Ram-Leela
-
ఆలస్యమైనా బాధ లేదు!
అందం, నటన, హోదా అన్ని ఉన్నా కరీనా కపూర్‌కు కాలం కలసి రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శుద్ధి, బాంబే సమురాయి సినిమాల భవిష్యత్ ఏమిటో తెలియని పరిస్థితి. ఈమె తిరస్కరించిన క్వీన్, రామ్-లీలా, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, ఫ్యాషన్, బ్లాక్ సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు బాధపడుతోంది. కెరీర్లో ఇలాంటివి మామూలేనని, ఈ సినిమాలను వదులుకున్నందుకు బాధ లేదని చెబుతోంది. కరణ్ జోహార్ తీస్తున్న శుద్ధిలో ఫర్హాన్ అఖ్తర్, బాంబే సమురాయిలో హృతిక్ రోషన్ సరసన కరీనా నటించాల్సి ఉంది. హృతిక్‌కు ఆరోగ్య సమస్యలు రావడంతో శుద్ధి షూటింగ్ ఆగిపోయింది. ఎదురుచూసే ఓపిక లేక కరీనా ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేసింది. బాంబే సమురాయ్‌ను నిర్మిస్తున్న ఎక్సెల్ ఎంటర్టైనర్మెంట్స్ సంస్థ షారుఖ్ సినిమాతో బిజీగా ఉండడంతో ఈ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే మొదలుకావాల్సి ఉంది. సెప్టెంబర్ వరకు పని మొదలుపెడతామని ఎక్సెల్ చెబుతోంది. వీటిపై కరీనా మాట్లాడుతూ ‘శుద్ధి సినిమాను పూర్తిగా వదిలేశాను. దాంతో నాకు సంబంధమే లేదు. సినిమా నుంచి బయటికి వచ్చినందుకు బాధ లేదు. బాంబే సమురాయ్ ఆలస్యం కావడం వల్ల వ్యక్తిగత జీవితంలో నాకు తగినంత తీరిక దొరికింది. పెళ్లయింది కాబట్టి సినిమాల కోసం తొందరేం లేదు. సినిమాల ఆలస్యం గురించి మీడియా ఎందుకు ఇంత హడావుడి చేస్తుందో అర్థం కావడం లేదు’ అని వాపోయింది. బాంబే సమురాయ్ చిత్రీకరణకు విదేశీ నిపుణులు అవసరం కాబట్టే సెప్టెంబర్‌కు వాయిదా పడిందని చెప్పింది. ఇవన్నీ ఇలా ఉంటే సింఘమ్ 2లో కరీనాకు అవకాశం వచ్చింది. దీని షూటింగ్ ఈ నెల 25 నుంచి షురూ అవుతోంది. చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, క్వీన్ సినిమాలను తిరస్కరించినందుకు ఇప్పడు బాధపడడం లేదని చెప్పింది. పెద్ద బ్యానర్ల కంటే మంచి కథే తనకు ముఖ్యమని కరీనా కపూర్ వివరించింది. -
హీరోలకు దీటుగా... ధీమాగా... దర్జాగా...
ఓ సినిమా విజయం సాధిస్తే... ఆ ఘనతను ఎక్కువ శాతం హీరోకి ఆపాదిస్తారు. అలాగే దర్శకుడికి కూడా కొంత భాగం దక్కుతుంది. కానీ, మెరుపు తీగలా కనిపించి, కనువిందు చేసే హీరోయిన్ గురించి పెద్దగా మాట్లాడుకోరు. అయితే, కొన్ని సినిమాల విషయంలో దీనికి మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది బాలీవుడ్లో బంపర్ హిట్ అయిన సినిమాల్లో హీరోలకు ఎంత భాగం ఉందో, హీరోయిన్లకూ అంతే ఉంది. ఆ సినిమాలో ఆ ‘నాయిక’ నటించి ఉండకపోతే, కచ్చితంగా ఇంత హిట్టయ్యేది కాదనే స్థాయిలో కొంతమంది కథానాయికలకు పేరొచ్చింది. అలా ఈ ఏడాది హీరోలకు దీటుగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం... ఈ ఏడాది బాలీవుడ్ క్వీన్: ఈ ఏడాది బాలీవుడ్లో దీపికా పదుకునేదే హవా. వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాల్లో నటించి, 2013లో ‘నంబర్ వన్’ నాయిక అనిపించుకున్నారు. ఈ సొట్ట బుగ్గల సుందరి నటించిన ‘రేస్ 2’, ‘యే జవానీ హై దివానీ’, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’, ‘రామ్‌లీలా’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రాలన్నీ వంద కోట్ల క్లబ్లో చేరినవే. ఈ చిత్రాల విజయానికి హీరో ఎంత కారణమో, హీరోయిన్ కూడా అంతే కారణమని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఈ విజయాల్లో సమ భాగం దక్కించుకున్నందున దీపికా మార్కెట్ మరింత పెరిగింది. ‘క్వీన్ ఆఫ్ ది 2013’ తనే అని కూడా కితాబులిచ్చేస్తున్నారు. హాట్ గాళ్ మాత్రమే కాదు: హాట్ గాళ్ ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ కేవలం గ్లామరస్ రోల్స్‌కి మాత్రమే పనికొస్తుందనేవారు. కానీ, ఆ అభిప్రాయం మార్చుకునేలా చేశారామె. ఈ మధ్య విడుదలైన ‘క్రిష్ 3’ చిత్రంలో కంగనాతో పాటు ప్రియాంక చోప్రా కూడా నటించినా, కంగనాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక, ‘రజ్జో’ చిత్రంలో తన నటన ‘భేష్’ అంటున్నారు. ఈ చిత్రం మొత్తాన్ని కంగనా తన భుజాల మీద నడిపించేసిందని ప్రశంసిస్తున్నారు. ఇక, జాన్ అబ్రహాం నటించిన ‘షూట్ అవుట్ ఎట్ వదాలా’ విజయంలో కథానాయిక కంగనాకి ఎక్కువ భాగస్వామ్యమే ఉందని బాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. కంగనాని గ్లామరస్ రోల్స్‌కి మాత్రమే కాదు.. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలకు కూడా తీసుకోవచ్చని ఫిక్స్ అయ్యారు. రెడ్ కార్పెట్‌పై హాట్‌గా.. సిల్వర్ స్క్రీన్‌పై హోమ్లీగా: తొలి చిత్రం ‘సావరియా’తో తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారు సోనమ్ కపూర్. వెండితెరపై మాత్రమే కాదు.. విడిగా కూడా చాలా గ్లామరస్‌గా డ్రెస్ చేసుకోవడం సోనమ్ అలవాటు. ముఖ్యంగా పలు వేడుకల్లో గ్లామరస్‌గా డ్రెస్ చేసుకొని ఎర్ర తివాచీపై ఆమె నడిచే హంస నడకలను చూపులు తిప్పుకోకుండా చూసేవారి సంఖ్య చాలానే ఉంది. అలాంటి సోనమ్ ‘రాన్‌జనా’ చిత్రం కోసం పూర్తిగా మారిపోయారు. సాదాసీదా ‘దేశీయ వనిత’గా ఆమె ఒదిగిపోయిన వైనానికి శెభాష్ అనకుండా ఉండలేకపోయారు. ఈ చిత్రవిజయంలో హీరో ధనుష్‌కి ఎంత భాగం ఉందో, అంతే భాగం సోనమ్‌కి కూడా ఉంది. అలాగే, ‘భాగ్ మిల్కా భాగ్’లో సోనమ్ చేసింది చిన్న పాత్రే అయినా, సినిమాకి చాలా ప్లస్ అయ్యిందిసవాల్ని ఎదుర్కొంది: ఈ ఏడాది మంచి నటిగా పేరు తెచ్చుకున్న తారల జాబితాలో నిమ్రత్ కౌర్‌ని విస్మరించలేం. ‘ది లంచ్ బాక్స్’లో హౌస్‌వైఫ్ కేరక్టర్‌ను అద్భుతంగా చేశారు నిమ్రత్. అది కూడా సీనియర్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ ఖాన్ సరసన ఆయనకు దీటుగా నటించడం అంటే ఏ యువ హీరోయిన్‌కైనా సవాల్‌లాంటిదే. ఆ సవాల్‌ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కాబట్టే, ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ మధ్య ఈ యువ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఇంకా ఈ ఏడాది ఇలా ఆయా సినిమాల విజయానికి దోహదపడిన తారల్లో దివ్య దత్తా, హ్యుమా ఖురేషి, రిచా చడ్డా, శిల్పా శుక్లా కూడా ఉన్నారు. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘జిల్లా గజియాబాద్’, ‘లూటేరా’ చిత్రాల్లో దివ్య దత్తా చేసినవి సహాయ పాత్రలే అయినా, ఆ చిత్రాలకు ఓ హీరోయిన్ అన్నట్టుగా అనిపించాయి. అలాగే, ‘ఏక్ తి దయాన్’, ‘డి-డే’, ‘ఫార్ట్స్’ చిత్రాల్లో కథానాయికగా నటించిన హ్యూమా ఖురేషీకి కూడా మంచి పేరొచ్చింది. అందం, అభియం మెండుగా ఉన్న తారగా హ్యుమాని అభినందిస్తున్నారు. ఇక, రిచా చడ్డా విషయానికొస్తే.. ‘ఫక్రి’, ‘షార్ట్స్’, ‘రామ్‌లీలా’ చిత్రాల్లో ఆమె ఓ నాయికగా నటించారు. రిచా అభినయాన్ని విమర్శకులు సైతం అభినందించారు. ‘బి.ఎ. పాస్’ చిత్రంలో బోల్డ్ రోల్ చేసి శిల్పా శుక్లా అందర్నీ ఆకట్టుకున్నారు. శిల్పాకి మంచి భవిష్యత్తు ఉందని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఈ ఏడాది హీరోలతో పాటు హీరోయిన్ల హవా కూడా సాగింది. మరి.. 2014లో కూడా కథానాయికల హవా నడుస్తుందా? ఔననే అంటున్నాయి బాలీవుడ్‌వారు. -
రాముడి, కృష్టుడికి 'రామ్ లీలా'కు సంబంధం లేదు: భన్సాలీ
రామ్ లీలా చిత్ర టైటిల్ భారతీయ పురాణం రామ్ లీలాతోకాని, కృష్ణ భగవానుడి 'రాస్ లీలా'తో ఎలాంటి సంబంధం లేదని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. రామ్ లీలా చిత్రం విలియమ్ షేక్ స్పియర్ 'రోమియో అండ్ జూలియట్' నవల స్పూర్తితో రూపొందించాను అని తెలిపారు. రాముడికి సంబంధించిగాని, కృష్ట భగవానుడికి కథకు సంబంధించిన చిత్ర కాదని, భారత పురాణాలతో ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు అని భన్సాలీ అన్నారు. అశ్లీలంగా, హింసాత్మకంగా, మితీమీరిన శృంగారంతో రామ్ లీలా చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. కావున 15 నవంబర్ తేదిన విడుదలను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాముడికి సంబంధించిన కథ అని ప్రేక్షకులు రామ్ లీలా చిత్రం చూసే అవకాశం ఉంది అని.. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రమాధం ఉంది అని ఢిల్లీ కోర్టులో ఆరుగురు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరి మనోభావాల్ని దెబ్బ తీసేలా లేవు.. ఎవర్ని అవమానించే రీతిలో కూడా లేవు. మత విశ్వాసాలకు భంగం వాటిల్లదు అని సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు. -
హైదరాబాద్ లో 'రామ్ లీలా'
-
'రామ్ లీలా చిత్ర విడుదలను నిలిపివేయండి'
బాలీవుడ్ చిత్రం రామ్ లీలా విడుదలను అడ్డుకోవాలని సామాజిక కార్యకర్త ఊర్వశి శర్మ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. 'గోలియోంకి రాస్ లీలా రామ్ లీలా' చిత్ర టైటిల్ లో 'రామ్ లీలా' పేరును తొలగించాలని శర్మ సూచించారు. రామ్ లీలా పేరును తొలగించి 'గోలియోంకి రాస్ లీలా'గా ఉంచాలని... అప్పటి వరకు చిత్ర విడుదలను ఆపివేయాలని రాష్ట్ర ప్రజల తరపున అఖిలేష్ యాదవ్ కు ఫిర్యాదు చేశాను అని అన్నారు. ఒకవేళ రామ్ లీలా పదాన్ని తొలగించకపోతే.. నేషనల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. 'రామ్ లీలా' పదం లక్షలాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని, వ్యాపార ప్రకటనల్లో చూపిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది అని అన్నారు. తాను యూట్యూబ్ లో ఈ చిత్ర ప్రోమోను చేశానని.. డైలాగ్స్, సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి అని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా, అశ్లీలంగా ఉన్నాయని ఓ సామాజిక కార్యకర్తగా తన అభిప్రాయం అని అన్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లు నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ. ఈ చిత్రం నవంబర్ 15 తేదిన విడుదలవుతోంది. -
అందుకే క్లోజ్‌గా ఉంటాను
తాను ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నా... ఆ హీరోతో ఎఫైర్ నడుపుతున్నట్లుగా వార్తలు పుట్టించేస్తున్నార ని బాలీవుడ్ భామ దీపికా పదుకొనె మీడియా సాక్షిగా అసహనం వ్యక్తం చేశారు. ఈ ముద్దుగుమ్మ ‘రామ్‌లీలా’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కథానాయకుడైన రణవీర్‌సింగ్‌తో తాను సహజీవనం చేస్తున్నట్లు ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ‘రామ్‌లీలా’లో రణవీర్, దీపికాలు రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోయారని, నిజజీవితంలో వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండటం వల్లే... కెమెరా ముందు కూడా అంత బాగా సన్నివేశాలను రక్తికట్టించగలిగారని ఆ కథనాల సారాంశం. వీటితో విసిగిపోయిన దీపిక మీడియాతో మాట్లాడుతూ -‘‘కథను అర్థం చేసుకొని నటిస్తే ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆటోమేటిగ్గా పండుతుంది. అంతే తప్ప సదరు నటుడితో ఎఫైర్ ఉండటం వల్లో, లేక అతనితో క్లోజ్‌గా తిరగడం వల్లో సన్నివేశాలు పండవు. ఈ గాలి కబుర్లు సృష్టించేవారు... తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఆర్టిస్టుగా నేను చాలా ప్రొఫెషనల్ . షూటింగ్ వాతావరణం ఆహ్లాదంగా ఉండటానికి, పని సజావుగా సాగడానికి, సన్నివేశాలు సహజంగా రావడానికీ సహ నటులతో క్లోజ్‌గా ఉంటాను. అది తప్పేం కాదే. దానికి మీ ఇష్టం వచ్చినట్లు ఊహిస్తే ఎలా’’ అంటూ ఘాటుగా స్పందించారు దీపిక. -
‘రామ్‌లీలా’కి నేతలు దూరం
సాక్షి, న్యూఢిల్లీ : రామ్‌లీలా వేదికలు, రాజకీయ నాయకులకు మధ్య అనుబంధానికి సుదీర్ఘ చరిత్రే ఉంది. ఎన్నికల సంవత్సరంలో ఇది మరింత బలపడుతుంది. ప్రజాదరణను పెంచుకోవడానికి నేతలు, వారి మద్దతుదారులు రామ్‌లీలా ప్రదర్శనా స్థలాలను ఆశ్రయిస్తారు. ఎన్నికల సీజన్లో రామ్‌లీలా వేదికలు పరోక్షంగా ఎన్నికల ప్రచార వేదికలుగా మారుతాయి. రాజకీయ నాయకులను రామ్‌లీలా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. వేదికలపై నుంచి ఒకవైపు నేతలు ప్రసంగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు వారి మద్దతుదారులు నినాదాలతో ప్రేక్షకులను అదరగొట్టేస్తుంటారు. నగరవాసులకు సుపరిచితమైన ఈ వాతావరణం ఈసారి రామ్‌లీలా ప్రదర్శనా స్థలాల్లో కనిపించడం లేదు. ఎన్నికలు త్వరలో జరగనున్నప్పటికీ ఈ ప్రదర్శనలకు రావడానికి నేతలు వెనకంజ వేస్తున్నారు. ఎన్నికల అధికారులు ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయడమే ఇందుకు కారణం. తమ కదలికలను ఎన్నికల కార్యాలయం కనిపెడుతుందోననే భయంతో పెద్ద నాయకులతోపాటు టికెట్ ఆశిస్తున్న ఛోటామోటా నేతలు కూడా తమ మద్దతుదారులను ఈ మైదాన్ పరిసరాల్లోకి వెళ్లొద్దంటూ ఆదేశించారు. రామ్‌లీలా ప్రదర్శనా స్థలంలో దక్షిణ ఎమ్సీడీ స్థాయీసంఘం చైర్మన్, మటియాలా సీటు కోసం బీజేపీ టికెట్ ఆశిస్తున్న స్తోన్న కౌన్సిలర్ రాజేశ్గెహ్లాట్ పేరుతో ఉన్న బ్యాన ర్లు కనిపించడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసు జారీచేసింది. దీంతో రాజకీయ నేతలు రామ్లీలాలకు దూరంగా ఉండడమే తమ రాజకీ య భవితవ్యానికి క్షేమమనే అభిప్రాయానికి వచ్చా రు. రాజకీయ నాయకులు, వారి మద్దతుదారుల సందడి లేక మైదానాలు బోసిపోయాయని రామ్‌లీలా నిర్వాహకులు కూడా అంగీకరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిఘా వల్ల ఈ ఏడాది ఎమ్మెల్యేలు, టికెట్ ఆశావహులే కాకుండా ఎంపీలు కూడా రామ్‌లీలా ప్రదర్శనలకు రావడానికి జంకుతున్నారని సదర్‌బజార్ ప్రాంతంలో గడిచిన 60 ఏళ్లుగా రామ్‌లీలా ప్రదర్శిస్తున్న రఘునందన్ లీలా సమితి అధ్యక్షుడు దీపక్ సింఘాల్ చెప్పారు. రామ్ లీలా ప్రదర్శనలకు వస్తామంటూ హామీ ఇచ్చిన నేతలు కూడా ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తమ ఆలోచనను విరమించుకున్నారన్నారు. ఒకరిద్దరు నేతలు వచ్చినా స్వాగత ద్వారం వద్ద తమతో కొద్దిసేపు మాట్లాడి వెనక్కి వెళ్లిపోతున్నారని చెప్పారు. కాగా ప్రతి రోజూ రామ్‌లీలా వేదికల కార్యకలాపాలను వీడియో తీసి తమ నివేదికతో పాటు ఎన్నికల కార్యాలయానికి పంపుతున్నట్లు ఎన్నికల కమిషన్‌లోని నిఘా బృందానికి చెందిన అధికారి మన్మోహన్ చెప్పారు.