ప్రభాకర్, మూల విరాట్
ప్రజాకవి, ప్రముఖ రచయిత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత స్వర్గీయ కాళోజీ నారాయణరావు జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ ‘ప్రజాకవి–కాళోజీ’ పేరుతో ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ‘‘కాళోజీగారి జీవితమంతా పోరాటమే. ఆ పోరాటాన్ని ‘ప్రజాకవి– కాళోజీ’గా తెరకెక్కిస్తున్నాం. కాళోజీ పాత్రలో శ్రీ మూలవిరాట్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారి పాత్రను వారి తమ్ముడు మనోహర రావుగారు పోషిస్తున్నారు. కాళోజీ భార్యగా విజయలక్ష్మీ జైనీ కనిపిస్తారు. ఈ సినిమాకు ఎస్‌ఎస్. ఆత్రేయ సంగీతదర్శకుడు’’ అని చిత్రబృందం తెలిపింది. కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ళ రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, పొట్టపల్లి శ్రీనివాసరావు, కవి అన్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment