అతన్ని నెల రోజుల్లో మర్చిపోతా!
ప్రేమ చాలా ప్రమాదకరమైనది. లవ్‌లో పడితే ప్రపంచమంతా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఒక్క లవర్ తప్ప ఎవరూ ముఖ్యం కాదనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ లవర్‌నుంచి విడిపోతే అసలు జీవితమే ముఖ్యం కాదనిపిస్తుంది. చివరకు ఆత్యహత్య చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. కంగనా రనౌత్‌కి అయితే అలా అనిపించదు. లవ్ ఫెయిల్యూర్‌ని నేను చాలా తేలికగా తీసుకుంటానని కంగనా రనౌత్ చెబుతూ -
‘‘లవ్‌లో ఫెయిల్ అవ్వడం అంటే నా జీవితానికో మంచి అనుభవం దొరికినట్లే అని భావిస్తా. ఆ వ్యక్తి గురించి పదే పదే ఆలోచించను. ఎందుకంటే నాకు నేనంటే బోల్డంత ప్రేమ. ఆ ప్రేమే నన్ను అవతలి వ్యక్తిని సులువుగా మర్చిపోయేలా చేస్తుంది. ఒక వ్యక్తి నుంచి విడిపోయాక అతన్ని నేను పూర్తిగా మర్చిపోవడానికి జస్ట్ నెల రోజులు మాత్రమే పడుతుంది. ప్రేమలో ఫెయిలైన ఆడవాళ్లకు నేను ఇచ్చే సలహా ఒక్కటే.
‘మగవాణ్ణి అతిగా నమ్మితే మోసపోక తప్పదు. అందుకే నమ్మకండి. అతన్నుంచి విడిపోయినా బతకగలగాలి. అంతకుముందుకన్నా బాగా బతకాలి. మన జీవితం చూసి మనమే గర్వపడేలా బతకాలి. ఒకవేళ నమ్మకస్తుడితో ప్రేమలో పడితే అతనితో బంధాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. అతనితో జీవితాంతం కొనసాగాలి’’ అన్నారు.