టివి నటుడు కరణ్‌వీర్ బోహ్రా ఇటీవల రామాయణంలోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసి విమర్శల పాలయ్యాడు. రామయణంలోని ఓ యుద్ధ సన్నివేశాన్ని జూమ్ చేసి వారు యుద్ధానికి బదులుగా గార్బా ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు అంటూ ఫన్నీ మిమ్స్ క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు ఆయనపై విమర్శల జల్లు కురిపించారు. అంతేగాక దీనికి బ్యాక్‌రౌండ్‌లో ‘లవ్‌యాత్రి’ సినిమాలోని ‘చోగడ’ పాట జోడించాడు. అంతేగాక ‘ఉద్యోగానికి మీరు తగినంత జీతం తీసుకోనప్పుడు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తూ.. @gameofthrones మాదిరిగా వారు ఏ పురాణ యుద్ధాన్ని సృష్టించారో మేము ఆలోచించాము అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. (కుక్కకు డాక్టరేట్ ఇచ్చిన వర్జీనియా వర్శిటీ)
మన సంస్కృతికి అద్దం పట్టే పవిత్ర రామయాణాన్ని హాస్యాస్పదం చేసిన కరణ్‌పై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఇది మన సంస్కృతినే అగౌరవపరిచినట్లు’,‘ఇలాంటి వ్యక్తులే వారి స్వంత సంస్కృతిని పరిహాస్యం చేస్తారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరికొందరు ఆయన దీనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కరణ్ తన పోస్టుకు వివరణ ఇస్తూ.. ‘నేను మన సంస్కృతిని కానీ దేవుళ్లను అగౌరవ పరచలేదు. ఎందుకంటే నేను హిందూ భక్తుడిని. అంతేగాక ఆధ్యాత్మిక భావన కలిగిన వ్యక్తిని కూడా. ఈ పోస్టు వెనకాల ఉన్న ఓ వ్యక్తి యుద్ధంలో పాల్గొనాల్సింది పోగా బదులుగా డ్యాన్స్ చేసినందుకు అతడిని ఉద్దేశిస్తూ ఈ పోస్టు చేశాను’ అని పేర్కొన్నాడు. (ఆయన సోదరుడు షమాస్ కూడా కారణం: అలియా)
Comments
Please login to add a commentAdd a comment