ఫుట్బాల్ నేర్చుకుంటున్న కార్తీ | Karthi learnt football for 'Madras' | Sakshi
Sakshi News home page

ఫుట్బాల్ నేర్చుకుంటున్న కార్తీ

Published Wed, Jun 25 2014 2:31 PM | Last Updated on Mon, Oct 8 2018 4:08 PM

ఫుట్బాల్ నేర్చుకుంటున్న కార్తీ - Sakshi

ఫుట్బాల్ నేర్చుకుంటున్న కార్తీ

తమిళ హీరో కార్తీ కాలు కదుపుతున్నాడు. డాన్సులు ఎప్పటినుంచో చేస్తున్న ఈ యువహీరో.. ఇప్పుడు ఫుట్బాల్ నేర్చుకుంటున్నాడు. రంజిత్ దర్శకత్వంలో కార్తీ కొత్తగా నటిస్తున్న 'మద్రాస్' చిత్రంలో అతడు ఫుట్బాల్ ఆడాల్సిన అవసరం లేకపోయినా, పాత్రకు మాత్రం అవసరమని, అందుకే నేర్చుకుంటున్నాడని రంజిత్ తెలిపారు. ఉత్తర మద్రాసు ప్రాంతంలో ఉండే వాళ్ల పాత్రను కార్తీ పోషిస్తున్నాడని, అక్కడివాళ్లు ఎక్కువగా ఫుట్బాల్ ఆడుతుంటారని అన్నారు. సినిమాలో కొన్ని ఫుట్బాల్ సన్నివేశాలు కూడా ఉండటంతో దానికోసం పదిరోజుల పాటు పూర్తిస్థాయిలో ఫుట్బాల్ నేర్చుకున్నాడని చెప్పారు. తాను అతడిని నేర్చుకొమ్మని చెప్పకపోయినా.. కార్తీయే అంకితభావంతో నేర్చుకుంటున్నాడన్నారు.

కార్తీ చాలా మంచి నటుడని, అతడిని తెల్లవారుజామున 3 గంటలకు షూటింగుకు పిలిచినా, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేశాడని, ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా ఏకధాటితా 30 గంటలు షూటింగ్ చేసినా ఒక్క ఫిర్యాదు కూడా అతడినుంచి లేదని రంజిత్ అన్నారు. కార్తీ సరసన కేథరీన్ ట్రెసా నటిస్తున్న మద్రాస్ చిత్రం ఉత్తర మద్రాసు ప్రాంతవాసుల జీవనచిత్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement