కళాభవన్ మణి.. ఈ మలయాళ నటుడు తెలుగువారికీ సుపరిచితుడే! జెమిని, ఆయుధం, అర్జున్, నరసింహుడు, నగరం.. ఇలా పలు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, మలయాళంలోనే కాదు తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు. ప్లేబ్యాక్ సింగర్‌గానూ తన టాలెంట్ చూపించాడు. మలయాళ చిత్రపరిశ్రమలోనే తొలిసారి జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా సత్తా చాటాడు.
రక్తం కక్కుకుని..
విభిన్న పాత్రలు పోషించిన మణి 2016లో రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. డిప్రెషన్‌తో బాధపడుతున్న అతడు మద్యం అతిగా తాగడం వల్లే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఫోరెన్సిక్ టెస్ట్‌లో పురుగుమందు ఆనవాళ్లు కూడా లభించడంతో అప్పట్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.
చూడగానే నచ్చేశాడు
ఈ విషయాన్ని పక్కన పెడితే కళాభవన్ మణితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నటుడు సురేశ్ గోపి. 'ఫస్ట్ టైం మణిని చూడగానే నచ్చేశాడు. ఇప్పటికీ తనపై నాకు ఆ ప్రేమ, అభిమానం అలాగే ఉంది. అతడి పేరు ఎత్తగానే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటేమో.. అరేబియన్ డ్రీమ్స్ అని ఓ షో కోసం మేమంతా దుబాయ్ వెళ్లాము. నా గది పెద్దదిగా ఉంటుంది.
మర్చిపోలేని జ్ఞాపకం..
మేమంతా కలిసి ఒకే గదిలో కింద కార్పెట్ వేసుకుని నిద్రించాము. అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం.. ఇంకోటి.. అతడి పెళ్లి రోజు. నన్ను చూడగానే సంతోషంతో ఏడ్చేశాడు. తన పెళ్లికి ఎవరూ రాలేదని, నేనొక్కడినైనా వచ్చినందుకు ఆనందంగా ఉందంటూ నన్ను హత్తుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే మనసు భావోద్వేగానికి లోనవుతుంది' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: చాయ్ తాగేందుకు కూడా డబ్బుల్లేని దుస్థితి.. ఆ హీరో ఆదుకోవడం వల్లే..
Comments
Please login to add a commentAdd a comment