'రామ్ లీలా చిత్ర విడుదలను నిలిపివేయండి'
'రామ్ లీలా చిత్ర విడుదలను నిలిపివేయండి'
Published Mon, Nov 11 2013 5:15 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ చిత్రం రామ్ లీలా విడుదలను అడ్డుకోవాలని సామాజిక కార్యకర్త ఊర్వశి శర్మ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. 'గోలియోంకి రాస్ లీలా రామ్ లీలా' చిత్ర టైటిల్ లో 'రామ్ లీలా' పేరును తొలగించాలని శర్మ సూచించారు. రామ్ లీలా పేరును తొలగించి 'గోలియోంకి రాస్ లీలా'గా ఉంచాలని... అప్పటి వరకు చిత్ర విడుదలను ఆపివేయాలని రాష్ట్ర ప్రజల తరపున అఖిలేష్ యాదవ్ కు ఫిర్యాదు చేశాను అని అన్నారు.
ఒకవేళ రామ్ లీలా పదాన్ని తొలగించకపోతే.. నేషనల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. 'రామ్ లీలా' పదం లక్షలాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని, వ్యాపార ప్రకటనల్లో చూపిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది అని అన్నారు.
తాను యూట్యూబ్ లో ఈ చిత్ర ప్రోమోను చేశానని.. డైలాగ్స్, సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి అని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా, అశ్లీలంగా ఉన్నాయని ఓ సామాజిక కార్యకర్తగా తన అభిప్రాయం అని అన్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లు నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ. ఈ చిత్రం నవంబర్ 15 తేదిన విడుదలవుతోంది.
Advertisement