
‘దడక్’ చిత్ర దర్శకుడు శశాంక్ కేతన్‌తో హీరో హీరోయిన్లు ఇషాన్, జాన్వీ
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయం అవుతున్న సినిమా దడక్. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాత కరణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. హీరో హీరోయిన్‌లు జాన్వీ, ఇషాన్‌లతో పాటు దర్శకుడు శశాంక్ కేతన్ సరదాగా ఉన్న ఓ ఫొటోను ట్వీట్ చేసిన కరణ్ ‘శశాంక్ కేతన్ గొప్ప మార్గదర్శకుడు, గురువు, స్నేహితుడు అన్నింటింకి మించి గొప్ప దర్శకుడు. జాన్వీ, ఇషాన్‌లు నిజంగా దడక్ గుండె చప్పుడు’ అని కామెంట్ చేశారు. మరాఠిలో ఘన విజయం సాధించిన సైరత్ కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment