కరీనా కపూర్
ఆలస్యమైనా బాధ లేదు!
Published Tue, Mar 18 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
అందం, నటన, హోదా అన్ని ఉన్నా కరీనా కపూర్‌కు కాలం కలసి రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శుద్ధి, బాంబే సమురాయి సినిమాల భవిష్యత్ ఏమిటో తెలియని పరిస్థితి. ఈమె తిరస్కరించిన క్వీన్, రామ్-లీలా, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, ఫ్యాషన్, బ్లాక్ సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు బాధపడుతోంది. కెరీర్‌లో ఇలాంటివి మామూలేనని, ఈ సినిమాలను వదులుకున్నందుకు బాధ లేదని చెబుతోంది. కరణ్ జోహార్ తీస్తున్న శుద్ధిలో ఫర్హాన్ అఖ్తర్, బాంబే సమురాయిలో హృతిక్ రోషన్ సరసన కరీనా నటించాల్సి ఉంది. హృతిక్‌కు ఆరోగ్య సమస్యలు రావడంతో శుద్ధి షూటింగ్ ఆగిపోయింది.
ఎదురుచూసే ఓపిక లేక కరీనా ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేసింది. బాంబే సమురాయ్‌ను నిర్మిస్తున్న ఎక్సెల్ ఎంటర్‌టైనర్‌మెంట్స్ సంస్థ షారుఖ్ సినిమాతో బిజీగా ఉండడంతో ఈ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే మొదలుకావాల్సి ఉంది. సెప్టెంబర్ వరకు పని మొదలుపెడతామని ఎక్సెల్ చెబుతోంది. వీటిపై కరీనా మాట్లాడుతూ ‘శుద్ధి సినిమాను పూర్తిగా వదిలేశాను. దాంతో నాకు సంబంధమే లేదు. సినిమా నుంచి బయటికి వచ్చినందుకు బాధ లేదు. బాంబే సమురాయ్ ఆలస్యం కావడం వల్ల వ్యక్తిగత జీవితంలో నాకు తగినంత తీరిక దొరికింది.
పెళ్లయింది కాబట్టి సినిమాల కోసం తొందరేం లేదు. సినిమాల ఆలస్యం గురించి మీడియా ఎందుకు ఇంత హడావుడి చేస్తుందో అర్థం కావడం లేదు’ అని వాపోయింది. బాంబే సమురాయ్ చిత్రీకరణకు విదేశీ నిపుణులు అవసరం కాబట్టే సెప్టెంబర్‌కు వాయిదా పడిందని చెప్పింది. ఇవన్నీ ఇలా ఉంటే సింఘమ్ 2లో కరీనాకు అవకాశం వచ్చింది. దీని షూటింగ్ ఈ నెల 25 నుంచి షురూ అవుతోంది. చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, క్వీన్ సినిమాలను తిరస్కరించినందుకు ఇప్పడు బాధపడడం లేదని చెప్పింది. పెద్ద బ్యానర్ల కంటే మంచి కథే తనకు ముఖ్యమని కరీనా కపూర్ వివరించింది.
Advertisement
Advertisement