అసలు నేను అందగత్తెనే కాదన్నారు
అసలు నేను అందగత్తెనే కాదన్నారు
Published Thu, Oct 17 2013 12:37 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘ప్రపంచమే నన్ను పొగుడుతున్న సమయంలో, ‘ఈ అమ్మాయి ఎందుకూ పనికి రాదు’’ అని ఓ జర్నలిస్ట్ రాశారు. అప్పుడే తొలి అధ్యాయం మొదలుపెట్టిన వాళ్లకి ఆదిలోనే హంసపాదు పడితే ఎంత బాధపడతారో, ఆరోజు అది చదువుకుని నేనూ అంతే బాధపడ్డాను. ఆరోజు నన్ను విమర్శించిన కలమే ఆ తర్వాత నన్ను అభినందింకపోదు అనుకుని వదిలేశా’’ అన్నారు దీపికా పదుకొనె. ‘ఓం శాంతి ఓం’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైనప్పుడు ఎదురైన చేదు అనుభవం గురించి ఇటీవల ఓ సందర్భంలో దీపికా ఈ విధంగా చెప్పారు. -‘‘ఎవరైనా విమర్శించినప్పుడు ఆత్మస్థయిర్యం కోల్పోతే మనం అక్కడే ఆగిపోతాం.
అందుకే సద్విమర్శలను మాత్రమే తీసుకుని మిగతా వాటిని పట్టించుకోను. అసలు నేను అందగత్తెనే కాదని కూడా రాశారు. కానీ, ‘ఓం శాంతి ఓం’కి అవకాశం ఇచ్చినప్పుడు షారుక్ ఖాన్ కనీసం స్క్రీన్ టెస్ట్ కూడా చేయలేదు. పైగా, ‘నీ వల్ల ఈ సినిమాకి ఫ్రెష్‌నెస్ వచ్చింది’ అని అభినందించారు. షారుక్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన దగ్గరున్నప్పుడు ఎంతో రక్షణగా ఫీలవుతా’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే... త్వరలో విడుదల కాబోతున్న ‘రామ్‌లీలా’లో రణవీర్‌తో దీపికా ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి ప్రస్తుతం బాలీవుడ్‌లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
రోమియో, జూలియెట్ ప్రేమకథ ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ఈ చిత్రంలో రణవీర్, దీపికాల మధ్య బోల్డన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న పెదవి ముద్దు సన్నివేశం గురించి, రణవీర్ ఓ రేంజ్‌లో బిల్డప్ ఇస్తున్నారు. ఈ ముద్దు నిడివి ఎక్కువేనని, కాకపోతే అందంగా చిత్రీకరించడంతో సెన్సార్ కత్తెరకు గురవ్వదనే నమ్మకం ఉందని, తనకు తెలిసి హిందీ పరిశ్రమలో ఇదే ‘బెస్ట్ కిస్’ అవుతుందని రణవీర్ అంటున్నారు. రియల్ లైఫ్‌లో రణవీర్, దీపికా ప్రేమించుకుంటున్నారని టాక్. అందుకని రీల్ మీద వీరిద్దరూ చాలా ఇన్‌వాల్వ్ అయ్యి నటించారని, కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని బాలీవుడ్ టాక్ వచ్చే నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Advertisement
Advertisement