
కుంజాలి మరాక్కర్ షిప్‌లో ప్రయాణించడానికి ఒక్కొక్కరుగా రెడీ అవుతున్నారు. హీరో మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్ ఈ షిప్ జర్నీకి శ్రీకారం చూట్టారు. ఇటీవలే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, యాక్షన్ కింగ్ అర్జున్ ఈ షిఫ్ జర్నీకి ఓకే చెప్పారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ కూడా వీరితో జాయిన్ అవుతాను అంటున్నారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరాక్కర్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందనుంది. 16వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. అప్పటి నేవల్ అధికారి కుంజలి మరాక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో యంగ్ మోహన్‌లాల్‌గా ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ నటిస్తారు.
ఇందులోనే కల్యాణీ ప్రియదర్శన్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి.. ఇద్దరూ తమ ఫాదర్స్‌తో ఒకే మూవీలో వర్క్ చేయబోతుండటం విశేషం. అంతేకాదండోయ్.. ఈ సినిమాలోని ఓ స్పెషల్ రోల్‌కి కీర్తీ సురేశ్ కూడా ఓకే చెప్పారట. క్యారెక్టర్ ప్రకారం ఆమె చియాంగ్ జువాన్ అనే చైనీస్ వ్యక్తిని లవ్ చేస్తారట. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 1న స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తెలుగులో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే