ముద్దు సీన్లు ఉంటే చాలు బాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్!
ముద్దు సీన్లు ఉంటే చాలు బాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్!
Published Tue, Mar 4 2014 6:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముద్దు సీన్లే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తాయని బాలీవుడ్ దర్శకుడు కర ణ్ జోహార్ కొత్త బాష్యం చెప్పారు. తెరపై ముద్దు సీన్లు ఉంటే బాక్సాఫీస్ ఓపెనింగ్స్ బ్రహ్మండంగా ఉంటాయని కరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ముద్దు సీన్ల ఫార్ములా కరణ్ కలిసి వచ్చిందేమో ఏమో కాని మళ్లీ హైవే హీరోయిన్ ఆలియా భట్‌తో ’2 స్టేట్స్’ అనే చిత్రంలో మరోసారి ఆ ప్రయోగానికి తెర లేపారు.
2012లో కరణ్ జోహార్ నిర్మించిన ’స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంలో ఆలియా, సిద్దార్థ్ మల్హోత్రా ముద్దు సీన్‌కు ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది. అదే జోష్‌తో తన తాజా చిత్రం ‘2 స్టేట్స్’లో ఆలియా, అర్జున్ కపూర్‌లతో కరణ్ ముద్దు సీన్ చిత్రీకరించారట!
ఆలియా, దర్శకుడు అభిషేక్ వర్మన్‌ల మధ్య అఫైర్ నడుస్తోందని వచ్చిన వార్తలు కరణ్ దృష్టికి తీసుకురాగా.. ఆలియా, అర్జున్ కపూర్‌ల మధ్య ఏదో నడుస్తోందని అనుకుంటుంటే..తనకు తెలియని న్యూస్ అందించారనిఇటీవల విడుదల చేసిన ’2 స్టేట్స్’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కరణ్ సరదాగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
Advertisement
Advertisement