగా పలు చిత్రాలు చేసిన ఆయన తమిళం, తెలుగు తదితర భాషల్లో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించారు. తమిళంలో కమలహాసన్, విక్రమ్, సూర్య వంటి ప్రముఖ కథానాయకులతో నటించి ప్రాచుర్యం పొందారు. ఆయా చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకుల గుండెల్లోనూ సుస్థిర స్థానాన్ని పొందిన కళాభవన్ మణి మరణం తమిళ చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కోలీవుడ్‌లో కళాభవన్ మణి నట పయనం 1998లో మరుమలర్చి చిత్రం నుంచి ఇటీవల కమలహాసన్ నటించిన పాపనాశం వరకూ నిరాటంకంగా సాగింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమలహాసన్ సంతాపం వ్యక్తం చేస్తూ మిత్రుడు కళాభవన్ మణి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన మరణం చాలా బాధ కలిగిందన్నారు. కళాభవన్ మణి బాణీను ఆయన వల్ల స్ఫూర్తి పొందిన నటులు చిత్ర పరిశ్రమలో ఉన్నారని గుర్తు చేశారు. నటుడు సూర్య తన సంతాపం తెలియజేస్తూ కళాభవన్ మణి చాలా మంచి నటుడన్నారు. ఆయనతో స్నేహం నా గుండెల్లో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయనీ, కళాభవన్ మణి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సూర్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కళాభవన్ మణి మృతిపై అనుమానాలు!
చలక్కుడి(కేరళ): ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ మణి అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. అభిమానులు, సన్నిహితులు, సహనటులు ఆయనకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. చివరిసారిగా 'పేదల సూపర్ స్టార్'ను దర్శించుకునేందుకు జనం పోటెత్తడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని మూడు ప్రాంతాల్లో ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు కళాభవన్ మణి పార్థీవదేహానికి నివాళి అర్పించారు. త్రిశూర్ జిల్లా చలక్కుడిలోని సొంత నివాసంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కళాభవన్ మణి సోదరుడి కుమారుడు దినేశ్.. ఆయన చితికి నిప్పటించారు. ఈ సమయంలో అభిమానుల రోదనలు మిన్నంటాయి. మండుతున్న చితికి దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించిన అభిమానులను పోలీసులు వెనక్కు లాక్కేళ్లారు. కాగా, కళాభవన్ మణిది సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అంతర్గత అవయవాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. కళాభవన్ మణి శరీరంలో అనుమానాస్పద రసాయన పదార్థం గుర్తించినట్టు కొచ్చి ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో అసహజ మరణంగా ఆదివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కళాభవన్ మణి చివరిసారిగా గడిపిన అవుట్ హౌస్ లో ఈ ఉదయం ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. ఇక్కడి నుంచే కళాభవన్ మణిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. మద్యపానం అలవాటున్న ఆయన లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోయారని అంతకుముందు వైద్యులు తెలిపారు. -
ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ కన్నుమూత
కొచ్చి: ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ మణి(45) కన్నుమూశారు. కొంత కాలంగా లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కొచ్చిలో తుది శ్వాస విడిచారు. ఈయన ఒక నటుడుగానే కాకుండా జానపద గీతాలను ఆలపించడంలో కూడా పేరు సంపాధించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన కళాభవన్.. దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు. విలనిజంలోనూ తనదైన కామెడీ ముద్రను కళాభవన్ వేశారు. ముఖ్యంగా తెలుగులో ఆయన నటించిన చిత్రం అనగానే గుర్తొచ్చేది జెమినీనే. జెమినీ సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్‌తో విలక్షణ విలన్ పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా అనగానే లడ్డానే గుర్తు చేసుకునేట్లుగా నటించారు. ముఖ్యంగా' నా పేరే లడ్డా.. జెమినీకంటే పేద్ద రౌడీని' అంటూ పలికించిన సంభాషణలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కమేడియన్‌గా, విలన్‌గానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇక పలు మళయాల సినిమాల్లో హీరోగా కూడా నటించారు. తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడా అభిమానం సొంతం చేసుకున్నారు. ఆటోడ్రైవర్ నుంచి ప్రముఖ విలక్షణ నటుడి స్థాయికి.... ఈయన పాపులర్ సింగర్ కూడా. సల్లాపం అనే చిత్రంలోని తన పాత్రకు అనూహ్యంగా గొప్ప పేరొచ్చి ఆయన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారుఉ. 1999లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. జాతీయ అవార్డుల్లో పోటీ పడ్డారు. లివర్ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. 'నటుడు కళాభవన్ శనివారం కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచాం. ఆదివారం రాత్రి 7.15గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు' అని వైద్యులు తెలిపారు. కేరళలోని చలక్కుడి అనే ప్రాంతానికి చెందిన కళాభవన్ నటుడు కాకముందు ఆటో డ్రైవర్ గా చేసేవారు.